క్యాస్టింగ్ కౌచ్ ఓ ఫ్యాషనైపోయింది.. ఆంటీలు, హీరోయిన్లు ఏమయ్యారు.. నాకు ఆ దురద.. పృథ్వీ

Recommended Video

Actor Prudhvi Interview About Bulf Master Movie | Satya Dev | Nandita Swetha | Filmibeat Telugu

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాకు ఇది రీమేక్. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పృథ్వీ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో నా పాత్ర పేరు ధనశెట్టి. డబ్బు కోసం అత్యాశపడే నైజం ఉన్న పాత్ర నాది. ఆ పాత్ర గెటప్ చాలా గమ్మత్తుగా ఉంటుంది అని అన్నారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

నేను అమ్మాయిలతో మోసపోలేదు

నేను అమ్మాయిలతో మోసపోలేదు

నా జీవితంలో డబ్బు పరంగా మోసపోలేదు. అమ్మాయిల చేతిలో మోసానికి గురి కావడమనేది అసలు జరుగని పని. మాకు అమ్మాయిలు ఉండే ఛాన్సు లేదు. ఎందుకుంటే మా ముఖాలకు అమ్మాయిలతో చనువు ఉంటుందా? అని పృథ్వీ ప్రశ్నించారు.

నా ముఖానికి అమ్మాయిలా

నా ముఖానికి అమ్మాయిలా

జీవితంలో అసలు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మోసపోవడాలు అనేవి ఉండవు. ఏదో అభిప్రాయబేధాలు రావడం వల్ల విడిపోతారు. పక్కన ఉండేవాళ్లు అమ్మాయి ఫలానా వాడి చేతిలో మోసపోయిందని, అబ్బాయిని ఫలానా అమ్మాయి మోసం చేసిందని చెప్పకొంటారు. వాస్తవానికి మోసపోవడానికి ఎవరూ ఉండరనేది నా అభిప్రాయం.

ఆంటీలు ఎక్కడున్నారు?

ఆంటీలు ఎక్కడున్నారు?

సినిమా పరిశ్రమలో కూడా మోసాలు లేవు. క్యాస్టింగ్ కౌచ్ అనేది మీడియాలో చెప్పుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారింది. కొందరి మాటలు విని నాకు అలా జరిగింది. నన్ను అలా వాడుకొన్నారని కొందరు మీడియా ముందుకు వచ్చి బాధను చెప్పుకొన్నారు. కానీ అలా మాట్లాడిన అమ్మాయిలు, ఆంటీలు ఎక్కడైనా కనిపిస్తున్నారా? మగవాళ్ల చేతిలో మోసపోయిన ఆడవాళ్లే కాదు.. ఆడవాళ్ల చేతిలో మోసపోయిన మగవాళ్లు కూడా సిని పరిశ్రమలో ఉన్నారు.

 లోటుపాట్లను తెలుసుకొన్న నటీనటులను

లోటుపాట్లను తెలుసుకొన్న నటీనటులను

సినిమా పరిశ్రమలో రాణించాలనుకొనే వారు ఇక్కడి లోటుపాట్లను తెలుసుకొన్న వారు బ్రహ్మండంగా ఉన్నారు. సిని పరిశ్రమలో మంచి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతేగానీ మోసానికి గురయ్యామని చెప్పుకొన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఏ పరిశ్రమైనా లోటుపాట్లు ఉంటాయి. వాటిని తట్టుకోవడం, వాటికి దూరంగా ఉండటమనేది మన చేతిలో పని.

మీడియాలో గొంతెత్తి అరిస్తే లాభం లేదు

మీడియాలో గొంతెత్తి అరిస్తే లాభం లేదు

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు యువ హీరోయిన్లను మోసం చేస్తున్నారనే ఆరోపణలు తగ్గిపోయాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా సినిమా ఆఫీస్లులో ఫొటోలు ఇస్తున్నారు. డైరెక్టర్లే ఫోటోలు చూసి వారి పాత్రలకు సరిపోతే పిలుస్తున్నారు. లేకపోతే పక్కన పడేస్తున్నారు. దాంతో ఆ సమస్య ముగిసిపోయింది. మీడియాలో గొంతెత్తి అరిస్తే లాభం లేదనే విషయం స్పష్టమైంది.

నాకు రాజకీయ దురద ఉంది

నాకు రాజకీయ దురద ఉంది

నాకు ఏదైన విషయంపై స్పష్టంగా మాట్లాడటం ఇష్టం. ఏదో ఆశించి మనసులో ఓ మాట. బయటకు ఓ మాట చెప్పడం నా వల్ల కాదు. నాకు రాజకీయ దురద ఎక్కువ. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ కూడా చేశాను. కాబట్టి రాజకీయాలపై ఆసక్తి ఉంది.

నేను ఓపెన్‌గా మాట్లాడుతాను

నేను ఓపెన్‌గా మాట్లాడుతాను

2013 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో ఉన్నాను. సోషల్ మీడియా ప్రభావం లేకపోవడం వల్ల తెలియలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ కావడం వల్ల అందరికీ తెలిసి పోతుంది. నేను వైఎస్ జగన్‌కు సపోర్ట్ చేయడం వల్ల అందరూ ఓపెన్‌గా మాట్లాడుతున్నాడని అందరూ అనుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X