For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో చెడ్డవాళ్లను ఎదుర్కోవడం ఓ ఛాలెంజ్.. అదా శర్మ

    |
    Adah Sharma Sweet Words About Puri Jagannadh And Rajasekhar | Rajasekhar | Adah Sharma | Filmibeat

    హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ ఆదా శర్మ. క్షణం లాంటి సినిమాలతో హీరోయిన్‌గా ఆకట్టుకొన్నారు. తాజాగా హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ పద్మ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా సినిమా ప్రమోషనల్‌లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

     డాక్టర్ పాత్ర నాకు ఎక్సైటింగ్‌గా

    డాక్టర్ పాత్ర నాకు ఎక్సైటింగ్‌గా

    కల్కి చిత్రంలో నేను డాక్టర్ పాత్రను పోషించాను. నా ఫెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఇప్పటి వరకు నేను డాక్టర్ రోల్ చేయలేదు. ఆ రోల్ నన్ను చాలా ఎక్సైటింగ్ చేసింది. ఇప్పటి వరకు నా కెరీర్‌లో పోషించని పాత్ర. నా పాత్ర పరిధి ఎంత అనేది పట్టించుకోను. రోల్ ఎలా ఉంటుందనే నాకు ఇంపార్టెంట్. కల్కి కొత్త రకం కథ, ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో రూపొందింది అని అదా శర్మ తెలియజేశారు.

     ప్రశాంత్ వర్మ ఢిపెరెంట్‌గా

    ప్రశాంత్ వర్మ ఢిపెరెంట్‌గా

    కల్కి సినిమాను ప్రశాంత్ వర్మ చాలా డిఫెరెంట్‌గా తెరకెక్కించారు. లవ్ ట్రాక్‌ను డిఫరెంట్ ట్రీట్ చేశాడు. సెన్సిబుల్ లవ్‌ను హీరో రాజశేఖర్, నా మధ్య డిజైన్ చేశారు. రెండు పాత్రలు చాలా మెచ్యుర్‌గా ఉంటాయి. ఇంకా నేను సినిమా చూడలేదు. ముంబైలో కూడా రిలీజ్ అయింది. నేను నా కుటుంబంతో కలిసి చూడాలనుకొంటున్నాను అని అదా శర్మ అన్నారు.

     రాజశేఖర్ లాంటి హీరోతో

    రాజశేఖర్ లాంటి హీరోతో

    టాలీవుడ్‌లో ఎంతో అనుభవం, పరిణితి ఉన్న రాజశేఖర్ లాంటి హీరోతో నటించడం గొప్ప అవకాశం. యాక్టింగ్ అంటే ఆయనకు ప్రాణం. నాతోపాటు అందరూ సెట్లో చాలా కంఫర్ట్‌గా ఉండేలా రాజశేఖర్ వ్యవహరించడం నాకు బాగా నచ్చింది. ఆయన ఇచ్చిన సహాకారం నాకు మరింత జోష్ కలిగింది. నా పాత్రను మరింత ఎలివేట్ చేసేలా చేసింది అని అదాశర్మ చెప్పారు.

     చెడ్డవాళ్లను ఎదుర్కోవడమే పెద్ద ఛాలెంజ్

    చెడ్డవాళ్లను ఎదుర్కోవడమే పెద్ద ఛాలెంజ్

    సినిమాలో నటించడం నాకు ఛాలెంజ్ అనిపించదు. కాని కొందరు చెడ్డవాళ్లను ఎదుర్కొనడం అదోక ఛాలెంజ్‌లా అనిపిస్తుంది. నా కెరీర్‌లో పూరీ జగన్నాథ్, రాజశేఖర్ లాంటి మంచి వాళ్లను చూశాను. అలాగే చాలా మంది చెడ్డవాళ్లను చూడాల్సి వచ్చింది. మంచి ఎక్కువగా జరిగినప్పుడు, చెడు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని అదా శర్మ వ్యక్తం చేశారు.

    నాకు గ్యాప్ రాలేదు..

    నాకు గ్యాప్ రాలేదు..

    హార్ట్ ఎటాక్ తర్వాత నేను ఎక్కువగా కనిపించలేడం లేదంటే ఒప్పుకోను. క్షణం లాంటి సినిమాలతో వచ్చాను. మంచి పాత్రల కోసం ఎదురు చూడటం వల్ల గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను తెలుగు పరిశ్రమకు దూరం కాలేదు. ఇక్కడే ఉన్నాను. నాకు ఓ రేంజ్ కల్పించింది మీడియా, అభిమానులని నమ్ముతాను. వారికి దగ్గరగా ఉండటానికి సోషల్ మీడియాలో, ఇన్స్‌టాగ్రామ్‌తో వారికి టచ్‌లో ఉంటాను అని అదా శర్మ అన్నారు.

    English summary
    Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. This movie teaser released on June 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X