twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎందుకు ఈ కులాల గొడవ? నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    By Bojja Kumar
    |

    సాత్విక్‌ ఈశ్వర్‌-అక్షిత ఒక జంటగా, ప్రత్యూష్‌-హర్షిత మరొక జంటగా, సుమన్‌, సుహాసిని, జీవా, ఖడ్గం ఖుద్దూస్‌, బాహుబలి కాలకేయ ప్రభాకర్‌, వినోద్‌, రాజేందర్‌, దిల్‌ రమేశ్‌, మేడ్చల్‌ ప్రసాద్‌ వంటి తారాగణంతో రూపొందిన సత్యగ్యాంగ్‌. ఈ చిత్రానికి ప్రభాస్ దర్శకుడు. మహేష్ ఖన్నా నిర్మాత. ఏప్రిల్ 5న విడుదలవుతున్న నేపషథ్యంలో ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించిన సుమన్ మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపై కూడా మాట్లాడారు.

    సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

    సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

    సత్య గ్యాంగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో నేను ఏసీపీ క్యారెక్టర్ చేశాను. అవయవాల స్మగ్లింగ్ అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు ప్రభాస్ ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు అని వెల్లడించారు.. అని సుమన్ తెలిపారు.

    అనాధల గురించి కథ

    అనాధల గురించి కథ

    ఈ సినిమా కథలో నలుగురు అనాధలు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అనాధలను అడిగే వారు ఉండరు, తిండి కోసం, డబ్బు కోసం ఇవన్నీ చేస్తుంటారు. చివరకు వారి గురించి ఓ మంచి సందేశం కూడా సినిమాలో ఉంటుంది అని సుమన్ తెలిపారు.

    అభిరుచి ఉన్న నిర్మాత

    అభిరుచి ఉన్న నిర్మాత

    ఈ చిత్రంలో సీఎం క్యారెక్టర్ గా సుహాసిని చేశారు. ఫైట్లు, కామెడీ, పాటలు అన్నీ బావున్నాయి. నీట్ ఫిల్మ్, వల్గారిటీ ఉండదు. షూటింగ్ కర్నూలులోని డోన్‌లో జరిగింది. కొన్ని సీన్లు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. మహేష్ ఖన్నా రూపంలో టేస్ట్ ఉన్న నిర్మాత మన ఇండస్ట్రీకి వచ్చారు... అని సుమన్ తెలిపారు.

     యూత్ చూడాల్సిన మూవీ

    యూత్ చూడాల్సిన మూవీ

    ‘సత్యగ్యాంగ్' ముఖ్యంగా యూత్ చూడాల్సిన సినిమా. తల్లి దండ్రులు ఉంటే ఎలా ఉంటుంది, లేక పోతే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఈ సినిమా చూస్తే తల్లిదండ్రుల మీద గౌరవం తప్పకుండా పెరుగుతుంది.... అని సుమన్ తెలిపారు.

     పొలిటికల్ మెసేజ్

    పొలిటికల్ మెసేజ్

    ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్‌లో నెగెటివిటీ ఉంది. రాజకీయాల్లోకి మంచి వాళ్లు వస్తే ఈ దేశం బావుంటుంది అనేది ఫైనల్ మెసేజ్. ఈ సినిమాకు పెద్ద పిల్లర్ అసుమిల్లి విజయ్ కుమార్. సీన్స్ విషయంలో డైరెక్టర్‌కు సహకరించి త్వరగా సినిమా పూర్తయ్యేలా చేశాడు. ఏ క్యారెక్టర్ కు ఎవరు సరిపోతారో వారిని ఎంపిక చేశారు. మంచి సినిమా అంటే కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. లక్షలు పెట్టినా తీయవచ్చు. చేసేది కరెక్టుగా చేసి సమయానికి రిలీజ్ చేయడం, ముఖ్యమైన పాత్రలకు ముఖ్యమైన నటులను పెట్టడం ఎంతో ముఖ్యం.... అని సుమన్ తెలిపారు.

     అభిమానులు ఏ కులమైనా....

    అభిమానులు ఏ కులమైనా....

    నేను ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. అభిమానుల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరాను. నేను బీసీ.. అభిమానులు ఎవరైనా సరే వారు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా నా సపోర్టు ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై ఆందోళన జరుగుతోంది. ఆ చట్టం ఎలా ఉందో అలాగే కంటిన్యూ కావాలి. ముందు ఒక చట్టం చేసి దాన్ని రిపేరు చేయడం, మార్పులు చేయడం వల్ల చాలా కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. నా అభిమానులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైనా అందరికీ నా సపోర్టు ఉంటుంది. సుప్రీం కోర్టును ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాను అని సుమన్ తెలిపారు.

     బార్డర్లో సైనికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏమీ చూడటం లేదు

    బార్డర్లో సైనికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏమీ చూడటం లేదు

    మొన్న కరాటే ఫంక్షన్ కోసం దేశ సరిహద్దకు వెళ్లాను. బార్డర్లో సైనికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏమీ చూడటం లేదు. ఒక తుపాకి, ఒక బ్యాగ్ పట్టుకుని మనల్ని కాపాడటానికి వారు అక్కడ చస్తున్నారు. వాళ్ల కుటుంబాన్ని త్యాగం చేసి కాపలా కాస్తున్నారు. ఎందుకు వారు అలా చేయాలి? మన దేశం కోసం చేస్తున్నారు. అందరం దేశాన్ని ప్రేమించాలి. విదేశాల్లో ఉన్నట్లు మన దేశంలో దేశ భక్తి లేదు. అందుకే వారు మనకంటే అన్ని విషయాల్లో ముందున్నారు. అక్కడిలాగే మనదేశంలో కూడా దేశ భక్తి పెరగాలి. ఇండియన్స్ అందరూ ఏకం అనే భావనలో ఉండాలి.... అని సుమన్ అన్నారు.

     ఎందుకు ఈ కులాల గోల...

    ఎందుకు ఈ కులాల గోల...

    మనం ఏదైనా ఆట చూసేందుకు స్టేడియంకు వెళ్లినపుడు మన దేశం వాళ్లు బాగా ఆడితే క్లాప్స్ కొడుతున్నారు. అక్కడ మన కులం వాడా అని చూడటం లేదు. బయటకు వస్తే ఆ కులం, ఈ కులం అని మాట్లాడుకుంటారు. ఈ కులాల గోల ఎందుకో అర్థం కాదు. క్యమ్యూనిటీ ఫీలింగ్ అనేది రాజకీయాల వల్ల ఎక్కువ అవతుంది. ఇది మంచిది కాదు అని సుమన్ అన్నారు.

    English summary
    Actor Suman said that Satya Gang movie is a good movie, which is run with a organs smuggling subject, directed by Prabhas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X