30 ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు కూతురు నగ్నంగా.. వైరల్ అవుతున్న నటి కవర్ ఫోటో!
తల్లి పోలికలు కుమార్తెకు రావడం సహజమే. తన తల్లి లిసా బోనెట్ నటనా వారసత్వంలో నటి జో క్రావిట్జ్ హాలీవుడ్ లో కొనసాగుతోంది. క్రావిట్జ్ ప్రతిష్టాత్మకమైన రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కవర్ కు నగ్నంగా ఫోజు ఇచ్చింది. హాలీవుడ్ అభిమానులు ఈ ఫోటోని చరిత్రాత్మకం అంటూ ప్రశంసిస్తున్నారు. నగ్నంగా ఫోజు ఇస్తే అందులో చరిత్రాత్మకం ఏముంటుంది అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

30 ఏళ్ల క్రితం తల్లి
సరిగ్గా 30 ఏళ్ల క్రితం హాలీవుడ్ నటి లిసా బోనెట్ రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కవర్ కు ఫోజు ఇచ్చింది. అప్పట్లో నగ్నంగా ఫోజు ఇవ్వడం సంచలనం. ఇప్పుడు లిసా బోనెట్ కుమార్తె క్రావిట్జ్ కూడా అదే పని చేసింది. అచ్చు తన తల్లిలాగే ఒంటిమీద నూలు పోగు లేకుండా రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కవర్ కు ఫోజు ఇచ్చింది.
గర్భవతిగా ఉన్న సమయంలో
తన తల్లి అప్పట్లో చేసిన ఈ న్యూడ్ ఫోటో షూట్ గురించి క్రావిట్జ్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మా అమ్మ ఈ ఫోటో షూట్ చేసే సమయంలో రెండు నెలల గర్భవతి. ఇప్పుడు తాను పెరిగి పెద్దై తన తల్లిని మురిపించే విధంగా చేయడం సంతోషంగా ఉందని క్రావిట్జ్ తెలిపింది.

నగ్నంగా చేయాలని కాదు
అనుకరించడం కూడా ఒక ఆర్ట్ అంటూ తనని తాను క్రావిట్జ్ సమర్థించుకుంది. నాకు న్యూడ్ ఫోటో షూట్ చేసే ఉద్దేశం లేదు. కానీ మా అమ్మ లాగా చేయాలని అనుకున్నా. అందుకే మ్యాగజైన్ కవర్ కు ఇలా ఫోజు ఇచ్చానని క్రావిట్జ్ చెబుతోంది.

హీరోయిన్‌గా దూసుకుపోతూ
ఫాంటాస్టిక్ బీట్స్, ఎక్స్ మాన్ ఫస్ట్ క్లాస్ వంటి చిత్రాలతో క్రోవిట్జ్ గుర్తింపు తెచ్చుకుంది. పలు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ నటిగా దూసుకుపోతోంది. తాజాగా ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో వలన క్రావిట్జ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడం ఖాయం.


Click it and Unblock the Notifications











