నాన్న చనిపోయి ఏడస్తుంటే అలాంటి చెత్త రూమర్లు.. గబ్బర్ సింగ్ అలా మిస్..జ్యోతి ఆవేదన

చిత్ర సీమలో విచిత్ర పరిస్ధితులు కనిపిస్తూ ఉంటాయి. అందం, అభినయం ఉన్నా ఎందుకో కొందరు ఫేడవుట్ అయిపోవడమే లేదంటే చిన్నాచితకా పాత్రలకో పరిమితమవుతుంటారు. అందుకే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవిగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. అలా అన్ని ఉన్నప్పటికీ అదృష్టం లేక అలా మిగిలిపోయిన వారెందరో .. వీరిలో జ్యోతి ఒకరు. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , రొమాంటిక్ కామెడీ పాత్రలు, వ్యాంప్ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

18 ఏళ్ల వయసులోనే ఎమ్మెస్ రెడ్డి దర్శకత్వం వహించిన అందం చిత్రం ద్వారా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు జ్యోతి . ఆపై ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన హంగామా, పెళ్లాం ఊరెళితే.. దరువు, ఎవడిగోల వాడితే వంటి మూవీల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఆపై వరుస అవకాశాలు దక్కించుకుని బిజీ అయ్యారు. కామెడీ రోల్స్, కమెడియన్‌లకు వైఫ్ క్యారెక్టర్లు చేస్తూ నవ్వించారు. ఈ నేపథ్యంలో జ్యోతిపై సెక్స్ రాకెట్ ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయినప్పటికీ కృంగిపోకుండా న్యాయపోరాటం చేసి కేసు గెలిచారు. ఇదంతా గిట్టని వారు చేసిన కుట్రగా జ్యోతి తేల్చిచెప్పారు.

actress jyothi emotional comments on Rumours and harassment in Telugu Film Industry
ఇండస్ట్రీలో ఈ ధోరణి మారితే మంచిదని.. తనకు కూడా వేరే రోల్స్‌లో నటించాలని ఉండేదని వెల్లడించారు. పైకి బోల్డ్‌గా కనిపించే తాను చాలా సెన్సిటివ్ అని , హీరోయిన్ అవుదామని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, వ్యాంప్ రోల్స్ చివరికి ఐటెం సాంగ్స్ కూడా చేశానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నా.. దుబాయ్‌లోనో, అమెరికాలోనో సెటిలైపోయినట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ అమ్మాయి కమిట్‌మెంట్‌కు ఓకే చెబితే తను మంచిదని, ఒప్పుకోకపోతే క్యారెక్టర్ లేనిదా అని జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇన్సిడెంట్‌‌ తెలిసి తన తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని జ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రిని కడసారి చూసేందుకు విశాఖ వెళ్లాలని నేను, అక్క, బావ, బాబు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి టికెట్ల కోసం పిచ్చిదానిలా తిరుగుతున్నామన్నారు. అది చూసి ఎవడో సోషల్ మీడియాలో ఇంత జరిగినా జ్యోతి విచ్చలవిడిగా తిరుగుతోందని రాశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

actress jyothi emotional comments on Rumours and harassment in Telugu Film Industry

ఇండస్ట్రీలో నన్ను కావాలని కేసుల్లో ఇరికించారని, రకరకాలుగా నన్ను వేధించారు. నన్ను అది దక్కకపోతే ఇంతకు తెగిస్తారా అని జ్యోతి ప్రశ్నించారు. ఇంత జరిగినా ధైర్యంగా బతుకుతున్నానంటే కేవలం తన బిడ్డ కోసమేనని అన్నారు. ఇలాంటివి నాకు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. వేటిని పట్టించుకోవడం లేదన్నారు.

ఆ వివాదం తర్వాత గబ్బర్ సింగ్‌లో తనకు వచ్చిన అవకాశం చేజారిపోయిందని ఆమె గుర్తుచేసుకున్నారు. తండ్రి చనిపోయి, క్యారెక్టర్‌పై నిందలు పడి, చేతిలో అవకాశాలు లేక జీవితం గందరగోళంగా మారిపోయిందని జ్యోతి భావోద్వేగానికి గురయ్యారు. వేశ్యలుగా బతికే మహిళలు కూడా సుఖం కోసం, విలాసాల కోసం వ్యభిచారం చేయరని.. ఫ్యామిలీ కోసం , అవసరాల కోసమే అలా మారిపోతారని అన్నారు. ఏ రంగంలోనైనా అమ్మాయిలు బలౌతూనే ఉన్నారని.. కానీ చేయని తప్పుకు తాను బలి అయ్యానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X