Hulk Hogan: లెజెండరీ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత.. పాపులర్ యాక్టర్ మృతికి కారణమేమిటంటే?

విశ్వ విఖ్యాత లెజెండరీ రెజ్లర్ హల్క్ హోగన్ ఇకలేరు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE)కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఈ క్రీడా యోధుడు గుండెపోటుత మరణించారు. ఈ విషయాన్ని WWE సంస్థ ధృవీకరించింది. ఆయన మరణ వార్తతో క్రీడా, సినీ, వ్యాపార లోకం దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మృతి వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన అందించిన మధురానుభూతులను గుర్తు చేసుకొంటూ సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతివార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హల్క్ హోగన్ గురువారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్ వర్గాలకు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం ఆయనను అంబులెన్స్ వాహనంలో ఎక్కించి హాస్పిటల్‌కు తరలించే సన్నివేశాలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే హస్పిటల్‌కు తీసుకెళ్లిన కొద్ది సేపటికే ఆయన మరణించారని వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణ వార్తను అధికారికంగా వెల్లడించింది.

Hulk Hogan

WWE హాల్ ఆఫ్ ఫేమర్ హల్క్ హోగన్ తుదిశ్వాస విడిచారని తెలియజేయడానికి WWE చింతిస్తున్నది. పాప్ కల్చర్‌లో అత్యున్నత గౌరవాన్ని పొందిన ఆయన మరణించారు. 80వ దశకంలో WWE గ్లోబల్ రికగ్నైజేషన్ పొందరు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, ఫ్యాన్స్‌కు WWE సంతాపం ప్రకటిస్తున్నది.

కొద్ది వారాల క్రితం ఆయన కోమాలోకి వెళ్లారని మీడియా ప్రచురించడంపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిచారు. ఇటీవల జరిగిన సర్జరీల తర్వాత ఆయన ఆరోగ్యపరంగా కోలుకొంటున్నారు. ఆయన ఆరోగ్యం నిశ్చలంగా ఉంది. ఆయన గుండె గట్టిది అంటూ ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.

ఇక హల్క్ హోగన్ కెరీర్ విషయానికి వస్తే.. 1982 సంవత్సరంలో రాకీ 3 సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నో హోల్డ్స్ బార్‌డ్, సబర్బన్ కామాండో, మిస్టర్ నానీ, శాంటా విత్ మజిల్, 3 నింజాస్ చిత్రాల్లో నటించారు. ఆయన సొంతంగా తీసిన థండర్ ఇన్ పారడైజ్, ది అల్టిమేట్ వెపన్ టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ఆయన 2011 సంవత్సరంలో చివరగా నోమియో అండ్ జూలియట్ సినిమాలో నటించారు. దాదాపు 25 టెలివిజన్ సీరియల్స్‌లో నటించి మెప్పించారు.

More from Filmibeat

Read more about: hulk hogan WWE hollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X