శీలం అనేది ఆడవారికే ముఖ్యం కాదు.. కాలీఫ్లవర్ గురించి సంపూర్ణేష్ బాబు (ఇంటర్వ్యూ)

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో తనకంటూ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్న నటుడు సంపూర్ణేష్ బాబు తాజాగా కాలి ఫ్లవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీకే సినిమాలో అమీర్ ఖాన్ మాదిరిగా నగ్నంగా నటించిన స్టిల్ మంచి క్రేజ్‌ను రాబట్టింది. ఈ సినిమా నవంబర్ 26వ తేదిన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ..

 పెద్దరాయుడులో పాపారాయుడిలా అండీ ఫ్లవర్

పెద్దరాయుడులో పాపారాయుడిలా అండీ ఫ్లవర్

పెద్ద రాయుడు చిత్రంలో పాపారాయుడు లాంటి అండీ ఫ్లవర్‌కు కాలి ఫ్లవర్ కొడుకు పాత్ర. అతిథి పాత్రగా కనిపించే అండీ ఫ్లవర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అండీ ఫ్లవర్, కాలిఫ్లవర్ పాత్రలను దర్శకుడు ఆర్కే బ్రహ్మండంగా డిజైన్ చేశారు. దర్శకుడు ఆర్కే గతంలో టెలివిజన్ ఇండస్ట్రీలో సీరియల్స్ చేశారు అని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

 హీరోకు శీలం పోయడంతో

హీరోకు శీలం పోయడంతో

శీలం అనేది ఆడవారికే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యమే. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవనే పాయింట్ చెప్పినప్పుడు కథ కొత్తగా అనిపించింది. సినిమా చేస్తుంటే విభిన్నమైన కథతో డైరెక్టర్ వస్తున్నట్టు అనిపించింది. హీరోకు శీలం పోయిన తర్వాత కోర్టు సీన్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముగ్గురు మహిళలు ఇందులో విలన్‌లు ఉంటారు. ఈ చిత్రంలో మహిళలకు దూరంగా ఉండే క్యారెక్టర్. 30 ఏళ్ల వరకు శీలం పోకుండా పవిత్రంగా ఉండాలనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను అని సంపూ చెప్పారు.

 కాలీఫ్లవర్ అడ్డం పెట్టుకొని ఫస్ట్ లుక్

కాలీఫ్లవర్ అడ్డం పెట్టుకొని ఫస్ట్ లుక్

కాలీ ఫ్లవర్ చిత్రంలో నగ్నంగా కాలీఫ్లవర్ అడ్డం పెట్టుకొని ఉన్న ఫస్ట్ లుక్‌ రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నేను ఇంత పెద్ద సాహసం చేశానా అనే అనుమానం కలిగింది. ఈ కథను నేను చేస్తేనే సినిమా చేస్తానని దర్శకుడు చెప్పారు. నీవు చేయకపోతే కాలిఫ్లవర్ సినిమాను తీయను అని చెప్పారు. ఒకసారి ఒప్పుకొన్న తర్వాత ఎలాంటి సీన్లకైనా సిద్ధం. నటుడిగా ఏది చేయడానికైనా సిద్దం అని సంపూర్ణేష్ బాబు అన్నారు.

 అతిగా నటిస్తేనే ప్రేక్షకులకు ఇష్టం

అతిగా నటిస్తేనే ప్రేక్షకులకు ఇష్టం

నటుడిగా నాకు పరిమితులు, హద్దులు లేవు. సంపూర్ణేష్ బాబు అతిగా నటిస్తేనే సినిమాకు ప్లస్ పాయింట్. హృదయకాలేయం క్లైమాక్స్‌లో చితిని నుంచి లేచి రావడం, కొబ్బరిమట్ట చిత్రంలో కొడితే సుమో చేతిలోకి రావడం, సింగం 123లో స్విమ్మింగ్ పూల్ దూకడం లాంటి సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అతిని భరించే వరకు నేను అలాంటి పాత్రల్లో నటిస్తూనే ఉంటాను అని సంపూర్ణేష్ బాబు చెప్పారు.

కెరీర్ పట్ల హ్యాపీగా ఉన్నా

కెరీర్ పట్ల హ్యాపీగా ఉన్నా

నా కెరీర్ పట్ల నాకు సంతృప్తికరంగా ఉంది. నరసింహాచారి సంపూగా మారిన తీరు హ్యాపీగా ఉంది. గతంలో విమానం ఎక్కాలనే కోరిక ఉన్న లక్షల సంఖ్య నేను ఒకరిని. ఇప్పుడు నేను సంవత్సరంలో పదిసార్లు విమానాల్లో తిరుగుతున్నాను. ఇంతకంటే నాకు జీవితంలో ఏం కావాలి అని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

తమిళంలో ఓ సినిమా చేస్తున్నా

తమిళంలో ఓ సినిమా చేస్తున్నా

ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేస్తున్నాను. డిఫరెంట్ పాత్రల్లో నటించాలని చూస్తున్నాను. ఐదు పాత్రలతో ఒక సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాం. తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. దాదాపు 70 శాతం పూర్తయింది. బాలీవుడ్‌లో అవకాశం వచ్చిన నటించడానికి సిద్దం అని సంపూ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X