నా చేతిలో గుణ 369 లాంటి సూపర్ హిట్ మూవీ.. నేనెందుకు భయపడాలి.. కార్తీకేయ

RX100 బ్లాక్ బస్టర్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తీకేయ క్రేజీ హీరోగా పేరును సొంతం చేశారు. ఆ తర్వాత రిలీజైన హిప్పీ మూవీ అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. ఆ క్రమంలో మరోసారి గుణ 369 అనే సినిమాతో కార్తీకేయ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్పింట్ ఫిల్మ్స్, జాపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలుగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో హీరో కార్తీకేయ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. కార్తీకేయ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే

ప్రతీ సినిమా నాకు ఛాలెంజే

ప్రతీ సినిమా నాకు ఛాలెంజే

హిప్పీ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే గుణ 369 నాకు ప్రత్యేకమైనది. నేను ఎప్పుడూ దేనికదే కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాం. ప్రతీ సినిమా కొత్త జర్నీ, ప్రతీ మూవీ ఛాలెంజే. అయితే సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన ఆలోచనల్లో మార్పు ఉండదు. ఫ్లాప్ వచ్చిందని గుణ సినిమాను హిట్ చేయరు. హిట్ వచ్చిందని గుణ బాగున్నా ఫెయిల్ చేయరు. కాకపోతో ఫ్లాప్ అనే ఇంపాక్ట్ సినిమా ఉంటుందని భావిస్తాను అని కార్తీకేయ తెలిపారు.

నాకు భయపడాల్సిన అవసరం లేదు

నాకు భయపడాల్సిన అవసరం లేదు

సినిమా పరిశ్రమలో జయపజయాలు సర్వసాధారణం. ఉాదాహరణకు రామ్‌కు, పూరీ జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్ ముందు హిట్లు లేవు. ఇస్మార్ట్‌తో బ్లాక్ బస్టర్ కొట్టారు. వారితో పోల్చుకొంటే నేనేంత.. ఒకట్రెండు సినిమాలు మాత్రమే. వారికే ఎలాంటి భయం లేనప్పుడు, నేను ఎందుకు భయపడాలి. నా వద్ద గుణ 369 లాంటి మంచి సినిమా చేతిలో ఉన్నప్పుడు ఇంక భయపడాల్సిన అవసరమే లేదు అని కార్తీకేయ పేర్కొన్నారు.

నిర్మాతలు హ్యాపీగా ఉంటే

నిర్మాతలు హ్యాపీగా ఉంటే

గుణ 369 సినిమా నిర్మాతలు ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారో నేను అంతే. నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా వల్ల నిర్మాతలకు మంచిగా డబ్బులు వస్తే నేను ఇంకింత హ్యాపీగా ఫీలవుతాను. గుణ సినిమాలో నాది సాధారణమైన అబ్బాయి పాత్రను పోషించాను. పక్కింటి అబ్బాయిగానే కాదు.. ఇంట్లో అబ్బాయి మాదిరిగా గుణ పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో సింపతి అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతుంది అని కార్తీకేయ అన్నారు.

గుణ 369 టైటిల్ గురించి

గుణ 369 టైటిల్ గురించి

గుణ సినిమా ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కథ. అమ్మా, నాన్న, చెల్లెలు ఉంటారు. ఓ సెల్‌ఫోన్ షాపులో పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తాడు. అలా బీటెక్ చదివే అబ్బాయి ఎందుకు ఖైదీగా మారారడేనేది ఈ సినిమా కథ. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించారనే సినిమా ప్రధానమైన కథ. గుణ టైటిల్‌లో ఓ పవర్ ఉంటుంది. ఖైదీగా ఉన్నప్పుడు 369 నెంబర్ ఉండటంతో ఆ రెండు కలిపి గుణ 369 అని టైటిల్‌ను ఖారారు చేశారు.

 దర్శకుడు అర్జున్ జంధ్యాలలో అలాంటి ఫైర్

దర్శకుడు అర్జున్ జంధ్యాలలో అలాంటి ఫైర్

ఏదైనా సినిమాలో హీరోది తక్కువ ఎఫర్ట్ ఉంటుంది. ఎక్కువగా నిర్మాతలు, దర్శకులు కష్టపడుతారు. సినిమాకు హీరో ఫేస్ కాబట్టి.. హిట్ అయితే ఎక్కువగా పేరు వస్తుంది. కష్టపడేది వాళ్లు.. ఎంజాయ్ చేసేది మేము అని కార్తీకేయ అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాలకు నాకు హెల్తీ కనెక్షన్ ఉంది. మళ్లీ వెంటనే పనిచేయాలనే కోరిక కలిగింది. మంచి సినిమా తీయాలనే ఓ ఫైర్ అతనిలో కనిపించింది అని కార్తీకేయ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X