twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొండా మూవీ బయోపిక్ కాదు.. బయో ఫిక్షన్.. ఆర్జీవి కెరీర్‌ బెస్ట్.. హీరో త్రిగుణ్ ఇంటర్వ్యూ

    |

    ఉత్తర తెలంగాణలో ప్రముఖ రాజకీయ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం కొండా. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో కొండా మురళిగా యువ హీరో త్రిగుణ్‌, సురేఖగా ఇరా మోర్ నటించారు. రూపొందింది. కొండా దంపతుల కుమార్తె కొండా సుష్మితా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 23న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో త్రిగుణ్ మీడియాతో మాట్లాడుతూ..

    నయీం, గణపతి కథలను

    నయీం, గణపతి కథలను


    రాంగోపాల్ వర్మతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. పలుమార్లు ఇద్దరి కలిసి పలు కథల గురించి ఆలోచించాం. కానీ తనతో మంచి సినిమాను రూపొందించాలనే ఉద్దేశంతో ఆ కథలను పక్కన పెట్టారు. ఆ తర్వాత నువ్వు ఎలాంటి కథలు చేయాలని అనుకొంటున్నావు అంటే.. తుంగభద్ర లాంటి యాక్షన్ సినిమా చేయాలని అనుకొంటున్నానని ఆయనకు చెప్పాను. ఆ క్రమంలో నక్సలైట్ నయీలు నయీం, గణపతి లాంటి వ్యక్తులపై సినిమా తీయాలని రీసెర్చ్ చేశాం. అలాంటి నేపథ్యంలో నక్సలైట్ ఉద్యమం గురించి కొండా మురళికి చాలా తెలుసు అని మాకు ఎవరో చెప్పారు. దాంతో ఆయనను కలిశాడు అని త్రిగుణ్ పేర్కొన్నారు

    కొండా మురళి నువ్వే అంటూ

    కొండా మురళి నువ్వే అంటూ


    కొండా మురళి గారినికలిసిన తర్వాత లాక్ డౌన్ అనంతరం వర్మ గారు ఫోన్ చేసి 'నా స్క్రిప్ట్ దొరికింది. మనం మురళి మీద సినిమా చేస్తున్నాం. నువ్వు ఆయన రోల్ చేస్తున్నావు' అని చెప్పారు. తర్వాత రోజు 70 సన్నివేశాలతో కూడిన వన్ లైన్ఆర్డర్ స్క్రిప్ట్ పంపించారు. అలా కొండా సినిమా మొదలైంది.అయితే కొండా బయోపిక్‌లో నటిస్తున్నావని వర్మ చెప్పినప్పుడు నాకు పెయిన్, ప్లెజర్ రెండు ఫీలయ్యాను అని త్రిగుణ్ చెప్పాడు.

    కొండా బయోఫిక్షన్

    కొండా బయోఫిక్షన్


    రాంగోపాల్ వర్మ ఇప్పటి వరకు తీసిన బయోపిక్స్‌కు, 'కొండా'కు తేడా ఏమిటంటే.. రక్త చరిత్ర, వంగవీటి బయోపిక్స్ ఎక్కువగా పాత్రలమీద నడుస్తాయి. కొండా అనేది బయో ఫిక్షన్. ఇందులో కొండా మురళి, సురేఖమ్మ అనే రెండు పిల్లర్స్ ఉన్నాయి. నక్సలైట్ ఉద్యమంలో ప్రేమకథ పుట్టింది. అదొక కమర్షియల్ పాయింట్. కొండా మూవీలో చెప్పాల్సిన కథలు, వరంగల్ చుట్టూ జరిగినవి చాలా ఉన్నాయనివర్మ అన్నారు. మురళి గారు, సురేఖమ్మ పాత్రలు, వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయో ఫిక్షన్ మధ్య వ్యత్యాసం అదే అని త్రిగుణ్ చెప్పారు.

     కొండా మూవీ చాలా ఎమోషనల్‌గా

    కొండా మూవీ చాలా ఎమోషనల్‌గా


    నక్సలైట్ నుంచి రాజకీయ నేత వరకూ జరిగిన కొండా మురళి ప్రయాణంలో నాకు బాగా నచ్చింది. సమాజంలో మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని చేధించుకుని కొండా మురళి ఎదిగారు. జీవితంలో అవరోధాలు వచ్చినప్పుడు తొమ్మిది మంది ఆగుతారు. ఒక్కడు మాత్రం అన్నిటినీ దాటుకుని ముందుకు వెళతాడు. ఆ ఒక్కడి కథ కొండా. అది నాకు నచ్చింది. ఇండస్ట్రీలో నాకు ఎదురైన పరిస్థితులు, జీవితంలో మురళి గారికి ఎదురైన పరిస్థితులు ఒక్కటే. నేను నా పరిమితులను దాటుకుని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకని, మురళి గారిపాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను అని త్రిగుణ్ చెప్పారు.

    English summary
    Konda Murali and Konda Surekha's boipic Konda is set to release on 23rd of June. Here is the Actor Trigun interview about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X