twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమ్మోహనం ఇంద్రగంటి ఇంద్రజాలం.. మహేష్‌కు ముందే చెప్పా.. నరేష్

    By Rajababu
    |

    సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో హీరో సుధీర్‌బాబు, అందాల తార అదితిరావు హైదరీ నటించిన సమ్మోహనం చిత్రం ప్రేక్షకుల నీరాజనం అందుకొంటున్నది. రోజు రోజుకు కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధానంగా సినిమా పిచ్చి ఉన్న ఓ తండ్రిగా సీనియర్ నటులు నరేష్ పాత్ర సినీ విమర్శకులను సైతం మెప్పించింది. సమ్మోహనం చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడతున్న నేపథ్యంలో సీనియర్ నటులు నరేష్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. నరేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    దేశానికే గర్వకారణంగా

    దేశానికే గర్వకారణంగా

    తెలుగు పరిశ్రమ రూపొందించిన సినిమాలు దేశ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఆరు చిత్రాలు ఘనవిజయం సాధిస్తాయని చెప్పాను. ఛలో, తొలిప్రేమ, సమ్మోహనం, రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సావిత్రి చిత్రాలు విజయం అవుతాయని ముందే ఊహించాను. నాకు ఉన్న జడ్జిమెంట్ కారణంగానో, కథపై ఉన్న నమ్మకంతోనూ అవి భారీ విజయాలు సాధించాయి. ఆ చిత్రాల కారణంగా ఇతర సినీ పరిశ్రమల దృష్టి టాలీవుడ్‌పై పడింది.

    Recommended Video

    సమ్మోహనం మూవీ రీడింగ్ సెషన్
     మంచి చిత్రాలకు ఆదరణ

    మంచి చిత్రాలకు ఆదరణ

    సుకుమార్, త్రివిక్రమ్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ లాంటి సీనియర్ దర్శకులు ఓ వైపు రంగస్థలం, సమ్మోహనం అద్భుతమైన చిత్రాలను అందిస్తుంటే.. యువతరం దర్శకులు ఆరోగ్యకరమైన చిత్రాల అందిస్తూ ప్రేక్షకులను థియేటర్లను రప్పిస్తున్నారు. ప్రేక్షకులు కూడా మంచి చిత్రాలను ఆదరిస్తున్నారడానికి సమ్మోహనం ఓ ఉదాహరణగా నిలిచింది.

    సమ్మోహనం హిట్ అని ముందే చెప్పా

    సమ్మోహనం హిట్ అని ముందే చెప్పా

    ఇటీవల రిలీజైన సమ్మోహనం చిత్రం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కథ చెప్పిన రోజే సమ్మోహనం పెద్ద సినిమా అవుతుందని చెప్పాను. రిలీజ్ రోజు అమలాపురంలో సినిమా చూడటానికి తయారవుతుంటే దిల్ రాజు స్వీట్ పట్టుకొచ్చి తినిపించారు. ఆ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని దిల్ రాజు పండుగ చేశారు. సమ్మోహనం చిత్రాన్ని ఆయన పంపిణి చేయడం.. తొలి రోజు నుంచి మంచి టాక్ రావడంతో సంతోషం కలిగింది. సినీ విమర్శకులు, ఇండస్ట్రీ నుంచి మంచి స్పందన వస్తున్నది.

    ఇంద్రగంటి నుంచి ఎపిక్ స్టోరి

    ఇంద్రగంటి నుంచి ఎపిక్ స్టోరి

    సమ్మోహనం ఓ ఎపిక్ స్టోరి. ఎన్నో విషయాలను అడ్రస్ చేసింది. ఇండస్ట్రీలోని సమస్యలను, కనుమరుగవుతున్న తెలుగు భాషను ఇలా ఎన్నో అంశాలను మేలవించడమే కాకుండా వినోదాన్ని జోడించి ఇంద్రగంటి మ్యాజిక్ చేశారు. మా జనరేషన్‌కు ఇది మరో చరిత్ర లాంటిది అని నాతో ప్రేక్షకులు థియేటర్లో చెప్పారు. సమ్మోహనం ఆడియో ఫంక్షన్‌లో సూపర్‌స్టార్ మహేష్ ముందే చెప్పాను. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధిస్తుంది. సుధీర్ బాబు కెరీర్‌లోనే అద్భుతమైన చిత్రంగా నిలుస్తుంది అని అన్నాను.

    ఇంద్రగంటి తెరపై ఇంద్రజాలం

    ఇంద్రగంటి తెరపై ఇంద్రజాలం

    సమ్మోహనం చిత్రం క్లీన్ ఫ్యామిలీ. తండ్రి, కొడుకుల రిలేషన్స్, భార్య, భర్తల మధ్య అన్యోన్యత, కూతురుతో అనుబంధం లాంటి అంశాలను కలిపి ఇంద్రగంటి తెర మీద ఇంద్రజాలం చేశారు. ప్రతీ పాత్రకు న్యాయం చేసిన తీరు అద్భుతం. అలాంటి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకొన్న తీరు అమోఘం. క్లైమాక్ష్ సీన్ కోసం రిహార్సల్, వర్క్ షాప్ చేశాం. చాలా కష్టపడ్డాం. అందుకే ప్రేక్షకుల ఆదరణ ఆ రేంజ్‌లో ఉంది.

    టాటూలతో దురద పుట్టింది

    టాటూలతో దురద పుట్టింది

    శరీరంపై ఉన్న అదితిరావు టాటూలతో దురద పుట్టింది. డాక్టర్ వద్దకు వెళ్లి షర్ట్ విప్పి చూపిస్తే ఆయన కూడా నవ్వుకున్నారు. ఐదు రోజులపాటు వాటిని తొలగించుకోవడానికి కష్టపడ్డాను. పడిన శ్రమకు పంట వస్తే ఎలా ఉంటుందో.. సినిమా హిట్ అయితే నిర్మాతగా అంత ఆనందం ఉంటుంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆదిత్య 369, జెంటిల్మన్ చిత్రాలతో రూపొందించిన ఆయన సమ్మోహనం చిత్రంలో నాకు అద్భుతమైన పాత్రను ఇచ్చారు.

    గడ్డు పరిస్థితి నుంచి మంచి పాత్రలు..

    గడ్డు పరిస్థితి నుంచి మంచి పాత్రలు..

    నాకు మహానటుడు ఎస్వీ రంగారావు అంటే చాలా ఇష్టం. ఆయన పాదాలు తాకితే చాలూ అనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. ఒక పాత్ర అంటూ మడికట్టుకోకుండా విభిన్నమైన పాత్రలు చేశాను. మధ్యలో గడ్డుపరిస్థితి ఎదురైంది. అలాంటి సమయంలో మంచి సమయంలో మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించింది.

     విజయాలతో బాధ్యత రెట్టింపు

    విజయాలతో బాధ్యత రెట్టింపు

    దృశ్యం సినిమా నుంచి మంచి పాత్రలు పడ్డాయి. రంగస్థలం, మహానటి చిత్రాల్లో మంచి పాత్రలు రావడం గొప్ప అదృష్టం. ఎలాంటి పాత్రలైనా నరేష్ చేస్తాడు అని దర్శకులు నమ్మడం ఆనందంగా ఉంది. సమ్మోహనం చిత్రంతో నా కెరీర్‌ను పది మెట్లు ఎక్కించింది. నా బాధ్యత మరింత రెట్టింపు అయింది. పారితోషికాన్ని పట్టించుకోను. చిన్న సినిమాలకు కూడా అందుబాటులో ఉంటాను. వెరైటీ పాత్రలకు సిద్దంగా ఉన్నాను.

    అద్భుతంమైన పాత్రలతో

    అద్భుతంమైన పాత్రలతో

    సమ్మోహనం చిత్రంలోని అన్ని పాత్రలు అద్బుతంగా కుదిరాయి. సుధీర్‌బాబు చేసిన పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయాను. అతను చేసిన ఇంటర్వెల్ ముందు చేసిన సీన్, క్లైమాక్స్ సీన్లలో బాగా చేశాడు. నీవు గొప్పగా నటించినందుకు మీ అమ్మ సంతోషపడుతుంది. సూపర్‌స్టార్ మహేష్ మాదిరిగా నటించావు అని ఫోన్ చేసి చెప్పాను. అదితిరావు పెర్ఫార్మెన్స్ బాగుంది. నటిగా పవిత్ర లోకేష్‌లో మరో కోణం కనిపించింది. నా కూతురిగా నటించిన హర్షిణి బాగా చేసింది.

    English summary
    Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. This movie getting good reports from all over the world. In this occassion, Actor Naresh speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X