twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Palavi మూవీకి అందుకే నిర్మాతగా మారాను.. గాడ్సే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వెల్లడి

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీ కల్యాణ్ నిర్మించిన గాడ్సే చిత్రం జూన్ 17న రిలీజ్‌కు సిద్దమైంది. సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ..

    తెలుగులో ఇంతవరకు నటించకపోవడానికి

    తెలుగులో ఇంతవరకు నటించకపోవడానికి

    దక్షిణాది సినిమా రంగంలో నేను మూడేళ్లుగా యాక్టింగ్ చేస్తున్నాను. నివీన్ పౌలీతో నా మొదటి సినిమా తర్వాత నేను నా రెండో సినిమా తెలుగులో చేయాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమాలో నటించలేకపోయాను. చివరికి నా కెరీర్‌లో 15వ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. తెలుగులో నాకు ఇది రెండో సినిమా. అమ్ము చిత్రం అమెజాన్‌లో విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం నా 20వ సినిమా షూటింగులో ఉంది అని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.

    అన్యాయాలు, అక్రమాలపై తిరుగుబాటు

    అన్యాయాలు, అక్రమాలపై తిరుగుబాటు


    ఇక గాడ్సే సినిమా చిత్ర కథ విషయానికి వస్తే.. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేసే యువకుడి కథ. నేను ఈ చిత్రంలో నేను వైశాలి అనే పాత్రను పోషిస్తున్నాను. నేను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. నాది సీరియస్‌గా సాగే పాత్ర ఇది. ఈ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ పాత్ర నా మనుసుకు దగ్గరైనది. బ్యూటీ, బ్రెయిన్‌ రెండు ఉపయోగించే పాత్ర నాది. ఎమోషన్స్, బాడీలాంగ్వేజ్ బాగా కాన్స్‌ట్రేట్ చేశాను అని ఐశ్వర్య లక్ష్మి చెప్పారు.

    సత్యదేవ్‌తో నా కెమిస్ట్రీ

    సత్యదేవ్‌తో నా కెమిస్ట్రీ


    సత్యదేవ్ ఇంటెన్సివ్, అమెజింగ్ యాక్టర్. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆయన నటించిన జ్యోతిలక్ష్మి, బ్లఫ్ మాస్టర్ సినిమాలు చూశాను. ఆయన నటన బాగుంది. ఆయన యాక్టింగ్‌లో నిజాయితీ కనిపిస్తుంది. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య ఫీల్‌గుడ్ అంశాలు ఉంటాయి. అవి తెరపైనే చూస్తేనే బాగుంటుంది అని ఐశ్వర్య లక్ష్మి అన్నారు.

    నటిగా నేను అలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటా

    నటిగా నేను అలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటా


    నటిగా నేను ఎలాంటి పాత్రలు చేయడానికి సిద్దం. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి తొందరగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటాను. నా పాత్రను అర్ధం చేసుకొని దానికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ప్లాన్ చేస్తుంటాను. నాకు నెగిటివ్ రోల్స్ చేయడం ఇష్టం లేదు. కానీ సీరియస్ పాత్రలు, ఇంటెన్స్, యాక్షన్ రోల్స్ చేయడానికి నేను రెడీ అని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.

    మణిరత్నం దర్శకత్వంలో అలాంటి అనుభవం

    మణిరత్నం దర్శకత్వంలో అలాంటి అనుభవం


    నేను మణిరత్నం సార్ దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించాను. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా షూటింగులో మొదటి పది రోజులు చాలా నెర్వస్‌గా, టెన్షన్‌గా ఫీలయ్యాను. నా పదో తరగతి పరీక్షల్లో కూడా అంత టెన్షన్ పడలేదు. బ్యాంకాక్ షూట్ చేశాం. ఎలాంటి రిహార్సల్ లేకుండా డైరెక్ట్‌గా షూట్ చేసేవారు. అయితే ఈ సినిమా గురించి ఎక్కువ వివరాలు చెప్పడం కుదరదు అని ఐశ్వర్య లక్ష్మి చెప్పారు.

    సాయిపల్లవి మూవీకి ప్రొడ్యూసర్‌గా

    సాయిపల్లవి మూవీకి ప్రొడ్యూసర్‌గా


    తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతున్న గార్గి అనే చిత్ర కథ నాకు ముందు చెప్పారు. అయితే టాలెంటెడ్, టాప్ హీరోయిన్ నటిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. గౌతమ్ రామచంద్రన్ చెప్పిన సినిమా కథ నచ్చడం వల్ల నేను ఆ సినిమాను నిర్మించాలని అనుకొన్నాను. నలుగురం కలిసి సాయిపల్లవితో గార్గి సినిమాను నిర్మిస్తున్నాం. ఆ సినిమా చాలా ఇంటెన్సివ్‌గా ఉంటుంది. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాను అని ఐశ్వర్య లక్ష్మీ వెల్లడించారు.

    English summary
    Actress Aishwarya Lekshmi latest movie Godse coming on 17th June. In this occassion, Heroine Aishwarya Lekshmi speaks about her movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X