twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారి తొమ్మిది శక్తులతో వస్తున్నాడు... కాచుకోండి

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : 'ఎక్స్‌మెన్‌' సిరీస్‌ సినిమాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఒళ్లు గగుర్పొడిచే పోరాటాలు, అతీంద్రియ శక్తుల విన్యాసాలతో రూపొందిన సినిమాలివి. ఈ సిరీస్‌లో ఇప్పుడు ఏడో సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో అద్భుత శక్తులున్న తొమ్మిది పాత్రలు ఉండబోతున్నాయి. దీనికి ఎక్స్‌మెన్‌ అనే పేరు పెట్టారు.

    హంగ్‌జగ్‌మెన్, జేమ్స్ మెక్‌నోవ్ ప్రధాన తారాగణంగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బ్రియన్ సింగర్ దర్శకత్వంలో రూపొందించిన 'ఎక్స్-మెన్' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మే 23న భారీగా విడుదలకు ముస్తాబు చేస్తున్నామని ఆయన తెలిపారు. మైకేల్ ఫెస్టండల్, జెనీఫర్ లారెన్స్, హెల్‌మెర్రి ఈ చిత్రంలో నటించారు.

    X-Men Releasing on 23rd May

    దర్శకుడు మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు వేర్వేరు సినిమాల్లో కనిపించిన పాత్రలన్నీ ఈ సినిమాలో కనబడతారు. ఈ వేసవిలో యాక్షన్‌, వినోదాల విందుగా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు.

    గతంలో వచ్చిన హాలీవుడ్ చిత్రాలు వోల్వోరీన్, ప్రొఫెసర్, మ్యాగ్‌నెటో, మిస్టిక్, స్ట్రోమ్, రోగ్, బీస్ట్, ఐస్‌మెన్, బిషప్ లాంటి చిత్రాలు వచ్చాయని, ఇలాంటి విచిత్ర చిత్రమైన ప్రపంచంలో అద్భుత శక్తులతో ఓ కొత్త లోకాన్ని సృష్టించే చిత్రంగా ఎక్స్-మెన్ తొమ్మిదిమంది అద్భుత శక్తులతో రూపొందిందని, ఈ తొమ్మిదిపాత్రలతో రూపొందిన చిత్రమే 'ఎక్స్-మెన్' అని ఫాక్స్‌స్టార్ స్టూడియో ప్రతినిధి తెలిపారు.

    English summary
    The Story regarding Of X-MEN Days Of Future Past, The X-Men send Wolverine to the past throughout a desperate effort to vary history and forestall an occurrence that finally ends up in doom for every humans and mutants. This film X-MEN Telugu Version Release On 23rd On Sameday English Version to boot unhitch complete World.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X