అలా ఉంటే వేశ్య అనే ముద్ర.. అమ్మాయిలకు ఆ కోరికలు ఉండవా? ఎస్తేర్ నోర్హోన్హా సెన్సేషనల్‌గా

ఎస్తేర్ నోరోన్హా.. వెంటనే ఈ పేరు గుర్తురాకపోవచ్చు. అదే భీమవరం బుల్లోడులో సునీల్ పక్కన నటించిన హీరోయిన్ అంటే మాత్రం తెలుగు వారికి ఠక్కున గుర్తొస్తుంది. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబద్ధాలు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు ఎస్తేర్. ఆ వెంటనే భీమవరం బుల్లోడు సినిమాలో ఆమె నటించారు. ముద్దుగా బొద్దుగా ఉండే ఎస్తేర్ యువతకు బాగానే నచ్చింది. కానీ ఆమె సినిమాలు అంతగా ఆడకపోవడంతో త్వరగానే ఫేడవుట్ అయిపోయింది. అడపాదడపా చిన్నా చితకా చిత్రాల్లో నటించినా ఎస్తేర్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కొంతకాలానికే సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆమె వైవాహిక జీవితం కూడా ఏమంత సక్సెస్ కాలేదు. పెళ్లయిన ఏడాదికే ఎస్తేర్ విడాకులు తీసుకుంది.

నోయెల్‌తో విడిపోయిన తర్వాత చిన్నాచితక పాత్రల్లో నటిస్తూ వస్తోన్న ఎస్తేర్ అందాల ఆరబోతకు, రోమాంటిక్ సీన్లలో నటించేందుకు సైతం వెనుకాడటం లేదు. 69 సంస్కార్ కాలనీ, రెక్కీ సినిమాలలో బెడ్‌రూమ్‌ సీన్లలో రెచ్చిపోయి నటించింది. టీనేజ్ యువకుడికి, పెళ్లయిన మహిళకి మధ్యన చిగురించిన ప్రేమ కథతో వచ్చిన 69 సంస్కార్ కాలనీపై సాంప్రదాయవాదులు మండిపడ్డారు కూడా. ఆ వెంటనే చేసిన రెక్కీలో తనకంటే వయసులో పెద్ద అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే మహిళగా ఎస్తేర్ నటించింది. వీరిద్దరి మధ్య బెడ్ రూమ్ సీన్స్ సైతం ఉన్నాయి.

Actress Ester Noronha sensational Comments on trolls related to women dresses styles in 69 Samskar Colony promotions

ఏం చేసినా కాలం కలిసిరాకపోవడంతో ఎస్తేర్ రూటు మార్చారు. నిర్మాతగా, దర్శకురాలిగా అవతారమెత్తారు. జానెట్ నోరోన్హా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ' ది వేకెంట్ హౌస్ ' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రచనా, దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటంతో పాటు అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎస్తేర్.

నోయెల్ నుంచి విడిపోవడంతో మీ జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు ఎస్తేర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. తనకు ఒంటరిగా ఉండాలని లేదని, పెళ్లి చేసుకోని అందమైన జీవితాన్ని గడపాలని ఉందని .. తనను అర్ధం చేసుకునే వ్యక్తి జీవితంలోకి వస్తే చాలని చెప్పింది. ఒక సందర్భంలో ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కోచ్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actress Ester Noronha sensational Comments on trolls related to women dresses styles in 69 Samskar Colony promotions

మగాళ్లు అడగటం ఒక రకమైతే, ఆడవాళ్లే ఆఫర్ చేయడం అనే వింత కూడా ఇండస్ట్రీలో ఉందని ఎస్తేర్ చెప్పారు. 99 శాతం మంది అలాంటి వాళ్లే ఉన్నప్పుడు .. మిగిలిన ఒక శాతాన్ని కూడా వారితో కలిపేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. కానీ అవకాశాల కోసం నా క్యారెక్టర్‌ని కోల్పోయే రకాన్ని కాదని.. ఇలా ఉండటం వల్లే ఎన్నో సినిమాలు మిస్ అయ్యాయని ఎస్తేర్ గుర్తుచేసుకున్నారు.

ఇక మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల తనపై కొందరు ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు వెనుక ఆలోచించకుండా ఒక వేశ్య అనే ముద్ర వేసేస్తున్నారని .. ఆ మాటకు బదులు ఇంగ్లీష్‌లో , తెలుగులో ఎన్నో పదాలు ఉన్నాయని ఎస్తేర్ చురకలంటించారు. అమ్మాయిలను అంటున్న జనానికి మేల్ ఎస్కార్ట్స్‌ అనే వాళ్లు ఉన్నారని తెలుసా అని ప్రశ్నించారు.

Actress Ester Noronha sensational Comments on trolls related to women dresses styles in 69 Samskar Colony promotions

అమ్మాయిలకు కోరికలు ఉండటం తప్పు అని ఇప్పటికీ సమాజం ఆంక్షలు విధిస్తోందని.. మహిళలకు కోరికలు ఉండకూడదా అని ఎస్తేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లది జీవితం కాదా.. వారికి ఎమోషన్స్ ఉండవా అని ఎస్తేర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సాంప్రదాయవాదులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X