‘టిల్లు స్క్వేర్ తో చాలా ఇబ్బంది పడ్డ.. అలాంటి పాత్రలు మళ్లి చేయ్యను’

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. ఇక తాజాగా పరదా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ కు హాజరవుతూ వస్తోంది. ఈ సందర్భంగా తన రాబోయే చిత్రాలు, తన గత చిత్రాలపై ఆసక్తికరంగా మాట్లాడింది. ముఖ్యంగా తన గత చిత్రం టిల్లు స్క్వేర్ గురించి, అందులో తన పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఆ వివరాల్లోకి..

పరదా ప్రమోషన్స్ లో జోరు..
అనుపమా పరమేశ్వరన్ నుంచి వస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ పరదాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ బ్యూటీఫుల్ డ్రామాను సినిమా బండి చిత్రం డైరెక్టర్ ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వం వహించడం విశేషం. ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మాత విజయ్ డొంకల నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ మెయిన్ లీడ్స్ లో నటించారు. అలాగే కల్పలత, ఖేదర్ శంకర్, ఝాన్సీ, శత్రు, మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర, బాషా, అనశ్వి రెడ్డి, జోష్ రవి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమాటోగ్రాఫర్ గా మృధుల్ సుజిత్, ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ చేయగా, గోపీ సుందర్ సంగీతం అందించారు.

Actress Anupama Parameswaran Latest Comments on Tillu Square Movie

అనుపమా పరమేశ్వరన్ కామెంట్స్..
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ పరదా చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తన సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన గత చిత్రాల్లో టిల్లు స్క్వేర్ గురించి స్పందించింది. ఆసక్తికరంగా మాట్లాడింది. 'డీజే టిల్లు చిత్రం కల్ట్ క్లాసిక్ సినిమా. కానీ ఆ చిత్రంలో నేహా శెట్టి రాధిక అనే పాత్ర యాక్సిడెంటల్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆమె పాత్రతో అందరూ నన్ను టిల్లు స్క్వేర్ చిత్రంలోని లిల్లీ పాత్రతో పోల్చారు.

టిల్లు స్క్వేర్ లోని నా పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. సెట్స్ లో చాలా అండర్ కాన్ఫిడెంట్ తో ఉన్నాను. అసలు అలాంటి పాత్ర చేయలేదు. నా పాత్రకు పెద్దగా ఆకర్షణగా అనిపించలేదు. మరోవైపు అలాంటి బట్టలు వేసుకోవడం కూడా నాకు పెద్దగా నచ్చదు. నా కెరీర్ లో ఆ పాత్రలో నటించడం పెద్దగా నచ్చలేదు' అని చెప్పుకొచ్చింది. కానీ అన్నింటికంటే పరదా చిత్రంలో నటించిన పాత్ర ది బెస్ట్ అని చెప్పింది. అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పుకొచ్చింది.

హ్యాట్రిక్ హీరోయిన్..
ప్రేమమ్ చిత్రంతో మలయాళంలో అనపమా పరమేశ్వరన్ తొలి హిట్ అందుకుంది. అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి అనే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంది. దాంతో టాలీవుడ్ లో హ్యాట్రిక్ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుంది.ఆ తర్వాత హలో గురు ప్రేమ కోసమే, రక్షకుడు, రౌడీ బాయ్స్, బట్టర్ ఫ్లై, ఈగల్ వంటి చిత్రాలతో అలరించింది. రీసెంట్ గా డ్రాగన్, జేఎస్కే వంటి చిత్రాలతో అలరించింది. నెక్ట్స్ పరదాతో పాటు బైసన్, లాక్ డౌన్, పెట్ డెటెక్టివ్ వంటి చిత్రాలతో అలరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X