For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క ‘కిస్‌’తో లైఫంతా తలకిందులు.. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి.. అడివి శేషు ఎమోషనల్

|

టాలీవుడ్‌లో క్షణం, గూఢచారి సినిమాల యువ హీరో అడివి శేషు మంచి గుర్తింపు లభించింది. ఆయన నటించిన ఈ చిత్రాల తర్వాత తెలుగు పరిశ్రమలో థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. గూఢచారి సినిమాతో మాత్రం ఇండస్ట్రీలోని వర్గాలనే కాకుండా టాప్ హీరోలను ఆకట్టుకొన్నారు. ఇటీవల కాలంలో పరిణతితో కూడిన నటనను కనబరుస్తున్న అడివి శేషు తాజాగా ఎవరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్ రూపొందిస్తున్న చిత్రంలో రెజీనా కసండ్రా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో అడివి శేషు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. అడివి శేషు చెప్పిన విషయాలు ఆయన మాట్లల్లోనే..

ఇండస్ట్రీలో అందరి సహకారంతో

ఇండస్ట్రీలో అందరి సహకారంతో

క్షణం, గూఢచారి సినిమాల తర్వాత కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. కొన్నేళ్లుగా నా కెరీర్ గొప్పగా సాగడానికి చాలా మంది సహకరించారు. ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా ఎవరో ఒకరి సపోర్ట్ లేకపోతే రాణించలేం. ప్రతీ దశలో ఎవరో ఒకరు నాకు అండగా నిలిచారు. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆఫీస్ బాయ్‌కి అంకింతం అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాను. ఏ ఒక్కరిని మరిచిపోకూడదు. నాకు తోటి నటులు, మీడియా, స్నేహితులు సహకారం మరవలేం అని అడివి శేషు అన్నారు.

అల్లు అర్జున్ ట్వీట్‌తో

అల్లు అర్జున్ ట్వీట్‌తో

గూఢచారి సినిమా రిలీజ్ సమయంలో చాలా మంది హీరోలు నాకు సహకరించారు. అల్లు అర్జున్ నా టీజర్ గుంచి ట్వీట్ చేశారు. సినిమా బాగుందని మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నాగార్జున ఆయన సినిమా ప్రమోషన్‌ను వదులుకొని నా సినిమా గురించి మాట్లాడారు. చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా నా సక్సెస్ మీట్‌కు వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఇదంతా నా మంచితనానికి మంచి జరిగిందని భావిస్తాను అని అడివి శేషు పేర్కొన్నారు.

అనుభవాలతో అవగాహన

అనుభవాలతో అవగాహన

గత కొన్నేళ్లుగా నా కెరీర్‌లో ఎదురైన నా అనుభవాల ద్వారా సినిమాల ఎంపికలో మార్పు వచ్చింది. కిస్ సినిమా తర్వాత చాలా సంఘటనలు ఎదుర్కొన్నాను. ఆ సినిమాకు ముందు ఇండస్ట్రీలో కొంత మంది నా ఆలోచనలను తప్పుదారి పట్టించారు. హీరో, కమర్షియల్ అంశాల పేరుతో సినిమాపై నాకు భ్రమలు కల్పించారు. కానీ అనుభవాల నుంచి నేను పాటలు నేర్చుకొన్నాను అని అడివి శేషు వెల్లడించారు.

కిస్ సినిమా ఓ గుణపాఠం

కిస్ సినిమా ఓ గుణపాఠం

కిస్ సినిమా నాకు గొప్ప గుణపాఠాన్ని నేర్పింది. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఒక్కపైసా కూడా తిరిగి రాలేదు. పోస్టర్లకు ఉపయోగించిన మైదాపిండి ఖర్చులు కూడా రాలేదంటే నమ్మకం కలుగదు. మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ షో వరకు మేము రూ.2 కోట్లు నష్టపోయాం. నేను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని కావడంతో నేను కోలుకోలేకపోయాను. కిస్ సినిమాపై భారీగా డబ్బు పోవడంతో ఏమీ అర్ధం కావడం లేదు అని అన్నారు.

అద్దె కట్టేందుకు డబ్బులు లేని పరిస్థితి

అద్దె కట్టేందుకు డబ్బులు లేని పరిస్థితి

కిస్ తర్వాత నా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అలాంటి రోజుల్లో ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో ఓ రోజు మణికొండలో నడుచుకొంటు వెళ్తుంటే.. ఫోర్డ్ కార్ల షోరూం వద్ద ఆగి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కారును చూస్తుంటే.. అందులోని మేనేజర్ వచ్చి.. మీరు పంజా సినిమాలో నటించారు కదా.. మీ ఫ్యాన్ అని పరిచయం చేసుకొన్నాడు. ఆ తర్వాత అతడితో మాటలు కలుపుతూ.. నా దగ్గర డబ్బులు లేవు.. కానీ కొత్తగా వచ్చిన కారును బుక్ చేయాలని అనుకొంటున్నానని అన్నాను. దాంతో ఆయన ఒప్పుకొని కారు బుక్ చేశాడు. బాహుబలి సినిమా షూట్‌కు వారం రోజుల ముందు జరిగిన ఆ సంఘటనతో నాపై నాకే నమ్మకం కలిగింది. ఏదో పాజిటివ్ విషయం ఉందనే విషయాన్ని బలంగా నమ్మాను. అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూసుకోలేదు అని అడివి శేషు అన్నారు.

సలహాలు, సూచనలతో అలాంటి గందరగోళం

సలహాలు, సూచనలతో అలాంటి గందరగోళం

కిస్‌ సినిమా దెబ్బతో నాకు జడ్జిమెంట్ పోయింది. దాంతో ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం మొదలుపెట్టాను. అదీ నా కెరీర్‌లో ఓ గందరగోళానికి దారి తీసింది. క్షణం సినిమా సమయంలో నాకు పరిస్థితులుపై అవగాహన కలిగింది. అందుకే మనం ఎవరి నుంచి సలహాలు తీసుకోవాలో.. తీసుకోకూడదో తెలిసింది. అప్పటి నుంచి నా సినిమాల ఎంపికలో క్లారిటీ వచ్చింది అని అడివి శేషు తన అనుభవాలను పంచుకొన్నారు.

English summary
Evaru Telugu thriller film directed by Venkat Ramji. The film produced by Pearl V Potluri, Param V Potluri and Kavin Anne. The film starring Adivi Sesh, Regina Cassandra, and Naveen Chandra. The music is composed by Sricharan Pakala and editing by Garry Bh. The film is scheduled for release on 15 August 2019. In this occassion, Adivi Sesh speaks to Telugu filmibeat exclusively.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more