జగన్ పై జయసుధ కొడుకు షాకింగ్ కామెంట్.. అమ్మతో వెళితే అలా చేశారంటూ..
టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడులో పుట్టిన పెరిగినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు తన చిత్రాల్లో ఎంతగానో దగ్గరైంది. ఆమె తల్లి సుజాత నిడుదవోలు తెలుగు భాష మాట్లాడే కుటుంబానికి చెందిన కావడంతో తెలుగు అమ్మాయిగానే పెరిగింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆయా చిత్రాలలో సపోర్టింగ్ పాత్రల్లో మెరుస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జయసుధ కొడుకు నిహార్ కపూర్ తాజాగా ఇంటర్వ్యూ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పైగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
53 ఏళ్లు వెండితెరపై మెరుస్తూ..
జయసుధకు ప్రస్తుతం 66 ఏళ్లు. ఆమె చెన్నైలో 1958 డిసెంబర్ 17న జన్మించింది. సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మలకు ఆమెకు తండ్రి సోదరుడు కావడం విశేషం. పైగా వాళ్ల అమ్మకూడా నటిగా ఆ కాలంలోనే అలరించారు. ఇక అలా జయసుధకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. దాంతో చిన్న వయస్సులోనే హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

ఇక ఆమెకు 13 ఏళ్ల వయస్సులోనే హీరోయిన్ గా తొలి సినిమా అవకాశం దక్కింది. 1972లో కే బాలాచందర్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిచిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకుంది. లక్ష్మణ రేఖ, నోము, ఇది కథ కాదు, అడవి రాముడు, ప్రేమాభిషేకం వంటి చిత్రాలతో 90లో ఊపూపింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
కొడుకును కూడా నటుడిగా..
జయ సుధ కొడుకు నిహార్ కపూర్ ను కూడా జయసుధ నటుడిగా పరిచయం చేసింది. అయితే నిహార్ కపూర్ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటుండే వాడు. ఆయనకు షూటింగ్, ఒలింపిక్స్ గేమ్స్ పై ఎక్కువగా ఆసక్తి ఉంటూ ఉండేది. దాంతో తొలుత పెద్దగా హీరోగా పరిచయం చేసే అవకాశం దొరకలేదు. కానీ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గ్యాంగ్ స్టర్ గంగరాజ్' అనే చిత్రంలో నిహార్ కపూర్ కీలక పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక తర్వాత పెద్ద సినిమాలు చేయలేదు. రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రంలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ గురించి..
హరి హర వీరమల్లు చిత్రంలో ఫుల్ లెన్త్ పాత్రలో నిహార్ కనిపించడం విశేషం. ఈ సందర్భంగా నిహార్ కపూర్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో నిహార్ కపూర్ జగన్ మోహన్ రెడ్డి గురించి స్పందించారు. గతంతో తల్లి జయసుధతో కలిసి తను కూడా వైసీపీలో జాయిన్ అయినట్టు ప్రచారం జరిగింది. దానికి తాజాగా బదులు ఇచ్చారు. అసలు మేం ఆ పార్టీలో చేరలేదని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ మోహన్ ను కలిసేందుకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది అలా వైసీపీ కండువాలను కప్పారు. అసలు ఎందుకు కండువాలు చేశారనేది నాకు అర్థం కాలేదు. ఆ ఆఫీస్ కు ఎవ్వరు వెళ్లినా అలానే కండువాలు కప్పుతున్నారని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.


Click it and Unblock the Notifications











