SS Rajamouli నా జీవితాన్ని మలుపు తిప్పారు.. శివన్నా అంటూ అప్యాయంగా.. బ్లాక్ స్టార్ షానీ మనోగతం

నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న షానీ సాల్‌మాన్ అలియాస షానీ మరోసారి మంచి రోల్‌లో మెరిసారు. ఇటీవల విడుదలైన రామ్ అసుర్ చిత్రంలో సినిమాను మలుపుతిప్పే పాత్రలో నటించి మెప్పించాడు. రామ్ అసుర్ చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు రావడంపై తెలుగు ఫిల్మీబీట్‌తో తన ఆనందాన్ని పంచుకొన్నారు. తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. .

ఎస్ ఎస్ రాజమౌళి భుజం తట్టి ప్రోత్సహించారంటూ

ఎస్ ఎస్ రాజమౌళి భుజం తట్టి ప్రోత్సహించారంటూ

హైదరాబాద్‌కు సమీపంలోని జడ్చర్ల నా స్వస్థలం. నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. బేసికల్‌గా నేను స్పోర్ట్స్ మెన్. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 2003లో ఓ హోర్డింగ్ చూశాను. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలి. అర్హులైన వారు సంప్రదించమనే ప్రకటన నన్ను ఆకర్షించింది.

అప్పటికే నేను జాతీయ స్థాయిలో రాణిస్తున్నాను. దాంతో నేను ఆ ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకొన్నాను. ఆ ఇంటర్వ్యూకు వెళితే తన సినిమా కోసం రాజమౌళి ప్రకటన ఇచ్చారని తెలుసుకొన్నాను. అప్పుడు రాజమౌళి నాతో అప్యాయంగా మాట్లాడుతూ భుజం తట్టి నటుడిగా నన్ను ప్రోత్సహించారు. నా లుక్ వెరైటీగా ఉండటంతో సై సినిమాలో అవకాశం కల్పించారు. ఆ చిత్రమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి షానీగా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాను అని షానీ తెలిపారు.

సై మూవీ తర్వాత వరుసగా ఆఫర్లు

సై మూవీ తర్వాత వరుసగా ఆఫర్లు

రాజమౌళి రూపొందించిన సై సినిమా తర్వాత ఘ‌ర్ష‌ణ‌, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్క మ‌గాడు, శ‌శిరేఖా ప‌రిణ‌యం తదితర చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషించాను. నాకు బాగా సంతృప్తిని కలిగించిన చిత్రం అలా.. ఎలా.. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో కలిసి హీరోకు సమానమైన పాత్ర పోషించాను. ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో30 సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయ‌న్నారు. దేశంలో దొంగ‌లు ప‌డ్డారు సినిమాలో హీరో పాత్ర పోషించాను. అలా.. ఎలా.., దేశంలో దొంగ‌లు ప‌డ్డారు, రాక్ష‌సి చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాను అని షానీ చెప్పారు.

బ్లాక్ స్టార్ అంటూ ముద్దుగా పిలచుకొంటూ..

బ్లాక్ స్టార్ అంటూ ముద్దుగా పిలచుకొంటూ..

నేను నల్లగా ఉండటం నా కెరీర్‌కు ఎసెట్‌గా మారింది. నన్ను నా స్నేహితులు ముద్దుగా బ్లాక్ స్టార్ పిలుచుకొంటారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక. నటుడిగా రాణిస్తూ.. పేద, వృద్ధ కళాకారులను ఆదుకోవాలన్నది నా లక్ష్యం. సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త‌గా వ‌చ్చే న‌టీన‌టుల‌ను ప్ర‌తిఒక్క‌రూ ప్రోత్స‌హించాలి.

నా కాలేజ్ మిత్రుడు విజ‌యానంద్‌తో క‌లిసి గ‌డ‌చిన ఐదేళ్లుగా ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా నూత‌న క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంతోపాటు యాడ్ ఫిలిమ్స్ అండ్ క్యాస్టింగ్‌, ఫిలిం ప్రొడ‌క్ష‌న్‌, సెల‌బ్రిటీ మేనేజ్‌మెంట్‌, ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న‌ాను. రీసెర్చ్ మీడియా గ్రూపులో క్రియేటీవ్ హెడ్‌గా అనేక కార్పొరేట్ ఈవెంట్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు అని పేర్కొన్నారు.

రామ్ అసుర్ సినిమాతో మంచి గుర్తింపు

రామ్ అసుర్ సినిమాతో మంచి గుర్తింపు

బ్లాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన తాను తెలుగు ప్రేక్ష‌కుల అభిమానానికి శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా. రామ్ అసుర్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డం త‌న జీవితంలో కీల‌క మ‌లుపుగా భావిస్తున్నాను. సక్సెస్ మీట్, టూర్‌ కోసం ఎక్క‌డికెళ్లినా శివ‌న్నా అంటూ ప్రేక్ష‌కులు ఆప్యాయంగా పిల‌వ‌డం ఎంతో సంతోషాన్ని క‌ల్గిస్తున్నది. రామ్ అసుర్ చిత్రంలో శివ‌న్న పాత్ర‌తో త‌న గుర్తింపు మ‌రింత పెరిగింది అని షానీ తెలిపారు.

Recommended Video

Actor Shaani Solomon About Megastar Chiranjeevi
షానీ సాల్‌మాన్ సినిమా కెరీర్ ఇలా..

షానీ సాల్‌మాన్ సినిమా కెరీర్ ఇలా..

డిసెంబ‌రులో తాను నటించిన కిన్నెర‌సాని, అమ‌ర‌న్, గ్రే, పంచతంత్ర క‌థ‌లు... చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్‌లో వెల్‌కం టూ స‌జ్జ‌న్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మధ్యే కొన్ని కథలు విన్నానని... ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతానని... నాకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులకు, నిర్మాతలకు, నా తోటి నటీనటులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని శాన్వి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X