తరుణ్ భాస్కర్ అలా బట్టలిప్పేస్తాడు.. ఆయన ఫుల్‌టైం యాక్టర్ కాదు.. అభినవ్ గోమటం

మీకు మాత్రమే చెబుతా సినిమా స్క్రిప్టు చాలా బాగుంటుంది. డైరెక్టర్ షమీర్ సుల్తాన్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. ఈ కథలో, సినిమాలో సెల్‌ఫోన్ ఎక్కువగా హంగామా చేస్తుంది. సినిమా ట్రైలర్‌లో ఉండే అంశాలు చాలా తక్కువ. వాటిని చూసి అదే కథ అనుకోవద్దు. చాలా విషయాలు ఉన్నాయి. నాకు సెల్‌ఫోన్ వాడటంలో పెద్దగా ఆసక్తిగా ఉండదు. నా ఫోన్‌లో ఎలాంటి విషయాలు ఉండవు. నా ఫొటోలు తప్ప ఏముంటుంది. ఈ సినిమాలో జరిగినట్టు దారుణాలు నా జీవితంలో జరుగలేదు అని అభినవ్ గోమటం తెలిపారు.

వాస్తవానికి టైటిల్ అది కాదు

వాస్తవానికి టైటిల్ అది కాదు

వాస్తవంగా అసలు సినిమా పేరు అది కాదు. ఎవ్వరికీ చెప్పొద్దు అని టైటిల్ పెట్టాం. అయితే ఇప్పటికే ఆ టైటిల్‌తో సినిమా రావడంతో సినిమా పేరు మార్చాం. ఈ కథను అర్జున్ రెడ్డి తర్వాత చేయాలని విజయ్ అనుకొన్నాడు. కానీ అర్జున్ రెడ్డితో ఇమేజ్ మారిపోవడంతో తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేశాడు అని అభినవ్ గోమటం చెప్పారు.

వాస్తవానికి టైటిల్ అది కాదు

వాస్తవానికి టైటిల్ అది కాదు

వాస్తవంగా అసలు సినిమా పేరు అది కాదు. ఎవ్వరికీ చెప్పొద్దు అని టైటిల్ పెట్టాం. అయితే ఇప్పటికే ఆ టైటిల్‌తో సినిమా రావడంతో సినిమా పేరు మార్చాం. ఈ కథను అర్జున్ రెడ్డి తర్వాత చేయాలని విజయ్ అనుకొన్నాడు. కానీ అర్జున్ రెడ్డితో ఇమేజ్ మారిపోవడంతో తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేశాడు అని అభినవ్ గోమటం చెప్పారు.

తరుణ్ భాస్కర్ ఎలాంటి వాడంటే..

తరుణ్ భాస్కర్ ఎలాంటి వాడంటే..

తరుణ్ భాస్కర్ బేసిగ్గా డైరెక్షన్ అయినప్పటికీ.. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆయన ఈ సినిమాతో ప్రొఫెషనల్ యాక్టర్ కాదు చెప్పాడు. ఎదుటి వ్యక్తిని బాగా ఇమిటేట్ చేస్తాడు. ఎదుటి వాడిని కొన్ని విషయాలపై జోకులు వేస్తూ బట్టలిప్పేంత ప్రయత్నం చేస్తాడు. ఎదుటి వాళ్లను జోకుల్లో ముంచెత్తుతాడు. ఫలక్‌నామా దాస్‌లో విశ్వక్ సేన్ బలవంతం మేరకు తరుణ్ భాస్కర్ నటించాడు. కానీ హీరోగా చేసినప్పటికీ.. డైరెక్షన్‌లోనే ఆయన కొనసాగుతాడు అని అభినవ్ గోమటం అన్నారు.

డేట్స్ ప్రాబ్లెం వల్ల

డేట్స్ ప్రాబ్లెం వల్ల

ఈ నగరానికి ఏమైంది అనే సినిమా తర్వాత నాకు గ్యాప్ రావడానికి సీత సినిమా. తేజ సినిమా కావడంతో కొన్ని అవకాశాలు చేజారాయి. వాస్తవానికి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించాలి. డేట్స్ ప్రాబ్లం వల్ల నేను మరో రెండు సినిమాలు చేయలేకపోయాను. అందుచేత గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలుగుతున్నది అని అభినవ్ గోమటం పేర్కొన్నారు.

రేడియో జాకీగా నటిస్తున్నా

రేడియో జాకీగా నటిస్తున్నా

మీకు మాత్రమే చెబుతా చిత్రంలో నేను రేడియో జాకీ‌గా నటిస్తున్నాను. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నేను నటించడం లక్కీగా భావిస్తున్నాను. నా రోల్ ఎంటర్టైన్‌గా ఉంటుంది. సినిమా చూశాక ఆడియన్స్ తప్పకుండా ఆలోచిస్తారు, సినిమాకు కనెక్ట్ అవుతారు అని అన్నారు.

తదుపరి ప్రాజెక్టులు ఇవే

తదుపరి ప్రాజెక్టులు ఇవే

కెరీర్‌లో నాకు, ఒకే తరహా పాత్రలు చెయ్యడం ఇష్టం ఉండదు. అన్నీ రకాల పాత్రలు చెయ్యాలని ఉంది. అందుచేత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను. మీకు మాత్రమే చెబుతాను తర్వాత నితిన్, జయంత్ సీ పరాంజీ చిత్రంలో నటిస్తున్నాను. అలాగే సుశాంత్ చిత్రంలో ఓ మంచి పాత్రను వేస్తున్నాను. రంగ్ దే చిత్రంలో నితిన్‌ పక్కన నాది మంచి పాత్ర చేస్తున్నాను అని అభినవ్ గోమటం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X