దసరా రిజల్ట్‌తో సంతృప్తి చెందలేదు.. ఇంకా అసంతృప్తే.. నాని (ఇంటర్వ్యూ)
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రం భారీ రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..

రిలీజ్ తర్వాత ఫోన్లు చేసి..
దసరా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియాగా అని నేను ఎప్పుడూ చూడలేదు. ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. రిలీజ్ తర్వాత చూసిన వాళ్లంతా ఫోన్ చేసి బాగుందని అంటున్నారు. ఇంకా ఫోన్ మోగుతూనే ఉంది. మేము అనుకొన్నంత రేంజ్‌లో సక్సెస్ అయింది అని నాని అన్నారు.

ప్రతీ సీన్ కష్టపడి చేశాం
దసరా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేసిన సీన్లు లేవు. దుమ్ము, ధూళితో కష్టపడి చేశాం. కానీ చేసిన సీన్లు ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసి చూసినప్పుడే మాకు ప్రతీ సీన్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అప్పడే అనుకొన్నాం. మాకు బాగా ఎంజాయ్ చేసిన సీన్, చాలా వెయిట్ చేసిన సీన్ క్లైమాక్స్ అని నాని అన్నారు.

రిజల్ట్ విషయంలో హ్యాపీగా ఉన్నా
దసరా సినిమా రిజల్ట్ తర్వాత నేను నటుడిగా ఇంకా సంతృప్తి చెందలేదు. నేను నటించే చివరి సినిమా వరకు సంతృప్తి అంటూ ఉండదు. నటుడిగా దసరా సినిమా రిజల్డ్ విషయంలో హ్యాపీగా ఉన్నాను. నేను సంతృప్తి చెందితే.. నేను మంచి సినిమాలు చేయలేను. ప్రతీ సినిమా విషయంలో నేను అసంతృప్తితోనే ఉంటాను. సంతృప్తి చెందితే నేను నటుడిగా ఆగిపోతాను అని నాని చెప్పారు.

శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే..
శ్రీకాంత్ కథ చెప్పిన వెంటనే బయటకు వచ్చి.. ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్‌ను తీసుకోవాలని నా టీమ్‌తో చెప్పాను. కొత్తవాడైనా కథ చెప్పినప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ వినిపించింది. సినిమా షూట్ చేసేటప్పుడు.. ప్రమోషన్స్ చేసేటప్పుడు ఈ సినిమా, డైరెక్టర్ మరో రేంజ్ అని చెప్పాను. ఈ సినిమా స్పాన్‌ను అప్పుడే చెప్పాను. ఈ సినిమా రిజల్డ్‌ను అప్పుడే చూశాను, నాకు నచ్చినట్టే అందరికి నచ్చుతుందని అనుకొన్నాను. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కాన్షిడెన్స్‌తో చెప్పాను అని నాని అన్నారు.

తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్
దసరా సినిమా కథను శ్రీకాంత్ ఒదెల చెప్పినప్పుడే మిగితా భాషల్లో నిర్మించాలని అనుకొన్నాం. ప్రేమ, స్నేహం, పగ అనే అంశాలు ప్రతీ భాషలో ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తాయని అనుకొన్నాం. మన సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మతోపాటు జమ్మి, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన విషయాలు నేర్చుకున్నాను అని నాని చెప్పారు.

ఉత్తరాదిలో దసరాకు మంచి రెస్పాన్స్
దసరా సినిమాకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా అద్భుతంగా వస్తున్నది. బాలీవుడ్‌లో చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన ప్రేక్షకులంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నది. మేము ఊహించిన ఓపెనింగ్స్ వచ్చేశాయి. దసరా సినిమాకు వచ్చిన వసూళ్లు హిందీలో కొన్ని స్ట్రయిట్ సినిమాలకి కూడా రాలేదు. దసరా కలెక్షన్లు రోజురోజుకి పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది అని నాని చెప్పారు.


Click it and Unblock the Notifications











