ఒకేసారి ఇద్దరు మగవారిని లవ్ చేయవచ్చు: కైరా

By Nageswara Rao

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కైరా నైట్లీ ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఆడవారు తలచుకుంటే ఒకే సమయంలో ఇద్దరు మగవారిని ప్రేమించవచ్చని అన్నారు. కైరా నైట్లీ ఎవరని అనుకుంటున్నారా..తెలుగులో విడుదలైన సముద్రపు దొంగలు(ఫైరెట్స్ ఆఫ్ ద కరేబియన్స్) సినిమాలో హీరోయిన్‌గా నటించారు. తన అందం, అభినయంతో ఇంగ్లీషులోనే కాకుండా, తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు.

26సంవత్సరాలు వయసు కలిగిన కైరా నైట్లీ ఒక స్త్రీ తలచుకుంటే ఒకే సమయంలో ఇద్దరు మగవారిని లవ్ చేయడం ఏమంత పెద్ద కష్టం కాదన్నారు. కొన్ని సందర్బాలలో ఇది నిజమని నిరూపితం కూడా అయింది. మీ జీవితంలో ప్రేమించడానికి స్దానం ఉన్నప్పుడు, అవతలి వ్యక్తి మీరు ప్రేమించతగ్గ వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఏకకాలంలో ఇద్దరిని లవ్ చేసే అవకాశం ఉందన్నారు. దీనితో పాటు కైరా నైట్లీ భాందవ్యాలలో అసూయకు పెద్ద స్దానం ఉండదని అన్నారు. కొత్తగా కైరా నైట్లీ ఇలా మారడానికి కారణంఐదు సంవత్సరాలుగా తన కోస్టార్ అయినటువంటి రూపర్ట్ ప్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరగి కొన్ని అనివార్యకారణాల వల్ల విడిపోవడమే ఈ విపరీత బుద్దికి కారణం అని అంటున్నారు సినీ పండితులు.

సాధారణంగా అసూయ అనేది మనం ఏదైనా ఎమోషన్‌లో ఉన్నప్పడు మనలో నుండి బయటకు వస్తుందే తప్ప కావాలని ఎవరి మీద మనం అసూయని ప్రదర్శించం. ఒకవేళ నా జీవితంలో ఎప్పుడైనా అసూయ పడాల్సిన సందర్బం గనుక వస్తే అతనిని జీవితంలో మరెప్పుడూ నమ్మనని అన్నారు. ఇది ఇలా ఉంటే కైరా నైట్లీ నాకు తెలిసి సినిమాలలో నటించడం అంత బుద్ది తక్కువ పని మరోకటి ఉండదన్నారు. దానికి కారణం ఒక్కోక్క షాట్‌కి నెంబర్ ఆఫ్ టేకులు అంటూ చేయించిందే చేయించి మాజీవితాలలో ఆడుకుంటారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా అనేది అపరిమితమైన సెక్స్‌తో కూడుకున్నదని అని అన్నారు. ఇంకోక విషయం ఏమిటంటే ఫిల్మ్ అనేది సెక్స్ లాంటిది ఐతే కామాతురము లాగే ఎప్పటికైనా దాని గురించి తెలుసుకోవాల్సింది కొంచెం అయినా ఉంటుందన్నారు. అంతేకాకుండా సినిమాలలో మొదలు పెట్టడం, అది కంప్లీట్ అవ్వకముందే దానిని మరలా ఆపడం లాంటివి చాలా జరుగుతాయని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X