twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత రియల్ లైఫ్ సంఘటనలే 10th క్లాస్ డైరీస్. అవికా గోర్‌తో నా కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే.. శ్రీరామ్ ఇంటర్వ్యూ

    |

    అందాల తార చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, లవర్ బాయ్ శ్రీరామ్ హీరో, హీరోయిన్లుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పించారు. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ ఫేమ్ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...

    రియల్ లైఫ్ సంఘటనలతో

    రియల్ లైఫ్ సంఘటనలతో

    10th క్లాస్ డైరీస్'తోదర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాటోగ్రాఫర్ అంజితో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. ఆ సమయంలో డేట్స్ కుదరకపోవడం వల్ల సినిమా చేయలేదు. అప్పుడు అంజి గారితో మీరు దర్శకుడిగా చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకు రావాలి అని చెప్పాను.

    ఒక కథ ఉందనిచెబితే... హైదరాబాద్ వచ్చి కలిశా. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు గారు కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగితే అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్‌ రీ యూనియన్‌లో జరిగిందని, ఆ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 10th క్లాస్ డైరీస్'. అయితే, కొంత ఫిక్షన్ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలాఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటిమూమెంట్స్‌ను పిక్చరైజ్ చేశాం అని శ్రీరామ్ తెలిపారు.

    రీ యూనియన్ జరిగితే..

    రీ యూనియన్ జరిగితే..

    స్కూల్ లైఫ్ తర్వాత ఎప్పుడో క్లాస్‌మేట్స్ మళ్లీ కలుసుకొనే (రీ యూనియన్) అంశం బేసిక్ కంటెంట్.. హరిశ్చంద్రుడు అయినా, రాముడు అయినా ఇంకొకరి జీవితంలో విలన్ అనుకోవచ్చు. ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. మన జీవితంలో కరెక్టుగా ఉన్నా ఇంకొకరి జీవితంలో చెడ్డవాళ్లం అవుతాం. తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక తప్పు వల్ల ఎంత మంది జీవితం ఎలా మారుతుందనేది కాన్సెప్ట్. రియాలిటీగా తీశాం. ఎమోషనల్ అంశాల మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండేలా చూసుకున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న రోల్స్ కావడంతో ఈజీ అయ్యింది. ఒక మనిషి అఘోర అయ్యారు. ఆయన రీ యూనియన్ కి అలాగే వచ్చారు అని శ్రీరామ్ తెలిపారు.

    నా స్కూల్ రీ యూనియన్ ఎలా జరిగిందంటే?

    నా స్కూల్ రీ యూనియన్ ఎలా జరిగిందంటే?

    నేను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ భవాన్స్ స్కూల్‌లో చదువుకొన్నాను. అయితే మేమంతా కలుసుకోవాలని రీ యూనియన్ ప్లాన్ చేశాం. వంద మంది బ్యాచ్ ఉంటే ఎనిమిది మంది వచ్చారు. నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మరోసారి మా వాళ్ళు ప్లాన్ చేశారు. నాకు రీయూనియన్‌కు వెళ్లాలని రెడీ అయ్యా. చివరి క్షణంలో షూటింగ్ పెట్టారు. 'డబ్బులు కట్టేశాం. మళ్ళీ ఆ లొకేషన్ దొరకదు. ఆర్టిస్టుల డేట్స్ లేవు' అని అనడంతో మిస్ అయ్యా. ప్రతిసారీ, ప్రతి చోట రీయూనియన్ సక్సెస్ అని చెప్పలేం. మేం ట్రై చేశాం అని శ్రీరాం తెలిపారు.

    చాందిని పాత్రలో అవికా గోర్

    చాందిని పాత్రలో అవికా గోర్

    10th క్లాస్ డైరీస్‌లో చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం నేను అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చు.అలాంటి సంఘటనల బట్టి మా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను. 96 మూవీ, 10th క్లాస్ డైరీస్ రెండూ వేర్వేరు సినిమాలు. అయితే, ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో కొన్ని పోలీకలు ఉంటాయి. ఏమైనా ఉంటాయేమో? అలా అంటే... 96కి ముందు 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' వచ్చింది. అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి కాదు! అలాగే, 'ప్రేమమ్' సినిమా. స్కూల్, కాలేజీలో ఏం జరిగిందనేది చూపించినప్పుడు కొన్ని పోలీకలు ఉండటం సహజం.

    సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారితే?

    సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారితే?

    సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారితే.. ఎక్కువగా విజువల్స్, పాటలపై బాగా దృష్టిపెడుతారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. దర్శకుడిగా ఆయన మొదటి సినిమాలో నేనే హీరో. కేవీ ఆనంద్ కోసం దర్శకుడు శంకర్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ సినిమా వదులుకుని కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు. మరీ ఆ సినిమాలో కూడా నేనే హీరో. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అంజి నాతో సినిమా చేయాలనుకున్నారు. కొంత మంది పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ కథలు నాకు నచ్చలేదు. నేను చేయలేదు. సినిమాటోగ్రాఫర్స్ కొన్నిసార్లు విజువల్ బ్యూటీ చూస్తారు. అది పాటల్లో చూడొచ్చు. కథ ఎక్కడ? కొన్నిసార్లు అది మిస్ అవుతుంది అని శ్రీరామ్ చెప్పారు.

    శివ బాలాజీ, మధుమిత భార్యభర్తలుగా

    శివ బాలాజీ, మధుమిత భార్యభర్తలుగా

    సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమా తీయాలి. ఆరు నుంచి అరవై దాకా అందరూ చూసే సినిమా చేయమని వాళ్ళను కోరుతున్నా. కామెడీ, ఎమోషన్, ఫీలింగ్స్... అన్నీ ఉండాలి. అంజి నైస్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఇదొక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇందులో లవ్, ఫ్రెండ్షిప్, హ్యూమర్... అన్నీ ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కూడా! 10th క్లాస్ డైరీస్ అనేది పర్‌ఫెక్ట్ ప్యాకేజీ ఉన్న కమర్షియల్ సినిమా. 'ఒకరికి ఒకరు' తర్వాత నాకు సంతృప్తి ఇచ్చిన చిత్రమిది. కొన్ని సినిమాల్లో హీరో సపోర్టింగ్ రోల్స్ చేశా. అవి పక్కన పెడితే... ఇది సంతృప్తి ఇచ్చింది. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. షూటింగ్ చేసేటప్పుడు ట్రిప్ కి వెళ్లినట్టు ఉంది. మా నిర్మాత, కథ రచయిత రామారావు గారు ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశారు. ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. కొలంబో, మియామిలో కూడా కొన్ని సీన్స్ షూట్ చేశాం. అలాగే, సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. శివ బాలాజీ, మధుమిత భార్యాభర్తలుగా నటించారు.

    రవితేజతో రావణాసుర చిత్రంలో

    రవితేజతో రావణాసుర చిత్రంలో

    ప్రస్తుతం రవితేజతో ఇంతకు ముందు నటించా. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న రావణాసురలోఒక పాత్ర చేయమని అడిగారు. మంచి స్పెషల్ అప్పీరియన్స్ రోల్. ప్రతీ సినిమాలో అలాంటి రోల్స్ చేయను. నాకు తెలుగు సినిమాలు చేయాలని ఉంది. మంచివి వస్తే చేస్తా. లేదంటే తమిళంలో నాకు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరు తమిళ సినిమాలు పూర్తి చేశా. 'రెక్కీ' అని వెబ్ సిరీస్ చేశా. జీ 5లో ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.అంజితో ఒక సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. నా కోసం రసూల్ కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

    English summary
    Actor Sriram and Avika Gor's 10th Class Diaries is releasing on the June 24th. Here is the Sriram's exclusive interview for the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X