ఆ బోల్డ్ సీన్లలో నటించిన తర్వాత.. భోరుమని ఏడ్చాను. పుష్ప గురించి అంజలి ఎమోషనల్

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ అంజలి సినిమాల వేగం పెంచేసింది. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ప్రస్తుతం బహిష్కరణ అనే వెబ్ సిరీస్‌తో తన సత్తాను చాటేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సిరీస్‌ రిలీజ్‌కు ముందే ఆమె పోషించిన పాత్రకు భారీ క్రేజ్ దక్కింది. ఈ సిరీస్‌లో అంజలి నటించిన సన్నివేశాలు యువతలో కాకపుట్టిస్తున్నాయి. అయితే జీ 5 స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి, సినిమాలోని పాత్ర గురించి ఆమె వివరిస్తూ..

బహిష్కరణ సినిమాల్లో అంజలి మరోసారి వేశ్య పాత్రలో నటించింది. ఈసారి మరింతగా రస్టిక్ పాత్రలో కనిపించడంతో ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యారు. ప్రమోషనల్ వీడియోలలో ఆమె పెర్ఫార్మెన్స్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. దాంతో భారీ అంచనాలు పెరిగాయి. బహిష్కరణ సిరీస్‌లో పుష్ప అనే పాత్ర రా అండ్ రస్టిక్. ఆ పాత్రను చేసేటప్పుడు నేను చాలా ఎంజయ్ చేశాను. ఆ క్యారెక్టర్‌లో భావోద్వేగం నన్ను మరింత పెర్ఫార్మ్ చేసేలా చేసింది అని అన్నారు.

Actress Anjali broke down after doing Pushpa role with Intimates Scenes In Bahishkarana

బహిష్కరణ ముతకగా ఉండే రియలిస్టిక్ డ్రామా. ఎమోషన్స్‌తో సాగే ఆ రోల్ రోలర్ కోస్టర్‌గా ఉంటుంది. ఆ పాత్రకు సంబంధించి ఇంతకు ముందు తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్‌గా నటించాల్సి వచ్చింది. బోల్డ్ సీన్లలో నటించడానికి మానసికంగా నేను సన్నద్దం కాలేదు. అలాంటి పాత్రలు చేస్తేనే నటిగా ఓ ఛాలెంజ్‌ను ఎదుర్కొనేలా ఉంటుందని చేశాను. కానీ తొలుత అసౌకర్యంగా అనిపించిందని పుష్ప పాత్ర గురించి వివరించారు.

బోల్డ్ సీన్లలో నటించేటప్పుడు చాలా ఎమోషన్‌గా ఫీలయ్యాను. సీన్ పూర్తి చేసిన తర్వాత భోరుమని ఏడ్చాను. నా జీవితంలో అలాంటి సీన్లలో ఎప్పుడూ నటించలేదు. అందుకే అలాంటి భావోద్వేగానికి గురయ్యాను. కానీ వెంటనే మానసికంగా సిద్దమై అలాంటి సన్నివేశాలను పూర్తి చేశాను. అలాంటీ సీన్లలో నటించిన తర్వాత శరీరం పూర్తిగా అలిసిపోయేది అని తన అనుభవాలను గుర్తు చేసుకొన్నారు.

Actress Anjali broke down after doing Pushpa role with Intimates Scenes In Bahishkarana

పుష్ప పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యాం. ఆ క్యారెక్టర్‌‌లో ఉండే చిన్న చిన్న భావాలను పలికించేందుకు చాలా శ్రమపడ్డాం. రిహార్సల్ చేశాం. మా కష్టానికి ఫలితం తెరపైన వచ్చిందని భావించాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నదని నేను అనుకొంటున్నాను. కొన్ని సన్నివేశాలు చాలా అద్బుతంగా వచ్చాయి అని తన క్యారెక్టర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

బహిష్కరణ విడుదలైన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకుంది. ముఖేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌ను ప్ర‌శాంతి మ‌లిశెట్టి రూపొందించారు. ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

More from Filmibeat

Read more about: anjali pushpa bahishkarana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X