పెద్ది ఇండస్ట్రీకి పెద్ద దిక్కు.. రంగస్థలం మూవీని మించిన సినిమా!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది సినిమా ప్రమోషన్స్ జోరందుకొన్నాయి. ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడిన చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. దాంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెంచేలా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ భారీగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సాంకేతిక నిపుణులు, ఈ చిత్రంలో నటించిన యాక్టర్లు తాము పడిన కష్టాన్ని, తాము పోషించిన పాత్రల గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విలక్షణ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ..

పెద్ది సినిమా రిలీజ్ అనేది ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. పాజిటివ్‌గా ఆ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో బెస్ట్ మూవీ. నేను గతంలో నటించిన సినిమాలను పరిగణనలోకి తీసుకొంటే నేను చేసిన క్యారెక్టర్లలో నంబర్ 1. నేను నటించిన రంగస్థలం ఇష్టమే. కానీ దానికి మించిన సినిమా. లుక్ పరంగా, క్యారెక్టర్ పరంగా బెస్ట్. రంగస్థలంలో జగపతి బాబు కనిపిస్తాడు. కానీ పెద్దిలో నేను కనిపించను. నా గొంతు విని గుర్తు పట్టాల్సిందే. నేను అలా దొరికిపోతాను అని జగపతి బాబు అన్నారు.

Jagapathi Babu rated Ram Charan s Peddi

నేను నటించిన సినిమాల్లో నాకు గుర్తుండే సినిమాలు కేవలం ఆరు మాత్రమే. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత, పెద్ది. వాటిలో పెద్ది సినిమా నంబర్ వన్‌గా ఉంటుంది. అప్పలసూరి క్యారెక్టర్ ఆర్క్ ఉంది. ఫీల్ ఉంది అని జగపతి బాబు చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలో నా ఫేవరేట్ యాక్టర్లలో రాంచరణ్ ఒకరు. అందరితో ఆయన చాలా పద్దతిగా, గౌరవంగా ఉంటాడు. వండర్‌ఫుల్ హ్యుమన్ బీయింగ్. పెద్ది సినిమాలో ఆయన పడిన కష్టం మాటల్లో చెప్పలేం. డూప్ లేకుండా, బాడీ డబుల్ లేకుండా యాక్షన్ సీన్లు చేసి గాయపడ్డారు. రంగస్థలం నుంచి రాంచరణ్ నటుడిగా పరిణితి చెందారు అని అన్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే.. ముంబై, భోపాల్, బెంగళూరులో ప్రెస్ ఈవెంట్స్ భారీగా నిర్వహించారు. గురువారం మే 28వ తేదీన రాంచరణ్, జాన్వీ కపూర్, ఇతర సభ్యులు ఢిల్లీలో జరిగే ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారు. అనంతరం చెన్నైలో జరిగే ప్రెస్ మీట్, విజయనగరం, హైదరాబాద్‌లో జరిగే ప్రెస్ మీట్స్‌లో పాల్గొంటారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రీమియర్లతో ప్రారంభమై జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు.

Read more about: jagapathi babu ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X