What is Digital Fasting? డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? సముద్రఖని ఏం చేస్తాడో తెలుసా?

దక్షిణాదిలో ప్రముఖ దర్శకులు, నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించిన కార్మేని సెల్వం చిత్రానికి నూతన దర్శకుడు రామ్ చక్రి దర్శకత్వం వహించారు. తమిళ నిర్మాత అరుణ్ రంగరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ నటించారు.

ఈ మూవీకి మ్యూజిక్: MAAS, సినిమాటోగ్రఫి: యువరాజ్ దక్షన్, ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: శంకర్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిల్మీబీట్‌ ఛానెల్‌తో నటుడు, దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ..

Samuthirakani Digital Fasting

అమెరికా, ఇరాన్ యుద్దం నేపథ్యంలో చమురు నౌక రాకపోవడంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని కొందరు క్యాన్స్‌లో పెట్రోల్ నింపుకొన్నారు. కొందరు బాటిల్స్‌లో పట్టుకెళ్లారు. వాళ్ల వాళ్ల రిక్వెర్‌మెంట్‌కు తగినట్టు వాళ్ల సెఫ్టీకి తగ్గినట్టు సేఫ్‌గా వ్యవహరించారు. ఈ సెఫ్టీ ఎంత సేపు ఉంటుంది. డబ్బును బట్టి వారు తమ సెఫ్టీని చూసుకొన్నారు. లైఫ్ అనేది దేవుడి చేతిలో గేమ్. ఆ గేమ్‌లో చిక్కుకోకుండా జీవితాన్ని గడపాలి అని సముద్రఖని అన్నారు.

జీవితంలో హ్యాపీగా ఉండాలంటే.. కమిట్‌మెంట్స్ తక్కువగా ఉండాలి. EMI లు లేకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. ఈఎంఐలు ఉంటే 25వ తేదీ వచ్చిందంటే.. మనసులో గుబులుగా ఉంటుంది. లైఫ్ అంటే అలారం పెట్టుకొకుండా లేవగలిగితే అది చాలూ. ఫోన్ లేకుండా, దాని సహాయం లేకుండా ఎంత మంది ఉంటారు? అని ప్రశ్నించారు. ఫోన్ లేకుండా ఉంటే 100 శాతం సెఫ్టీ అని అభిప్రాయపడ్డారు.

నా లైఫ్‌లో చాలాసార్లు ఫోన్ వాడకుండా ఫాస్టింగ్ అంటే డిజిటల్ ఫాస్టింగ్ (Digital Fasting) చేస్తుంటాను. ఓ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ ముట్టుకొను. అలా ఉంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొబైల్ లేకుండా జీవించడాన్ని మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఫ్యామిలీలో ఎవరూ కూడా ఫోన్ వాడకుండా ఒక రోజు ఉండాలి. అలా ఉంటే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? చాలా మందికి మొబైల్ శత్రువుగా మారుతుంది అని సముద్రఖని అన్నారు.

జీవితంలో పరుగెత్తడం అలవాటుగా మారింది. పిల్లలు హ్యాపీగా ఉండాలని పరుగులు పెడుతుంటాం. ఓ వ్యక్తి హ్యాపీగా ఉంటేనే వారి పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. బ్రో సినిమా టైమ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ఆ ఫిలాసఫీ నుంచి పుట్టినదే కార్మేనీ సెల్వం సినిమా కథ అని సముద్రఖని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X