చరణ్ రూపంలో నాకు తమ్ముడు దొరికాడు..సుకుమార్ విజన్ హ్యాట్సాఫ్.. ఆది పినిశెట్టి

By Rajababu

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా విలక్షణ యువ నటుడు ఆది పినిశెట్టి హీరోగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. తేజ దర్శకత్వంలో ఒక విచిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు. మృగం, మలుపు చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సరైనోడు చిత్రంతో విలన్‌ టచ్ ఉన్న వైరం ధనుష్ పాత్రలో మెరిసాడు.

Recommended Video

Rangasthalam Team Arranges Thanks Meet

అనంతరం నిన్నుకోరి సినిమాలో అరుణ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో ఆది నటించిన కుమార్ బాబు పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆది పినిశెట్టి తన అనుభవాలను మీడియాతో పంచుకొన్నారు.

వ్యక్తిగత కారణాల వల్ల

వ్యక్తిగత కారణాల వల్ల

రంగస్థలం సినిమా థ్యాంక్స్ మీట్‌కు వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయాను. మేము నటించిన చిత్రానికి అద్భుతమైన స్పందన, మంచి రివ్యూలు వస్తున్న నేపథ్యంలో ఆడియెన్స్‌కు మాకు మధ్య బ్రిడ్జిగా ఉన్న మీడియాను కలువకపోతే దానికి పరిపూర్ణత ఉండదు. అందుకే మీడియాను కలువడానికి నిశ్చయించుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.

 మీడియాను కలువకపోతే..

మీడియాను కలువకపోతే..

సరైనోడు సినిమాలో వైరం ధనుష్ పాత్ర నుంచి రంగస్థలంలోని కుమార్ బాబు పాత్ర వరకు నేను చేసిన రోల్స్‌కు మీడియా ఇచ్చిన సహకారం, ఆదరణ మరువలేనిది. నటుడికి ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్, మీడియా సహకారం పోల్చుకుంటే డబ్బు అనేది ముఖ్యం కాదు అనిపిస్తుంది.

 రివ్యూవర్లు నాకు టీచర్లు

రివ్యూవర్లు నాకు టీచర్లు

యాక్టర్‌గా నేను రివ్యూలను చాలా జాగ్రత్తగా చదువుతాను. పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని పత్రికలను, వెబ్‌సైట్లను క్షుణ్ణంగా చదువుతాను. ఎందుకంటే రివ్యూవర్స్ నాకు టీచర్ల లాంటి వాళ్లు. మీరు రాసే రివ్యూలను, ఫీడ్ బ్యాక్ నుంచి నేను చాలా జాగ్రత్తలు తీసుకొంటాను. నా గురించి రాసే నెగిటివ్ పాయింట్స్‌ను సినిమాల పరంగా సరిదిద్దుకొంటాను.

కంటతడి పెట్టించే పాత్ర

కంటతడి పెట్టించే పాత్ర

నిన్నుకోరి సినిమా షూటింగ్‌ సమయంలో రంగస్థలంలోని కుమార్ బాబు పాత్రను రెండు గంటలపాటు సుకుమార్ చెప్పారు. కథ విన్న వెంటనే నేను ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పాను. కొద్దిరోజులుగా నిజాయితీ ఉన్న సినిమాలు రావడం లేదు. థియేటర్లలో కంటతడి పెట్టిన దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. రంగస్థలం అలాంటి ఫీలింగ్‌ను ఇచ్చింది.

సుకుమార్‌పై నమ్మకంతోనే

సుకుమార్‌పై నమ్మకంతోనే

సుకుమార్ నాకు మొదటి రోజు నుంచి నమ్మకం ఉంది. చెప్పిన కథ ప్రకారం నేను చేయాలా? ఫ్రీడం ఉంటుందా అనే సందేహాలు ఉండేవి. కానీ సుకుమార్ ఆ భయాలను పొగొట్టడంతోపాటు నా నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. రంగస్థలం సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజై ఘన విజయం సాధించేంత వరకు సుకుమార్ చూపించిప అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

చరణ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేక..

చరణ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేక..

చిట్టిబాబు క్యారెక్టర్‌లో చరణ్ తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. చరణ్ కాకపోతే చిట్టిబాబు ఎవరు చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఆలోచిస్తే చరణ్ తప్ప మరొకరు రాలేకపోయారు. చెవిటి పాత్రలో కామెడీ, ఎమోషన్స్, డ్యాన్సులు, ఫైట్స్ అని అంశాలను చిట్టిబాబు పాత్ర ద్వారా అద్భుతంగా చరణ్ పండించాడు. జీవితంలో నాకు ఓ తమ్ముడు ఉంటే బాగుండేదని ఓ కోరిక ఉండేది. రంగస్థలం చిత్రంతో చరణ్ రూపంలో నాకు మంచి తమ్ముడు దొరికాడు అని ఆది అన్నారు.

 రామలక్ష్మీ పాత్రలో సమంత అద్భుతం

రామలక్ష్మీ పాత్రలో సమంత అద్భుతం

సమంత యాక్టింగ్‌ను చాలా సినిమాల్లో చూశాను. కానీ రంగస్థలంలో చేసిన రామలక్ష్మీ పాత్ర అద్భుతంగా ఉంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మహేష్, నవీన్ తదితరులు చక్కగా నటించారు. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్ నవీన్ నూలి లాంటి వారు ఈ సినిమాకు మూల స్తంభాలుగా నిలిచారు. రంగస్థలం సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దడంలో మైత్రీ మూవీస్ చిత్ర నిర్మాతల డెడికేషన్ మాటల్లో చెప్పలేం.

 నాన్న ఇన్వాల్వ్‌మెంట్ ముఖ్యమైంది

నాన్న ఇన్వాల్వ్‌మెంట్ ముఖ్యమైంది

నా కెరీర్‌లో మా నాన్న రవిరాజా పినిశెట్టి రోల్ చాలా ముఖ్యమైంది. ఇన్వాల్వ్‌మెంట్ పెద్దగా ఉండదు. అలా మా నాన్న ఇన్వాల్వ్‌మెంట్ లేదని అని అనుకొంటే నా కంటే బుద్దితక్కువవాడు ఎవరూ ఉండరు. మా నాన్న లేకపోతే నాకు సినీ పరిశ్రమలో స్థానం లేదు. ఎప్పడూ మా నాన్న నీకు నచ్చింది చేయమని ఎప్పడూ ప్రోత్సాహించేవారు. కథ, క్యారెక్టర్ విన్నప్పుడూ మా నాన్నతో షేర్ చేసుకొంటాను. ఎంతో అనుభవం ఉన్న ఆయన సూచనలను, సలహాలను పాటిస్తాను అని ఆది పినిశెట్టి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X