twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ కొడితే ఎవడూ పట్టించుకోవడం లేదు.. ఫ్లాప్ వస్తేనే న్యూస్ అవుతుందేమో..

    By Rajababu
    |

    నేచురల్ స్టార్ నానీ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా హిట్లను తన ఖాతాలో వేసేసుకొన్నాడు. ఎంసీఏ సినిమా సక్సెస్ తర్వాత నాని నటిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్ కథానాయికలు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి హిప్ హిప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 13న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాని తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. కృష్ణార్జున యుద్ధం గురించి నాని వెల్లడించిన విషయాలు ఇవే..

    Recommended Video

    Dil Raju Review On Krishnarjuna Yudham
    డబుల్ రోల్ హీరో‌గా

    డబుల్ రోల్ హీరో‌గా

    జెంటిల్మన్ సినిమా తర్వాత వెంటనే ద్విపాత్రాభినయం చేయడం అలా జరిగిపోయింది. డబుల్ రోల్‌తో చెప్పిన కథలన్నీ బాగా నచ్చాయి. అందుకే నేను ఒప్పుకొంటున్నాను. అన్నీ మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. జెండాపై కపిరాజు చిత్రంలో కూడా డబుల్ రోల్ చేశాను. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడం వెనుక ఏదో ఒక కారణం ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం వెనుక అనేక కారణాలు ఉంటాయి. డబుల్ రోల్‌తో నాకు చేదు అనుభవాలు తక్కువ.

    గాంధీ కథ చెప్పినప్పుడు

    గాంధీ కథ చెప్పినప్పుడు

    ఇక కృష్ణార్జున యుద్ధం విషయానికి వస్తే డబుల్ రోల్ అనేది చాలా స్పెషల్‌గా ఉంటుంది. గాంధీ కథ చెప్పినపుడు చాలా ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాను. ఈ సినిమాలో రెండు పాత్రల మధ్య వైరుధ్యం చాలా ఎక్కువ. రెండు పాత్రలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టడం గొప్ప విషయం. రెండు పాత్రలు సినిమా మొత్తం ట్రావెల్ అవడం ఈ చిత్రంలో ప్రత్యేకత.

    హలో బ్రదర్‌కు సంబంధం లేదు

    హలో బ్రదర్‌కు సంబంధం లేదు

    ఈ చిత్రానికి హలో బ్రదర్ సినిమాకు పోలీకలేదు. ఆ సినిమాలో మాదిరిగా మా చిత్రంలో వారిద్దరూ కవలలు కాదు. కేవలం వారిద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరు కలిసి కొట్టుకొంటారు. వాళ్లిద్దరూ కలిసి ఎదుటివాళ్లతో ఫైట్ చేస్తారు. ఒకడు ప్రాగ్‌లో రాక్‌స్టార్. మరొకడు చిత్తూరు జిల్లాకు చెందినవాడు.

    చిత్తూరు యాసలో డైలాగ్స్

    చిత్తూరు యాసలో డైలాగ్స్

    కృష్ణార్జున యుద్ధంలో చిత్తూరు స్లాంగ్ బాగా ఆకట్టుకొంటుంది. చిత్తూరు యాసలో స్క్రిప్టు అంతా రాసుకొన్నారు. గాంధీ స్వతహాగా చిత్తూరుకు చెందిన వాడు కోవడంతో చాలా ఈజీ అయింది. మానిటర్‌లో సీన్ ఒకే చేసే దర్శకుడికి క్లారిటీ ఉంటే యాక్టర్‌కు ఈజీ అయిపోతుంది. కృష్ణ పాత్ర చిత్తూరు యాస మాట్లాడుతుంది.

     హిప్ హాప్ తమీజా మ్యూజిక్ గురించి

    హిప్ హాప్ తమీజా మ్యూజిక్ గురించి

    కృష్ణార్జున యుద్ధం చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆయన మొదట్లో వాడి పుల్లవాడి అనే సాంగ్ చేశాడు. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను వినేవాడిని. ఆ తర్వాత ధృవ చిత్రానికి సంగీతం చేశాడని ఆ పాటలు విన్నాను. అప్పుడే నేను గాంధీ అతడిని తీసుకోవాలని అనుకొన్నాం. ఈ సినిమాకు అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఇంతకు ముందు గాంధీ సినిమాలా ఉండదు.. నాని సినిమాలో కూడా ఉండదు.

    అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ గురించి

    అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ గురించి

    అనుపమ పరమేశ్వరన్ చాలా సాధారణమైన యువతిగా కనిపిస్తుంది. ఈమేనా శతమానం భవతి, ప్రేమమ్ సినిమాల్లో నటించింది అనే డౌట్ కలుగుతుంది. సెట్‌లో సీన్ షూట్ చేస్తుంటే మామూలుగా ఉంటుంది. షూట్ తర్వాత మానిటర్‌లో చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. కెమెరాకు, అనుపమకు ఏదో కెమిస్ట్రీ ఉంది. స్క్రీన్ ప్రజెన్స్ బాగా ఉంటుంది. ఏ యాక్టర్‌కైనా అలాంటి టాలెంట్ ఉండటం అదృష్టం. ఈ చిత్రంలో మరో కథానాయిక రుస్కర్ మీర్. భాష రాకపోయినా చాలా కష్టపడి నటించింది.

    వరుస సక్సెస్‌తో భయం

    వరుస సక్సెస్‌తో భయం

    వరుస సక్సెస్‌లతో నాకు ఎలాంటి గర్వం రాలేదు. ఎవరైనా సినిమా హిట్ అని కాంప్లిమెంట్ ఇస్తే.. ప్లాప్ అయితే ఎలాంటి కామెంట్లు వస్తాయో అని భయపడుతాను. ఎనిమిది సక్సెస్‌లు వచ్చిన తర్వాత ఎక్కడ బ్రేక్ పడుతుందో అనే భయం నన్ను వెంటాడుతున్నది. తొమ్మిదో సినిమా వద్ద ఫ్లాప్ పడుతుందా లేదా పదో సినిమాకు ఫ్లాప్ వస్తుందా అనే ఆలోచన నాలో వస్తున్నది.

    హిట్లను ఎవడూ పట్టించుకోవడం లేదు

    హిట్లను ఎవడూ పట్టించుకోవడం లేదు

    సక్సెస్ గురించి నేను పట్టించుకోను. ఒకసారి సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్, క్రేజ్ అన్నీ కిందపడిపోతాయి. అందుకే నేను కీడు ఆలోచించి మేలు కోరుకొంటాను. విజయాల వల్ల నాకు ఒత్తిడి పెరగడం లేదు. నేను నటించిన సినిమా హిట్ అయితే ఎవడూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నాని హిట్ కొడితే న్యూస్ కాదు. ఫ్లాప్ కొడితేనే అసలు విషయం బయటపడుతుంది అని అన్నారు.

    నాగార్జునతో కలిసి షూటింగ్

    నాగార్జునతో కలిసి షూటింగ్

    నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ షూటింగ్‌ జరుగుతున్నది. ఓ పాట కూడా షూట్ చేశాం. నాగార్జున‌తో కలిసి నటించడం చాలా ఫన్‌గా ఉంది. ఈ చిత్రంలో మాది అన్నదమ్ముల పాత్రలు కావు. చాలా డిఫరెంట్ సినిమా. ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సమంజసం కాదు.

    కొరటాల శివ సినిమా గురించి

    కొరటాల శివ సినిమా గురించి

    నాగార్జున చిత్రం తర్వాత మరే చిత్రాన్ని అనుకోలేదు. దాదాపు ఐదారు సినిమాలకు సంబంధించిన వర్క్ జరుగుతున్నది. అయితే ఐదారు సినిమాల్లో ఏది ముందు ప్రారంభమవుతుందో చెప్పలేను. కొరటాల శివతో సినిమా గురించి ఇంకా క్లారిటీ లేదు. కొరటాల శివను కలువలేదు. సినిమా గురించి చర్చ జరుగలేదు.

    English summary
    After Success of MCA, Actor Nani latest film is 'Krishnarjuna Yuddham. The film will be hitting screens on April 13, 2018. Merlapaka Gandhi is directed this movie. Ruskar Mir, Anupama Parameswaran are lead pair to Nani. Hip Hop Tamizha composed the music. Nani playing dual role again. In this occassion, Nani speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X