నేను చనిపోయానని రాస్తారా? వారి ఇంట్లో వాళ్లను చంపేస్తే... సునీల్

Recommended Video

Comedian Sunil About His Role In Chitralahari Movie || Filmibeat Telugu

అరవింద సమేత చిత్రంతో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్.. మళ్లీ కమెడియన్‌గా బిజీ అవుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రలహరి సినిమా సక్సెస్ బాటలో దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా సునీల్ మీడియాతో ముచ్చటించారు. తన జీవితంలో ఒడిదుడుకులు, విజయాలు, పరాజయాలపై స్పందించారు. చిత్రలహరి గురించి, తన వ్యక్తిగత అనుభవాలను వివరించారు. సునీల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే

 నాకు గ్లాస్‌మెట్ ఎవరంటే

నాకు గ్లాస్‌మెట్ ఎవరంటే

చిత్రలహరి సినిమాలో గ్లాస్‌మేట్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. నా జీవితంలో గ్లాస్ మేట్స్ చాలా మంది ఉన్నారు. నా గ్లాస్‌మెట్స్ గురించి చెబితే జాబితా చాంతాండంతా అవుతుంది. గ్లాస్‌మెట్స్ అంటే మరోలా ఆలోచించకుడుదు. గ్లాస్‌లో మందు, మజ్జిగా తాగవచ్చు. జీవితంలో నాకు కష్ట, సుఖాల్లో భాగం పంచుకొనే వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అతడి వల్లే నేను ఇలా ఉన్నాను. నేను కమెడియన్‌గా ఉండటమే త్రివిక్రమ్‌కు ఇష్టం. అరవింద సమేతలో కమెడియన్‌గా చేయాలన్నది రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ నిర్ణయం.

 చిన్నప్పటి నుంచే తెలుసు

చిన్నప్పటి నుంచే తెలుసు

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అనుబంధం చిన్నప్పటి నుంచి ఉంది. భీమవరంలో ఒకే కాలేజీలో చదివే వాళ్లం. నాకంటే ఓ క్లాస్ ఎక్కువ. తన ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. నేను హైదరాబాద్‌కు వచ్చి సినిమా పరిశ్రమలో స్థిరపడాలని ప్రయత్నించి విఫలమయ్యా. దాంతో ఓ గట్టివాడు నా వెంట ఉంటే నా ప్రయత్నాలు సఫలమవుతాయని భావించి.. త్రివిక్రమ్‌ను హైదరాబాద్‌కు పట్టుకొచ్చాను.

కష్ట సుఖాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్

కష్ట సుఖాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్

ఎవరైనా కష్టాల్లో ఉంటే త్రివిక్రమ్ అందరికీ ధైర్యాన్ని ఇస్తాడు. సినిమా పరిశ్రమలో స్థిరపడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో చాలా ధైర్యంగా ఉండేవాళ్లం. కష్టాలు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా కూడగట్టుకునే వాళ్లం. ఫ్రెండ్స్‌నే కాకుండా ఎవరెళ్లినా మంచి విశ్వాసాన్ని కలుగజేస్తాడు. అతడిలో మంచి మానసిక వికాసానికి సంబంధించిన టీచర్ కనిపిస్తాడు.

 నేను చనిపోయానని వార్త రాశారు

నేను చనిపోయానని వార్త రాశారు

సోషల్ మీడియా ప్రభావంతో పరిస్థితులు చేజారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నేను చనిపోయానని వార్త రాశారు. దాంతో మిలియన్ వ్యూస్ వాళ్లకు వచ్చాయి. ఓ మిలియన్ వ్యూస్ కోసం ఒకరిని చంపాలా? వాళ్ల ఇంట్లో వాళ్లకి బాధేంటో తెలియాలంటే, వాళ్ల ఇంట్లో వాళ్లను చంపితే వారికి ఆ బాధేంటో తెలుస్తుంది. మనల్ని హర్ట్ చేసినా మేము నవ్వించాలనే పరిస్థితి కనిపిస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండవు అని సునీల్ అన్నారు.

 వెబ్‌సైట్‌పై కేసు పెట్టాను.. కానీ

వెబ్‌సైట్‌పై కేసు పెట్టాను.. కానీ

నేను చనిపోయానని రాసిన వెబ్‌సైట్‌పై కేసు పెట్టాను. కానీ వెబ్‌సైట్ యజమాని వచ్చి తప్పైందని ఒప్పుకొన్నారు. మా వాళ్లు తప్పు చేశారు. వారి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను అని అన్నారు. దాంతో అతడిపై కేసు పెట్టి నేను ఆనందపడటం బాగుండదనే ఉద్దేశంతో కేసు వాపసు తీసుకొన్నాను. ఏదైనా వార్త తెలిస్తే.. దాని వెనుక నిజనిజాలు తెలుసుకొని వార్త రాయాలని సునీల్ తెలిపారు.

చిత్రల విజయంలో నా పాత్ర ఎంతంటే

చిత్రల విజయంలో నా పాత్ర ఎంతంటే

చిత్రహరి సినిమాలో నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో నాది హనుమంతుడిపాత్రే. ఉడుత మాదిరిగానే సినిమా విజయానికి కారణమైంది. సినిమా విజయం అందరికీ మనోధైర్యాన్ని నింపింది. సాయిధరమ్ తేజ్‌తో చాలా రోజులుగా మంచి అనుబంధం ఉంది. ఆయనతో నటించే అవకాశం ఆలస్యంగా దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X