Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చేసింది హాలీవుడ్ లో వారు చేస్తున్నారు..!!
ఒకప్పుడు తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమా విడుదలయిన సమయంలో ఆ సినిమాలో ఓ తప్పు దొర్లింది అని మెగాస్టార్ చెప్పడం, ఆ తప్పు ఏంటి అని ఓ టివి ఛానెల్ కంటెస్ట్ నిర్వహించడంతో అది వార్త కాస్త ఓ సంచలన వార్త అయింది. ఆ తర్వాత 'ఒకే రోజున హోలీ పండుగ, రాఖీ పండుగ వచ్చినట్టు చూపించడమే ఇంద్ర సినిమా జరిగిన తప్పిదంగా మెగాస్టార్' ప్రకటించిన సంగతి తెలిసిందే.
అప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా...!! టాలీవుడ్ లో దర్శకుడో, హీరో నో లేక సినిమాకు సంబంధించిన వారు చెబితే కానీ ఈ లోపాలు బయటకు రావు కానీ హాలీవుడ్ లో moviemistakes.com అనే సైటు ప్రత్యేకంగా సినిమాల ను పరిశీలించి అందులో తప్పిదాలను ఎత్తి చూపడమే కాదు ఈ ఏడాది అత్యధిక తప్పుసను నమోదు చేసుకున్న టాప్-10 సినిమాల వివరాలను కూడా వెళ్లడిస్తుంది.
2009 వ సంవత్సరానికి గాను '17 ఎగెయిన్' అనే సినిమా ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఓ వ్యక్తి తిరిగి తను టీనేజ్ లోకి వెళ్లే అవకాశం వస్తే ఎలా వుంటుంది అనే కథాంశం తో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టెయినర్ మొత్తంగా వందకు పైచిలుకు తప్పిదాలతో ఈ ఘనతను సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఈ యేటి బ్లాక్ బస్టర్ మూవీ 'హ్యారీ పోటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్' మరియు 'ట్రాస్ఫార్మర్స్ రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్ టై' సినిమాలు మొత్తంగా 71 తప్పిదాలతో 2వ స్థానంలో నిలిచాయి.
'నైట్ అట్ ది మ్యూజియం: బ్యాటిల్ ఆఫఅ స్మిత్ సొనైన్' మరియు 'ట్విలైట్ సాగా న్యూమూన్' చిత్రాలు చెరో 29 తప్పిదాలతో టాప్-5 సినిమాల్లో స్థానం సంపాదించాయి. '2012' సినిమాలో 27 తప్పులు ఉన్నట్టు ఈ పరిశీలనలో తేలింది. కాగా ఈ తప్పిదాలను ఎత్తి చూపిన సదురు సంస్థ మాత్రం ఈ వివరాలను ఎవ్వరినీ బాధపెట్టడానికి కాదు, ఈ సన్నివేశాలను సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేసిన నేను ఆ తర్వాత ఇలాంటి సన్నివేశాలు ఎడిటింగ్ రూం నుండీ ఎలా బయటకు వస్తాయి అని ఆశ్చర్యపోయాను అన్నాడు. ఈ వార్త చదువుతుంటే మీకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే హాలీవుడ్ సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్నాయని అని అనిపించట్లేదూ..!!