ఆ నటుడితో బిడ్డను కనాలనుకొన్నాను.. ఇండస్ట్రీ వాళ్లు అలా అడ్డుకొన్నారు.. నటి జయలలిత

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి పాత్రలతో గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటి జయలలిత కొనసాగుతున్నారు. గ్లామర్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. అయితే తన జీవితంలోకి వచ్చిన శరత్ బాబు గురించి, ఆయనతో జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమ మాట్లాడుతూ.. రమాప్రభ, శరత్ బాబు, తనతో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు. నటి జయలలిత చెప్పిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..

నటుడు శరత్‌బాబుతో నాది మనసుకు సంబంధించిన బంధం. ఇద్దరం అనుకొని అలాంటి రిలేషన్‌షిప్‌ను కొనసాగించాం. ఆయన బతికి ఉన్నా.. లేకపోయినా ఈ విషయాన్ని చెప్పేదానిని. ఆయనతో యాత్రలు చేశాను. దేవుడు నా కోసం ఓ గైడ్‌ను పంపించారని అనుకొన్నాను. లేకపోతే అన్నీ యాత్రలు చేసే దానిని కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఒకరి డబ్బు తినడు. మరో వ్యక్తికి పెట్టడు. నాకు తెలిసినంత వరకు ఆయన మంచి మనిషి అని జయలలిత చెప్పారు.

Actress Jaya Lalitha

శరత్‌బాబు, నేను వివాహం చేసుకోవాలని అనుకొన్నాం. కానీ ఇండస్ట్రీకి చెందిన కొందరు మధ్యలో జోక్యం చేసుకొని పెళ్లి కాకుండా చేశారు. పెళ్లి తర్వాత ఏం చేయాలనే విషయాలను కూడా ప్లాన్ చేసుకొన్నాం. ఆయనతో నేను ఒక బిడ్డ కనాలని కూడా అనుకొన్నాను. అందుకు ప్లాన్ కూడా చేసుకొన్నాను. కానీ ఆయన చాలా ఆలోచించి.. పిల్లల్ని వద్దని చెప్పారు. మనం చనిపోయిన తర్వాత మన సంతానాన్ని ఎవరైనా చంపేస్తారేమో అన్నారని జయలలిత తెలిపారు.

ఆయన కుటుంబంతో నాకు మంచి పరిచయం ఉంది. ఆయన ఫ్యామిలీ సభ్యులు నన్ను శత్రువుగా చూడలేదు. మా మధ్య బంధం గురించి వారికి పెద్దగా తెలియదు. నాకు రమాప్రభకు మంచి స్నేహం ఉంది. కానీ శరత్ బాబును చాలా దారుణంగా తిట్టారు. కానీ నా దృష్టిలో ఆయన మంచి వ్యక్తి. నా వైపు నుంచి చూస్తే ఆ విషయం తెలుస్తుంది. నాకు తెలియకుండానే ఆయనపై నమ్మకం, భరోసా కుదిరింది అని జయలలిత చెప్పారు.

శరత్‌బాబును బావ అని పిలిచే చనువు ఉండేది. మా మధ్య అలాంటి సన్నిహిత సంబంధాలు ఉండేవి. చాలా పుస్తకాలు చదివే వారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆయన నన్ను తనతోపాటు యాత్రలకు తీసుకెళ్లారు. అలాగా మా ప్రయాణం కొనసాగింది. మా మధ్య అలాంటి సంబంధం కొనసాగింది. నాతో అన్ని విషయాలు పంచుకొనే వారు అని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X