For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ పాత్రలకు కూడా సిద్దమే.. నా భర్త ఫుల్ సపోర్ట్: దేవదాస్ భామ యమా హాట్

  |

  మళ్లీరావా, దేవదాస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆకాంక్ష సింగ్.. అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే కన్నడ సూపర్ స్టార్.. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన పహిల్వాన్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఆకాంక్ష సింగ్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

   నా ఫాలోవర్స్‌లో ఎక్కువగా ఉన్నది హైదరాబాద్ వారే..

  నా ఫాలోవర్స్‌లో ఎక్కువగా ఉన్నది హైదరాబాద్ వారే..

  తెలుగు ప్రేక్షకులు చూపే అభిమానం వేరేలా ఉంటుంది. తమ ఇంటి మనిషిలా ప్రేమిస్తారు. నా మొదటి చిత్రం మళ్లీరావా విడుదలైన వెంటనే.. నా గురించి అందరూ మాట్టాడటం మొదలుపెట్టారు. తెలుగు ప్రేక్షకులు అప్పటి నుంచి నాపై అభిమానుం చూపిస్తూనే ఉన్నారు. నా ఇన్ స్టాగ్రాంలో ఉన్న ఫాలోవర్స్‌లో హైద్రాబాద్ వారే ఎక్కువ మంది ఉంటారు. ప్రతీ విషయంలో వారు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. హైద్రాబాద్ నాకు రెండో ఇళ్లులా మారిపోయింది. షూటింగ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నానంటే ఏదో తెలియని ఆనందమేస్తుంది.

  గ్లామర్ పాత్రలకు సిద్దమే..

  గ్లామర్ పాత్రలకు సిద్దమే..

  సినిమాలో కనిపించేంది ఐదు నిమిషాలు అయినా సరే.. చూసిన వారు మన గురించి మాట్లాడుకోవాలి. ఏ సినిమా అయినా నాకు క్యారెక్టర్ నచ్చితే చేస్తాను. అలా అని.. గ్లామర్ పాత్రలకు దూరమని కాదు. అయితే గత సినిమాల్లో వచ్చిన పాత్రల డిమాండ్ మేరకు స్కిన్ షోకు దూరంగా ఉన్నాను. గ్లామర్ పాత్ర వస్తే.. నేను చేయడానికి సిద్దంగా ఉన్నాను. పహిల్వాన్ చిత్రంలో కూడా కొంత గ్లామరస్ టచ్ ఉంటుంది. ఈ సినిమా చూసిన వారు.. నేను గ్లామర్ పాత్రలను కూడా చేయగలనని నమ్ముతారు.

  ఈమధ్య కాలంలో నాకు నచ్చిన పాత్ర..

  ఈమధ్య కాలంలో నాకు నచ్చిన పాత్ర..

  ఈ మధ్య కాలంలో బాహుబలి చిత్రంలో అనుష్క చేసిన రోల్ అంటే నాకు ఇష్టం. అలాంటి పాత్ర నేను చేస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అలాంటి పాత్ర చేయాలని నాకు ఉంది. నాకు ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలతో కలిసి నటించాలని ఉంది.

  పెళ్లి కావడం, భర్త కండీషన్లు పెట్టడం వల్లే సినిమా అవకాశాలు...

  పెళ్లి కావడం, భర్త కండీషన్లు పెట్టడం వల్లే సినిమా అవకాశాలు...

  నాకు పెళ్లైందని..నా భర్త మూలానే సినిమా అవకాశాలు రావడం లేదనడంలో ఎంత మాత్రం నిజం లేదు. పెళ్లైతే సినిమాలు చేయకూడదా? సమంత పెళ్లి అయినా కూడా సినిమాల్లో నటిస్తూ.. సక్సెస్ అందకుంటోంది కదా. ఇదే ప్రశ్నను మీరు హీరోలను ఎందుకు అడగరు? అయినా నటించేది నేను..నా భర్త కాదు.. ఆయన నటించడం లేదు.. నేను నటిస్తున్నాను. ఏ సినిమా నటించాలో ఆయన నాకు చెప్పరు.. నేనే నిర్ణయం తీసుకుంటాను. ఆయన వల్లే సినిమాలు రావడం లేదనడం కరెక్ట్ కాదు. పెళ్లైన తరువాతే ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. దాని కారణం మా ఆయనిచ్చే సహాకారమే. ఆయనే నన్ను ప్రోత్సహిస్తుంటారు.

  రాబోయే ప్రాజెక్ట్స్...

  రాబోయే ప్రాజెక్ట్స్...


  ప్రస్తుతం తెలుగు, తమిళంలో క్లాప్.. మిత్ర.. నేషనల్ హాకీ ప్లేయర్.. మరో విభిన్న పాత్ర.. నేను బాలీవుడ్ గురించి అంతగా ఆలోచించడం లేదు.. నేను నా డెబ్యూ కోసం బాలీవుడ్లో ఎదురుచూశాను. కానీ తెలుగులో నా మొదటి సినిమా చేశాను. ఎందుకంటే ఇక్కడి కంటెంట్ నచ్చింది. నాకు ఫస్ట్ కథ నచ్చాలి, చుట్టూ ఉన్న వాతావరణం కూడా నచ్చాలి. బయట షూటింగ్ కు ఎక్కడికి వెళ్లినా.. పది రోజుల కంటే ఎక్కువగా ఉండలేను. కానీ హైద్రాబాద్‌లో ఎన్ని రోజులైనా ఉండగలను.

  English summary
  Aakanksha Singh Who Is Debut By Sumanth MAlliarava Movie Now Came With Kichha Sudeep Pahilwan Movie. Now It Works Well And Aakanksha Is Happy And Interacted With Media. She Wants More Movies In Telugu. she Wants Works With Allu Arjun And Vijay devarakonda.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X