లోకేష్‌‌ కోసం చంద్రబాబు.. రాహుల్‌‌ కోసం సోనియా.. నేను అలా చేస్తే తప్పేంటి? బ్రహ్మాజీ పంచ్

సింధూరం సినిమాతో హీరోగా మారి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన బ్రహ్మాజీకి సినిమా పరిశ్రమతో అనుబంధం, సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన బ్రహ్మాజీ ప్రస్తుతం ఓ పిట్ట కథ సినిమాతో తన కుమారుడు సంజయ్ రావును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెరకెక్కించింది. ఈ సినిమా మార్చి 6న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. తన కుమారుడి సినీ ఎంట్రీ గురించి బ్రహ్మ కథ ఎలాంటి పిట్ట కథలు చెప్పారంటే..

ఇండస్ట్రీ రిలేషన్స్ ఫుల్లుగా వాడుకొన్నా

ఇండస్ట్రీ రిలేషన్స్ ఫుల్లుగా వాడుకొన్నా

నా కుమారుడు సంజయ్ రావు ఓ పిట్ట కథతో టాలీవుడ్‌ పరిచయం అవుతున్నారు. అందుకోసం నాకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలను పూర్తిగా ఉపయోగించుకొన్నాను. నాతో ఉన్న అనుబంధంతో నేను అడుగానే చిరంజీవి, మహేష్ బాబు, కొరటాల శివ తదితరులు నాకు పూర్తిగా సహకారం అందించారు. నా కుమారుడు నటించిన సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని బ్రహ్మాజీ చెప్పారు.

మీ కుమారుడిని హీరోగా ఎందుకు ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు?

మీ కుమారుడిని హీరోగా ఎందుకు ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు?

లోకేష్‌ను చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం చేయాలనుకొంటున్నారు? అలాగే రాహుల్ గాంధీని సోనియా గాంధీ.. సీఎం కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం లేదా? అలాగే నా వృత్తి నటన. చాలా కాలంగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నా కుమారుడిని యాక్టింగ్‌లోకి ప్రవేశపెడితే తప్పేమిటి. ప్రధానంగా నా కుమారుడు సంజయ్ రావు మర్చంట్ నేవిలో పనిచేసే వాడు. ఓ రోజు యాక్టింగ్‌ చేస్తానని చెప్పాడు. సరే ట్రై చేయి.. సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉంటావు. లేకపోతే ఉద్యోగం చేసుకో అంటూ సలహా ఇచ్చాను అని బ్రహ్మాజీ అన్నారు.

చెందు ముద్దు గురించి

చెందు ముద్దు గురించి

దర్శకుడు చెందు ముద్దును నాకు డైరెక్టర్ సాగర చంద్ర పరిచయం చేశాడు. అప్పుడు సంజయ్ కోసం ఓ షార్ట్ ఫిలిం చేయాలని చెందు ముద్దును కలిశాను. ఆ సమయంలో నేను చేయలేనని చెప్పాడు. కానీ పది రోజుల తర్వాత ఓ పాయింట్‌తో వచ్చి నాకు చెప్పాడు. నాకు నచ్చడంతో ఓ పిట్ట కథ సినిమాగా మారింది. ఈ కథలో నాది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్. సీరియస్‌గాను.. వినోదం కూడిన పాత్ర అని బ్రహ్మాజీ తెలిపారు.

నా కొడుకును మంచి క్యారెక్టర్‌తో

నా కొడుకును మంచి క్యారెక్టర్‌తో

టాలీవుడ్‌లో నేను హీరోను కాదు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును. కాబట్టి నా కొడుకును ఓ మంచి క్యారెక్టర్‌తో సినిమా రంగ ప్రవేశం చేయాలని భావించాను. ఓ మంచి క్యారెక్టర్‌తో ఎస్టాబ్లిష్ అయితే ప్రేక్షకులకు చేరువ అవుతారనేది నా గట్టి ఫీలింగ్. తొలుత సంజయ్ యాక్టర్ కావాలనుకొన్నప్పుడు నేను సరే అన్నాను. ఆడిషన్స్‌కు హాజరు కావాలని చెప్పాను. అది వర్కవుట్ కాలేదు అని బ్రహ్మాజీ చెప్పారు.

Recommended Video

Brahmaji Teasing Anchor Suma At Bheeshma Pre Release Event | Filmibeat Telugu
కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా

కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా

సంజయ్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీతో నా కుమారుడి గురించి చెప్పాను. అప్పుడే నక్షత్రం సినిమా ప్రారంభం కాబోతున్నది. స్వయంగా కృష్ణవంశీ మా ఇంటికి వచ్చి సంజయ్‌ని తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టుకొన్నారు. దాంతో సినిమా వాతావరణం బాగా అలవాటు పడిపోయాడు. సినిమా రంగంలో అన్ని శాఖల గురించి బాగా తెలిసింది. దాంతో హీరోగా పరిచమయ్యే క్రమంలో సెట్లో బెరుకు పోయింది అని బ్రహ్మాజీ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X