ఎన్టీఆర్‌తో విభేదాలపై శ్రీనివాస్‌రెడ్డి క్లారిటీ.. చాలా బాధేసింది!

By Rajababu

Recommended Video

Jamba Lakidi Pamba Hero Srinivas Reddy Press Meet

జయమ్ము నిశ్చయంబు రా, ఆనందో బ్రహ్మ చిత్రాలు సాధించిన విజయాల తర్వాత హీరోగా ప్రస్తుతం జంబలకిడి పంబలో నటిస్తున్నాను. గత చిత్రాల్లో కథ నచ్చడంతోనే హీరోగా చేశాను. ఈ సినిమాలో కూడా దర్శకుడు చెప్పిన స్టోరి కారణంగానే ఈ చిత్రంలో నటించాను. ఇంట్లో నైటీలు వేసుకొని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ నా కూతురు కూడా చాలా గమ్మత్తుగా కామెంట్ చేసింది.

ఆడవేషంలో నటించడం

ఆడవేషంలో నటించడం

ఆడ వేషంలో నటించడం కొత్త అనుభూతి. ఈ చిత్రానికి ముందు నరేష్ నటించిన జంబలకిడి పంబ, చిరంజీవి నటించిన చంటబ్బాయ్ చిత్రాలను చూశాను. . తొలిరోజు నేను ఓ సీన్ చేసినప్పుడు ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. దాంతో వారికి నచ్చలేదని మరో షాట్ ట్రై చేద్దామని అనగానే సూపర్ అంటూ చిత్ర యూనిట్ ప్రశంసించింది.

జంబలకిడి పంబలో అదే తేడా

జంబలకిడి పంబలో అదే తేడా

పాత జంబలకిడి పంబ చిత్రంలో ఓ ఊరులోని ప్రజలంతా అంటే ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు.. ఆడవాళ్లుగా మారిపోతారు. కానీ ఈ చిత్రంలో జంబలకిడి పంబ అనే మంత్రం ద్వారా నేను, హీరోయిన్ మాత్రమే మారిపోతాం. హీరోయిన్ సిద్ది ఇద్నానీ కూడా బాగా నటించింది. ఈ సినిమాకు ఆమె నటన హైలెట్ అని చెప్పవచ్చు.

మరింత గౌరవం పెరిగింది

మరింత గౌరవం పెరిగింది

మహిళల జీవితం అంటే చాలా కష్టమైనవి. వారు అనుభవించే కష్టాలు ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాం. ఆ క్రమంలోనే మహిళలు రుతుస్రావం సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించాం. ఈ చిత్రంలో మహిళ పాత్రలో నటించడం ద్వారా వారిపై మరింత గౌరవం పెరిగింది.

మల్టీస్టారర్ సినిమా అని ఆట పట్టిస్తుంటారు

మల్టీస్టారర్ సినిమా అని ఆట పట్టిస్తుంటారు

మధ్య మధ్యలో హీరోగా నటిస్తూ కమెడియన్‌గా చేస్తున్నప్పుడు మాది మల్టీస్టారర్ అని కొందరు హీరోలు ఆటపట్టిస్తుంటారు. హీరోగా నటించినా.. కమెడియన్ పాత్రలు వేసినా దర్శకులు, నటీనటులు సహకారం బాగా ఉంటుంది. ఓ సక్సెస్‌ఫుల్ సినిమా తర్వాత మరో సినిమా చేసేటప్పుడు ఒత్తిడికి గురికాకూడదని త్రివిక్రమ్ సలహా ఇస్తుంటారు.

ఎన్టీఆర్‌తో విభేదాలపై

ఎన్టీఆర్‌తో విభేదాలపై

ఎన్టీఆర్‌తో విభేదాలు అంటూ తరుచూ మీడియాలో వార్తలు వస్తుంటాయి. అలాంటి వార్తలు చూసినప్పుడు బాధ కలుగుతుంది. అందుకే మా మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి షూటింగ్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాను. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.

 ఎన్టీఆర్ పరిణతి ఉన్న వ్యక్తి

ఎన్టీఆర్ పరిణతి ఉన్న వ్యక్తి

ఎన్టీఆర్‌‌కు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఏదో అన్నారనే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను వెల్లడించాను. కానీ ఎన్టీఆర్ చాలా పరిణతి ఉన్న వ్యక్తి. అలాంటి విషయాలు పట్టించుకోరు. ముఖ్యంగా మనలాంటి వాళ్ల గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను పట్టించుకోవడం లేదని వచ్చిన వార్తలు చూసినప్పుడు బాధ కలిగింది.

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు ఇవే

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు ఇవే

కమెడియన్ పాత్రలు చేస్తూనే మంచి కథలు వస్తే హీరోగా నటిస్తున్నాను. హీరోగప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత, శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంథోని, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2, నారా రోహిత్ రూపొందించే వీరభోగ వసంత రాయలు, పంతం చిత్రాల్లో నటిస్తున్నాను. కోన వెంకట్ ఓ సినిమా చేద్దామని అన్నారు. గీతాంజలి2 సినిమా గురించి క్లారిటీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X