మయసభలో కష్టమైన పని అదే.. ఆ ఛాలెంజ్‌ను నిజాయితీగా చేశాం.. ఆది పినిశెట్టి
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony Liv) అందిస్తున్న డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో మయ సభ. రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ట్యాగ్ లైన్. సామాజిక స్పృహతోపాటు సెన్సేషనల్ కంటెంట్‌తో సినిమాలు రూపొందించే దేవా కట్టా షో రన్నర్‌గా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీన స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా.. హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ..
దేవ కట్టా రాసిన ప్రస్థానం, వెన్నెల, రిపబ్లిక్ సినిమాలు చాలా రిలేట్ అయ్యే సినిమాలు. రియాలిటీగా ఉండే కథను చాలా నిజాయితీగా చెప్పారు. మయసభలో చాలా అందంగా క్యారెక్టర్ ఆర్క్ క్రియేట్ చేశారు. ప్రతీ క్యారెక్టర్‌కు లాజిక్ ఉంటుంది. ఒక ఆర్టిస్టుగా కథ చదివినప్పుడు నాకు ఒక అవగాహన ఏర్పడింది. స్క్రిప్టు రీడింగ్ జరిగినప్పుడు ఆయన విజన్ తెలిసింది. ఆయన కోణాన్ని అర్ధం చేసుకోవడాన్ని కొంత సమయం పట్టింది. రకరకాల లేయర్లను తెలుసుకొంటూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను అని ఆది పినిశెట్టి తెలిపారు.

మయసభ సినిమాకు రైటింగ్ డిఫికల్డ్ పార్ట్. దానిని నిజాయితీగా నటించాం. ఈ వెబ్ సిరీస్‌లో ఛాలెంజింగ్ అనిపించే సీన్లు చాలా ఉన్నాయి. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు అంత గొప్పగా మేము చెప్పలేదు. చాలా డైలాగ్స్ ఎంజాయ్ చేస్తూ చెప్పాం. కొన్ని ఎపిసోడ్‌లో నేను నత్తితో కూడిన డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆది ఛాలెంజింగ్ అనిపించింది. రియలిస్టిక్‌గా చేసిన ప్రయత్నం కష్టంగా అనిపించింది అని ఆది చెప్పారు.
డైరెక్టర్ ఏదైనా కథ చెప్పినప్పుడు దానిని రిలేట్ చేసుకొనే సత్తా మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం నాకు మంచి ఆర్టిస్టులు లభించారు. రవీంద్ర విజయ్ లాంటి యాక్టర్లు కూడా డెడికేటివ్‌గా చేశారు. అందరూ బాగా నటించిప్పుడు నిజాయితీగా రాసిన డైలాగ్స్, టెక్నికల్ వర్క్‌కు న్యాయం జరుగుతుంది అని దర్శకుడు దేవా కట్టా చెప్పారు.


Click it and Unblock the Notifications











