Family Drama: సైకో పాత్రలో నటించేటప్పుడు అలాంటి టెన్షన్‌ అనుభవించా.. సక్సెస్ జోష్‌లో హీరో సుహాస్

నటుడు సుహాస్ జీవితం చాలా సాధారణంగా ప్రారంభమైంది. తొలుత ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు షార్ట్ ఫిలింలో నటించి మెప్పించారు. ది అతిథి, కళాకారుడు లాంటి షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. దోచేయ్ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, తదితర చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు.

ఇక కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారి భారీ సక్సెస్ అందుకొన్నారు. ఆ తర్వాత అర్ధశతాబ్దం, గమనం, అంటే సుందరాంగికి చిత్రాలతో ఆలరించారు. తాజాగా సోని లివ్‌ యాప్‌లో రిలీజైన ఫ్యామిలీ డ్రామా మరింత సక్సెస్ అందుకొన్నారు. అయితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌ను అందుకొన్నారు.

Actor Suhas flying high after Family Drama success

సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా "ఫ్యామిలీ డ్రామా". మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోని లివ్ ఓటీటీలో గత నెల 29 తేది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందంటున్నారు హీరో సుహాస్, దర్శకుడు మెహెర్ తేజ్. "ఫ్యామిలీ డ్రామా"కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో పాత్రికేయులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

సుహాస్ మాట్లాడుతూ...ఫ్యామిలీ డ్రామా సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ సినిమాకు, నా క్యారెక్టరైజేషన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడ్డా. కామెంట్స్ చదవడానికి కూడా భయమేసింది. కానీ మొత్తంగా మా చిత్రాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. నేను బాగా నటించాను అని చెప్పడం ఆనందంగా ఉంది. కలర్ ఫొటో లాంటి హిట్ సినిమా తర్వాత ఇంకో కొత్త టైప్ ఆఫ్ సినిమా చేద్దామని ఫ్యామిలీ డ్రామాలో నటించాను. నటుడిగా నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. గట్టిగా నవ్వడం, ఎమోషన్స్ పలికించే సందర్భాల్లో కష్టపడి నటించాను అని అన్నారు.

ఫ్యామిలీ డ్రామా చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక్కోసారి తలనొప్పి వచ్చేది. ఫ్యామిలీ డ్రామా కుటుంబ ప్రేక్షకులు కూడా చూస్తున్నారంటే సర్ ప్రైజింగ్ గా, సంతోషంగా ఉంది. కొన్ని సీన్స్ చేసేప్పుడు ఉద్వేగానికి గురయ్యాను. నటుడిగా అన్ని రకాల కథల్లో, క్యారెక్టర్లలో నటించాలి అనేదే నా కోరిక అని తెలిపారు.

ప్యామిలీ డ్రామా తర్వాత రైటర్ పద్మ భూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నాలుగు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా చిత్రంతో నా ఇమేజ్ మారుతుందని అనుకోవడం లేదు. నా జర్నీలో ఇదో తరహా సినిమా అంతే. త్వరలో రాబోతున్న చిత్రాలతో నేను అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తానని తెలుస్తుంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X