Bigg Boss Telugu బిగ్‌బాస్ విన్నరైతే.. సర్కార్ 27 లక్షలు తీసుకొంది.. గుట్టు విప్పిన వీజే సన్నీ!

బిగ్ బాస్ తెలుగు 5 విన్నర్, నటుడు వీజే సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీజే, ఆర్జేగా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో కొనసాగి విన్నర్ గా నిలిచాడు. ముఖ్యంగా గొడవలు, టాస్కులు, ఎమోషన్లను ఆపుకుంటా బుల్లితెర ప్రేక్షకులను మనసులను గెలవడం అంత సులువు కాదు. ఇదంతా ఒకెత్తు అయితే దాదాపు వంద రోజుల పాటు... కుటుంబ సభ్యులు ఎవరినీ చూడకుండా బిగ్ బాస్ ఇంట్లో ఉండి నిలదొక్కుకోవడం అషామాషీ విషయం కాదు.

అయితే వంద రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో కష్ట, నష్టాలను భరించి ఐదో సీజన్ విన్నర్ గా నిలిచాడు నటుడు వీజే సన్నీ. అలా తాను బిగ్ బాస్ టీం నుంచి వారం వారానికి పుచ్చుకున్న రెమ్యునరేషన్ తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీని కూడా గెలుచుకున్నాడు. అంతే కాదండోయ్ సువర్ణ భూమిలో 25 లక్షల విలుపైన ఫ్లాట్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇవే కాకుండా వారానికి రెండు లక్షల రూపాయల చొప్పున పుచ్చుకున్న ఈయన మొత్తం పదిహేను వారాలకు గాను 30 లక్షలు దక్కించుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాధించిన వీజే సన్నీ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశాడు.

Actor VJ Sunny Shocking Comments on Bigg Boss Telugu 5 Winning Price Amount

తాను కంగ్రాట్యులేట్ చెప్పుకుంది తన ఒక్కడికే కాదని.. గవర్నమెంట్ వాళ్లకు కూడా కంగ్రాట్యులేట్ చెప్పినట్లు వీజే సన్నీ వివరించాడు. ముఖ్యంగా తాను చాలా కష్టపడి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచినప్పటికీ.. ఆట ఆడింది తనైతే గెలిచింది మాత్రం సర్కారు వాళ్లని చెప్పాడు. అయితే ఆయన అలా ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారా.. అదేం లేదండి. ఆయన గెలుచుకున్న డబ్బుల్లో దాదాపుగా సగం వరకు షేర్ చేసుకున్నట్లు చెప్పాడు. చెరో 50 శాతం డబ్బులను సర్కారుతో పంచుకున్నట్లు వివరించాడు.

జీఎస్టీ కోసం దాదాపు 27 లక్షల వరకూ కట్ అయిందని చెప్పాడు. తనకు ఎంత కట్ అయిందనేది కచ్చితంగా గుర్తు లేదు కానీ.. చాలా వరకు సర్కారుకే వెళ్లిపోయిందని చెప్పాడు. అలాగే 15 వారాల పాటు రెమ్యునరేషన్ గా పుచ్చుకున్న దాంట్లోంచి కూడా చాలానే డబ్బులు కట్ అయ్యాయని స్పష్టం చేశాడు. అలాగే మీరు ఆ డబ్బును డొనేట్ చేస్తానన్నప్పటికీ.. జీఎస్టీ కట్ అవుతుందా అని యాంకర్ అడగ్గా... ముందుగానే ఆ డబ్బులు కట్ అయి వస్తుందని సన్నీ వివరించాడు. ఇలా తాను చాలానే నష్పోయినట్లు తెలుస్తోంది.

Actor VJ Sunny Shocking Comments on Bigg Boss Telugu 5 Winning Price Amount

బిగ్ బాస్ తెలుగు షో మొదలు అయినప్పటి నుంచి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వాళ్లకు 50 లక్షలుగానే ఇస్తున్నారు. గతంలో అయితే అంటే 2017కు ముందు అయితే టాక్స్ రూపంలో ఓ పది లక్షల రూపాయల వరకు పోయేవి. కానీ ఆ తర్వాత నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో చాలా వరకు డబ్బులను జీఎస్టీ రూపంలో సర్కారుకు చెల్లించాల్సి వస్తోంది. దాదాపుగా 50 శాతం వరకూ ఇలాగే పోతోంది. వీజే సన్నీ చెప్పడంతో ఈ విషయంపై మరోసారి క్లారిటీ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X