సచిన్ కొడుకు పాత్ర కాదు, కథలో సర్‌ప్రైజ్, చైనాలో కూడా రిలీజ్: ‘జెర్సీ’ గురించి నాని

Recommended Video

Actor Nani Superb Words About Jersey Movie || Filmibeat Telugu

నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా నాని, నిర్మాత వంశీ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు.

జెర్సీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉండటం వల్ల సినిమా ప్రమోషన్ల మీద పూర్తి ఫోకస్ పెట్టలేక పోయాం. ఇక నుంచి పూర్తి ఫోకస్ ప్రమోషన్ల మీదనే ఉంటుందని నాని తెలిపారు. జెర్సీ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 12 ఉదయం 9 గంటలకు విడుదల కాబోతోందని, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15న ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.

నా కెరీర్లోనే అందమైన సినిమా అవుతుంది

నా కెరీర్లోనే అందమైన సినిమా అవుతుంది

నాని మాట్లాడుతూ.. ‘‘ఈ స్టేట్మెంట్ ఇప్పుడే ఇవ్వాలో లేదో తెలియదు... నా కెరీర్లో మోస్ట్ బ్యూటిఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఏప్రిల్ 19న విడుదల కాబోతోంది. ఇది నాకు చాలా స్పెషల్ సినిమా. ప్రతి ఒక్కరికీ ఎమెషనల్‌గా కనెక్ట్ అవుతుంది' అన్నారు.

సినిమా చేయడం వల్ల తగ్గాను

సినిమా చేయడం వల్ల తగ్గాను

సినిమా కోసం బరువు తగ్గలేదు. ఈ సినిమా చేయడం వల్ల తగ్గాను. క్రికెట్ ఆడి.. రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా నాకే తెలియకుండా వెయిట్ తగ్గాను. 36 ఏళ్ల వయసు కొంచెం తిని లావు అవుదామనుకున్నాను. కానీ రివర్స్‌లో బరువు తగ్గినట్లు.. నాని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద ఉన్నది నేనే అనే విషయం మరిచిపోయా

ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద ఉన్నది నేనే అనే విషయం మరిచిపోయా

‘‘ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద ఉన్నది నేనే అనే విషయం మరిచిపోయా. గతంలో ఏ సినిమా చూసినా ఎక్కడో అక్కడ నాని బయటకు వచ్చాడని అనిపించేది. కొన్ని సీన్లలో నాని క్యారెక్టర్‌ను డామినేట్ చేశాడు అనే ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాలో కేవలం అర్జున్‌ను మాత్రమే చూస్తారు. నేను సినిమా ఇప్పటి వరకు 20 సార్లు చూశాను. చూసిన ప్రతీసారి ఒక ఆర్టిస్టుగా చాలా సంతృప్తి కలిగింది. ఎందుకు అనేది ఏప్రిల్ 19న మీరు చూస్తారు.'' అని నాని చెప్పుకొచ్చారు.

కేవలం క్రికెట్ కాదు.. అందరికీ సర్ ప్రైజ్ ఉంది

కేవలం క్రికెట్ కాదు.. అందరికీ సర్ ప్రైజ్ ఉంది

సినిమా టీజర్, పోస్టర్ చూసి ఈ సినిమా అంతా క్రికెట్ క్రికెట్ అని అనుకుంటున్నారు. కానీ మీ అందరికీ సర్ ప్రైజ్ ఉంది. అదేమిటి అనేది ట్రైలర్లో తెలుస్తుంది. ఇది ఆడుతూ పాడుతూ చేసిన సినిమా కాదు, చాలా ఎమోషనల్ జర్నీ. ఇంతకు ముందు ఏ సినిమా చేసినా ఆ పాత్ర చేసిన ఆఖరి రోజు ఈ బట్టలు ఇదే చివరి రోజు, రేపటి నుంచి ఈ డైలాగులు మాట్లాడను, ఈ స్లాంగులో మాట్లాడను అనే ఫీలింగ్ ఉండేదే తప్పితే పెద్దగా ఎమోషనల్ ఫీలయ్యే వాడిని కాదు. జెర్సీ సినిమాకు మొదటి సారి నాకు ఆఖరి రోజు ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌కు సెండాఫ్ ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది.

జెర్సీ టైటిల్ వెనక స్ట్రాంగ్ రీజన్

జెర్సీ టైటిల్ వెనక స్ట్రాంగ్ రీజన్

క్రికెటర్లు వేసుకునే టీషర్టును జెర్సీ అంటారు. కేవలం క్రికెట్ మీద సినిమా కాబట్టి జెర్సీ టైటిల్ పెట్టలేదు. ఈ టైటిల్‌ పెట్టడం వెనక చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమిటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రొడ్యూసర్ వంశీ, నేను ఇద్దరం క్లాస్ మేట్స్. స్కూల్‌లో ఉన్నపుడు వంశీ క్రికెట్ బాగా ఆడేవాడు. మెయిన్ ప్లేయర్‌గా తను ఉండేవాడు, ఎక్స్‌ట్రాప్లేయర్ గా నేను ఉండేవాడిని. మా డెస్టినీ ఇద్దరం కలిసి సినిమాకు పని చేయడం, ఇది నా కెరీర్లోనే కాదు వంశీ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది.

మనకు ఇంకో డైరెక్టర్ దొరికాడు

మనకు ఇంకో డైరెక్టర్ దొరికాడు

డైరెక్టర్ గురించి చెప్పాలంటే... మనకు ఇంకొకడు దొరికేశాడు, వీడు మన డైరెక్టర్ అనే చెప్పుకోగలిగే మంచి డైరెక్టర్ దొరికేశాడు. అంతవరకు చెప్పగలను. సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఇదే అభిప్రాయానికి వస్తారని భావిస్తున్నాను.

చాలా గాయాలయ్యాయి, నమ్మించగలిగామనే కాన్ఫిడెన్స్ వచ్చింది

చాలా గాయాలయ్యాయి, నమ్మించగలిగామనే కాన్ఫిడెన్స్ వచ్చింది

సినిమా షూటింగ్ సమయంలో చాలా గాయాలయ్యాయి. ముక్కు విరిగిపోయింది. ఈ సినిమా కథలో క్రికెట్ అనేది నీడలాగా ఉంటుంది. కానీ కథ వేరు. చాలా ఎమోషనల్ డ్రామా. నాకు, డైరెక్టర్‌కు పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే.. సినిమా చూస్తున్నవారు తెరపై కనిపిస్తున్న నాని.. అర్జున్ అంత మంచి క్రికెటర్, ప్రొఫెషనల్ ఆటగాడు అని నమ్మకపోతే సినిమా అంతా డయల్యూట్ అయిపోతుంది. అది నమ్మించడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా అనిపించింది. సినిమా చూసిన తర్వాత గౌతమ్, నేను ఒకరి మొహం ఒకరం చూసుకుని పాసైపోయాం అనే ఫీలింగ్ వచ్చింది. క్రికెటర్ అని నమ్మించగలిగాం. దీని వల్ల అసలైన స్టోరీకి ఇంకా ఎక్కువ స్ట్రెంత్ వచ్చినట్లయింది.

క్రికెట్ అంటే పెద్ద ఇంట్రస్టు లేదు, కానీ...

క్రికెట్ అంటే పెద్ద ఇంట్రస్టు లేదు, కానీ...

చిన్నపుడు స్కూల్ లో ఉన్నపుడు క్రికెట్ ఆడేవాడిని, సచిన్ టెండూల్కర్ కు పెద్ద అభిమానిని. సినిమా పిచ్చి పట్టిన తర్వాత ఆడటం మానేశాను. తను రిటైర్డ్ అయిన తర్వాత క్రికెట్ కూడా చూడటం మానేశాను. ఐపీఎల్ మ్యాచులు కూడా ఎప్పుడూ చూలేదు. నా ప్రపంచం అంతా సినిమాయే. ఈ సినిమాకు ఆడటం మొదలు పెట్టిన తర్వాత క్రికెట్ అంటే మళ్లీ ఇంట్రెస్ట్ పెరిగింది.

సచిన్ కొడుకు పాత్ర కాదు

సచిన్ కొడుకు పాత్ర కాదు

ఈ సినిమాలో నాది సచిన్ కొడుకు అర్జున్ పాత్ర ఏమాత్రం కాదు. జెర్సీ నెం.6 అని ఉంటుంది. కానీ ఇలాంటి నెంబర్స్ ఎక్కువగా ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనే ఉంటాయి. సినిమా అంతా కూడా ఎక్కువగా రంజీ మ్యాచ్‌ల చుట్టూ తిరుగుతుంది. రంజీ ప్లేయర్లకు నెంబర్లు ఉండవు. జెర్సీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నపుడు లైవ్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్లు ఉంటుంది. షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు ఉండదు.

స్పూర్తి పొందిన కథ

స్పూర్తి పొందిన కథ

నేను చాలా స్పూర్తి పొందిన కథల్లో ఈ సినిమాలోని అర్జున్ కథ ఒకటి. సినిమా మీరు చూసినపుడు కూడా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇది ఎవరి బయోపిక్ కాదు. పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. కానీ సినిమా చూస్తున్నపుడు ఇది నిజమేమో అనే భావన కలుగుతుంది.

జ్యూక్ బాక్స్‌లో

జ్యూక్ బాక్స్‌లో

హైదరాబాద్ ప్లేయ‌ర్‌గా అర్జున్ పాత్ర ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ప‌నిచేస్తున్న‌ట్టు అర్జున్ తెరపై కనిపిస్తాడు. త్వరలో జ్యూక్ బాక్స్‌లో ఐదు పాట‌లుంటాయి. ఒక స‌ర్ ప్రైజ్ సాంగ్‌ని సినిమాకు ముందు విడుద‌ల చేస్తాం. అనిరుధ్ సంగీతం అంటే చాల ఇష్టం.

చైనాలో కూడా రిలీజ్

చైనాలో కూడా రిలీజ్

క్లైమాక్స్ మ్యాచ్ షూటతింగ్ 14 రోజులు చేశాం. ప్ర‌తి రోజూ సాయంత్రం 6.30 నుంచి తెల్లవారే సరికి షూటింగ్ ఉండేది. ఆ సమయంలో చాలా చలి ఉండటంతో చాలా కష్టపడ్డాం. ప్ర‌స్తుతం సమయం లేక పోవడం వల్ల తెలుగులో విడుద‌ల చేస్తున్నాం. చైనాలోనూ ఇలాంటి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలకు మంచి ఆదరణ ఉన్నందున అక్కడ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం.'' అని నాని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X