twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తల్లిదండ్రులకు బెదిరింపు.. వాళ్లు శత్రువులుగా మారొద్దు.. విశాల్

    |

    తమిళ సినీ పరిశ్రమకు, పైరసీదారులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం భారీగానే సాగుతున్నది. నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా హీరో విశాల్ ఎనలేని పోరాటం చేస్తున్నాడు. పైరసీ దారుల వెబ్‌సైట్లను బ్యాన్ చేయడంలోనూ, వారిని అరెస్ట్ చేయడంలోనూ విశాల్ తనదైన మార్కును చూపిస్తున్నాడు. తాజాగా పందెంకోడి 2 సినిమా రిలీజై విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో విశాల్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. పైరసీ ఆగడాలను ప్రస్తావించగా ఆయన ఇలా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

    Recommended Video

    Hero Vishal Press Meet విశాల్‌ ప్రెస్ మీట్
    ప్రభుత్వాలే బాధ్యత వహించాలి

    ప్రభుత్వాలే బాధ్యత వహించాలి

    పైరసీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రభుత్వం తలుచుకొంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మేము చాలా సార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. అంతేకాకుండా సైబర్ సెల్‌ సహకారంతో నా టీమ్ జాగ్రత్తగా పనిచేస్తున్నది.

    శత్రువులుగా మారితే భయం

    శత్రువులుగా మారితే భయం

    పైరసీ చేసే వ్యక్తులు శత్రువులుగా మారితే భయం లేదు. కానీ పైరసీ సినిమాలు చూసే వారు శత్రువులుగా మారకుంటే చాలూ. పైరసీ అనేది చాలా దారుణమైన నేరం. ఒకరి ఇంట్లో నుంచి బంగారం దొంగిలించడం లాంటిందే పైరసీ.

    చేస్తావో చేసుకో పోమ్మిని

    చేస్తావో చేసుకో పోమ్మిని

    పైరసీకి పాల్పడే వాళ్ల నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నా తల్లిదండ్రులను బెదిరించారు. కొద్ది రోజుల వరకు బెదిరింపులను సీరియస్‌గా తీసుకొనే వాళ్లం. ఇప్పుడు అలాంటి ఫోన్ వస్తే ఏం చేస్తావో చేసుకో పో అని ఫోన్ పెట్టేస్తున్నాం.

    దుబాయ్ ప్రభుత్వం మాదిరిగా

    దుబాయ్ ప్రభుత్వం మాదిరిగా

    దుబాయ్‌లో అశ్లీల వెబ్‌సైట్లను అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అలానే మన ప్రభుత్వం కూడా పైరసీ వెబ్‌సైట్ల నిషేధానికి పూనుకోవాలి. అప్పుడే పైరసీకి అడ్డుకట్టపడుతుంది. దాంతో సినీ పరిశ్రమకు మేలు జరుగుతుంది.

    English summary
    Actor Vishal starrer 'Ayogya', remake of Tollywood superstar Jr NTR’s 2015 blockbuster film ‘Temper’, had its shooting commenced this morning in Chennai. Raashi Khanna is playing the female lead role in the film. Recenltly, Vishal's Padem Kodi 2 getting good response from the all corners.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X