సినిమా కంటే అదే కష్టం.. నటుడు ఆనంద్ చక్రపాణి కామెంట్స్
ఓ నటుడుకి ఎప్పుడు ఎలా పేరు వస్తుందో చెప్పలేం. తనలోని నటుడిని దర్శకులు ఎప్పుడు ఎలా వాడుకుంటారో కూడా చెప్పలేం. దాసి సినిమా అప్పుడెప్పుడే గ్యాప్ ఇచ్చిన నటుడు ఆనంద్ చక్రపాణి.. మళ్లీ మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తనలోని నటుడిని మళ్లీ అలా పరిచయం చేసేందుకు దాదాపు 25 యేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆనంద్ చక్రపాణి హవా నడుస్తోంది.
టాలీవుడ్‌లో రాబోతోన్న ముఖ్యమైన సినిమాల్లో ఆనంద్ చక్రపాణి ఎంతో ముఖ్యమైన పాత్రలు వస్తున్నాయి. ఇప్పటికే అనగానగా ఓ అతిథి చిత్రంలో అద్భుతంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఆనంద్ చక్రపాణి మాట్లాడు.. సినిమా మేకింగ్.. యాడ్ ఫిల్మ్ మేకింగ్ మధ్య ఉన్న తేడాలు, కష్టాలను తెలిపాడు. ప్రస్తుతానికైతే తనలో ఉన్న రచయిత, దర్శకుడు బయటకు రాడని చెప్పుకొచ్చాడు.

సినిమా కంటే యాడ్స్ తీయడమే చాలా కష్టం, ఎందుకంటే యాడ్స్‌లో ఉండేది కేవలం 30 సెకన్లే. అందులోనే మెసెజ్‌ను అందరికీ అర్థమయ్యేలా ఆ ప్రొడక్ట్ గురించి చెప్పాలి. పైగా అందులో లాంగ్ షాట్స్ వంటివేమీ ఉండవు. సినిమాల్లోలా ఎమోషన్స్ పండించడానికి సమయం ఉండదు. ఉన్న సమయంలోనే ప్రొడక్ట్ గురించి చెప్పాల్సి వస్తుంది. అందుకే సినిమా కంటే యాడ్స్ తీయడమే చాలా కష్టమని ఆనంద్ చక్రపాణి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











