Nikki Galrani తో ప్రేమ, పెళ్లి.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే.. ఆది పినిశెట్టి (ఇంటర్వ్యూ)

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినిమా రంగానికి పరిచయమైన ఆది పినిశెట్టి నటుడిగా, విలన్ పాత్రల్లో నటిస్తూ.. ప్రతీ సినిమాకు తన కెరీర్ గ్రాఫ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ది వారియర్ చిత్రంలో మరోసారి విలన్‌గా అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. రామ్ పోతినేనితో కలిసి నువ్వా నేనా అనే రేంజ్‌లో నటించారు. అయితే ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న సమయంలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల హీరోయిన్‌ నిక్కీ గల్రానీతో వివాహం జరిగిన నేపథ్యంలో తన అఫైర్, మ్యారేజ్ గురించి ఆది పినిశెట్టి చెప్పిన విషయాలు మీ కోసం..

మలుపు సినిమా సమయంలో

మలుపు సినిమా సమయంలో


నిక్కీ గల్రానీతో నా లవ్ అఫైర్ మలుపు సినిమా నుంచి మొదలైంది. అయితే ఆ సినిమా సమయంలో మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. ఆ సమయంలో మా మధ్య చిన్న అభిప్రాయభేదాలు ఉన్నాయి. హీరోగా నేను ఆమె ప్రైవసీని గౌరవించాను. ఆమె నా ప్రైవసీని గౌరవించింది. మలుపు సమయంలో ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ ఆ తర్వాత రిలేషన్‌షిప్‌గా మారింది. అయితే ఒకరినిఒకరు భరించగలమా? రిలేషన్‌ను సుదీర్ఘకాలం ముందుకు తీసుకెళ్తామా? ఒక బంధాన్ని ఎంత బలంగా ఎస్టాబ్లిష్ చేయగలమేనే విషయాలను చాలా సీరియస్‌గా చర్చించుకొన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం అని ఆది పినిశెట్టి తెలిపారు.

ఇంట్లో పెళ్లి విషయం చెప్పినప్పుడు

ఇంట్లో పెళ్లి విషయం చెప్పినప్పుడు


ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. నేను ఎప్పుడూ వారిచ్చిన స్వేచ్ఛను మిస్ యూజ్ చేయలేదు. అయితే పెళ్లి విషయం ఇంట్లో అమ్మా, నాన్నకు చెప్పినప్పుడు వారు ఏమీ అనలేదు. చాలా పాజిటివ్‌గా స్పందించారు. మీ జీవితం గురించి మీరు నిర్ణయం తీసుకోండి. మీ ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి అని చెప్పారు. నీవు ఎవరిని పెళ్లి చేసుకొన్నా అభ్యంతరం లేదు. కానీ ఎదుటివారిని బాగా అర్ధం చేసుకోమని చెప్పారు అని ఆది పినిశెట్టి అన్నారు.

 నిక్కీ గల్రానీ ముందుగా ప్రపోజ్ చేస్తే..

నిక్కీ గల్రానీ ముందుగా ప్రపోజ్ చేస్తే..


ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రపోజల్‌ను ముందుగా నిక్కీ గల్రానీ తీసుకొచ్చింది. ఫ్రెండ్ షిప్ ఉన్నప్పుడే ప్రపోజ్ చేసింది. అయితే నిక్కీ ప్రపోజల్‌కు వెంటనే నేను ఒకే చెప్పలేదు. చాలా సమయం తీసుకొన్నాను. నాకు నిక్కీ సెట్ అవుతుంది. కానీ మా ఇంట్లో వాళ్లకు నిక్కి సెట్ అవుతుందా? నిక్కీకి మా ఇంట్లో వాళ్లు సెట్ అవుతుందా? ముఖ్యంగా నిక్కీ తెలుగు అమ్మాయి కాదు. కానీ తెలుగు బాగా మాట్లాడుతుంది. ఇలాంటివి బేరీజు వేసుకొన్న తర్వాత నేను ఓకే అని చెప్పాను అని ఆది పినిశెట్టి తెలిపారు.

పెళ్లి తర్వాత నిక్కీ నటించడంపై

పెళ్లి తర్వాత నిక్కీ నటించడంపై


నిక్కీ ప్రపోజల్ గురించి చెప్పిన విషయాలు నా వెర్షన్ మాత్రమే కాదు.. ఇద్దరి వెర్షన్ ఒకటే. ఆమెను అడిగినా ఇదే చెబుతుంది. పెళ్లి తర్వాత ఆమె నటించాలా? వద్దా అనేది ఆమెకే వదిలివేశా. ఆమెకు నటించాలనిపిస్తే నటించమని చెప్పాను. వద్దనుకొంటే ఆమె ఇష్టం. మంచి ప్రాజెక్టులు వస్తే సినిమాలు చేస్తుంది. ఈ రోజు చేయాలనిపించవద్దు.. రేపు చేయాలనిపించకపోవచ్చు. అందుకే యాక్టింగ్ వరకు ఆమె నిర్ణయానికి వదలివేశాను అని ఆది పినిశెట్టి అన్నారు.

శివుడు సినిమాలో నిక్కీ నేను కలిసి..

శివుడు సినిమాలో నిక్కీ నేను కలిసి..


మా ఫ్యామిలీ శివుడు సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ప్రోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. నా వైఫ్ నిక్కీ గల్రానీ, నేను కలిసి నటించాం. ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తాం. ఇంకా మూడు సినిమాలు హీరోగా మొదలు కాబోతున్నాయి. రెండు పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్నాయి. మా అన్నయ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం అవుతుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది అని ఆది పినిశెట్టి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X