గురు పాత్రకు ప్రశంసలు వస్తున్నాయంటే.. లింగుసామిదే క్రెడిట్.. ది వారియర్ గురించి ఆది పినిశెట్టి
ది వారియర్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ గురు పాత్రలో నటించిన యువ హీరో ఆది పినిశెట్టికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఉస్తాద్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించారు. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేనితో పాటు ఆది పినిశెట్టి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ..

సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సరైనోడు తర్వాత విలన్‌గా చేద్దామనప్పుడు అజ్ఞాతవాసి చేశా. అది పవన్ కల్యాణ్ సినిమా. దాని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా.. దాని కంటే బెటర్‌గా ఉండాలని ఆలోచించా. ది వారియర్ లో రోల్ విన్నప్పుడు...ఆర్డీనరి విలన్‌గా కాకుండా, గురుకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అది నాకు నచ్చింది. అందుకని, చేశా అని ఆది పినిశెట్టి
కథలు విన్నప్పుడు నో చెప్పడానికి ఇబ్బంది పడను. నేను నిజాయతీగా, వెంటనే నా అభిప్రాయం చెబుతా. లేదంటే వాళ్ళ టైమ్ వేస్ట్, నా టైమ్ వేస్ట్. నాకు సెట్ అవ్వడానికి, నేను క్యారీ చేయలేనని చెబుతా. కథ విన్నప్పుడు నేను చేయాలి అనుకున్నాను. అయితే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. రెండు రోజులు లింగుస్వామి గారితో మాట్లాడి చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేసుకుని వెంటనే ఒప్పుకున్నాను. గురు పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ ఉండటంతో ప్రేక్షకుల అంత మాట్లాడుతున్నారు ఏమో! అని అన్నారు.
నేను ఇంతకు ముందు కమర్షియల్ పెర్ఫార్మన్స్ చేసింది లేదు. నేను క్యారెక్టర్ ప్రకారం తీసుకుని, ఆ క్యారెక్టర్ లో ఉండి... సినిమాటిక్ కమర్షియల్ మీటర్ లో ఉన్నది గురు. మీరు సినిమా చూస్తే... క్లైమాక్స్ తప్ప స్టార్టింగ్ టు ఎండింగ్ చేసే ప్రతి పనిని గురు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ మీటర్ కొత్త కాబట్టి లింగుస్వామి గారు చెప్పింది ఫాలో అయిపోయా. మేకప్, గెటప్ విషయంలో కొంత వర్క్ చేశారు. చెవికి దిద్దు పెట్టుకోవడంతో పాటు చిన్న లెన్స్ వాడను. గురును డిఫరెంట్ గా చూపించడం కోసం నేను ఆ వర్క్ చేశాను తప్ప... క్యారెక్టర్ క్రెడిట్ మొత్తం లింగుస్వామి గారిది అని అన్నారు.


Click it and Unblock the Notifications











