Rama Banam గోపిచంద్ మిస్టీరియస్ యాక్టర్.. జగపతిబాబుతో అలాంటి రిలేషన్.. కుష్బూ (ఇంటర్వ్యూ)

మాచో స్టార్ గోపిచంద్, జగపతిబాబు, కుష్బూ, డింపుల్ హైతీ నటించగా దర్శకుడు శ్రీవాసు రూపొందించిన చిత్రం రామ బాణం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మే 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో సచిన్ ఖేడ్కర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతతం అందించారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సీనియర్ నటి కుష్బూ తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..

ఫ్యామిలీ రిలేషన్స్‌తో : రామబాణం సినిమాలో ఫ్యామిలీ రిలేషన్స్ చాలా ఎమోషనల్‌గా సాగుతాయి. వాస్తవానికి నాకు ఫ్యామిలీ, రిలేషన్స్ అంటే ఇష్టం. కుటుంబ సభ్యులందర్నీ కలిపే ఓ పాత్ర నాది. అంతేకాకుండా మంచి ఫుడ్‌తో ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒక్కచోటుకి తీసుకు రావడం పాయింట్ నన్ను బాగా ఆకట్టుకొన్నది. నా హృదయానికి దగ్గరైన సబ్జెక్ట్. కుటుంబ విలువలు ఉన్న కథ ఇది. అందుకే భువనేశ్వరి అనే పాత్రను చేశాను.

 Actress Khushbu about Rama Banam movie

కల్తీ ఆహారం హానికరం అనే..: రామబాణం సినిమాలో ఆహార కల్తీ అనే విషయం గురించి చర్చించబోతున్నాం. మనిషికి కల్తీ లేని ఆహారం ఎంత అవసరం అనే విషయాన్ని కథలో భాగంగా చెప్పబోతున్నాం. ప్యాక్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారు. అలాంటి ఫుడ్‌లో రుచి కోసం రసాయనాలు కలుపుతుంటారు. కానీ అమ్మ చేసే మసాలాల వల్లే మంచి ఫుడ్ లభిస్తుందని నేను నమ్ముతాను.

ఫ్యామిలీ కలిసి మెలిసి ఉంటే.. : ఇంట్లో భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తుండటం వల్ల, విదేశాల్లో పట్టణాల్లో చదివే స్టూడెంట్స్‌ ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. తక్కువ సమయలో ఇంట్లో కూరగాయలు, ఇంటిలో మసాలాలు చేసుకొంటే ఎంత బాగుంటుందనే విషయాన్ని రామబాణం సినిమాలో చెప్పబోతున్నారు. ఆరోగ్యంతో ఫ్యామిలీ కలిసి మెలిసి ఉంటే.. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అనే సందేశాన్ని సినిమా ద్వారా చెప్పబోతున్నాం అని కుష్బూ తెలిపారు.

 Actress Khushbu about Rama Banam movie

భువనేశ్వరి పాత్రలో : నా పాత్రను అర్ధం చేసుకొని నటిస్తాను. రామబాణం సినిమాలో నేను ధైర్యవంతురాలిగా భువనేశ్వరి పాత్రలో నటిస్తున్నాను. ఒక బిజినెస్ ఉమెన్‌గా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉంటుంది. ఇక నా ఫ్యామిలికి ఏదైనా ఇబ్బంది వస్తే.. గాయపడిన ఆడపులిలా మారుతాను. భువనేశ్వరి పాత్ర అలా ఉంటుంది. అలాంటి పాత్రకు నేను చాలా ఈజీగా కనెక్ట్ అయ్యాను.

గోపిచంద్‌తో చివరి రోజు వరకు : నేను గోపిచంద్‌తో ఫస్ట్ టైమ్‌ వర్క్ చేశాను. చివరి రోజు షూటింగ్‌ రోజు మాత్రమే మేము ఫోన్ నంబర్, ఫోటోలు తీసుకొన్నాం. కానీ సెట్లో చాలా కామ్‌గా ఉంటారు. ఆయన కార్ వ్యాన్‌కు వెళ్లరు. సెట్లో ఉండి అందర్నీ గమనిస్తుంటారు. ఆయన చెన్నైలో పుట్టి పెరిగారు కాబట్టి.. తమిళ్ మాట్లాడుతుంటారు. కాబట్టి ఇద్దరం మాట్లాడుకోవడం ఈజీగా ఉంది. ఆయన ఎవరికి అంతుపట్టని వ్యక్తి. అతనిలో ఎవరికీ తెలియని టాలెంట్ ఉంది. కాబట్టే ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తారు.

 Actress Khushbu about Rama Banam movie

జగపతి బాబును అలా పిలుస్తాను అంటూ
జగపతిబాబుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వాళ్ల నాన్న తీసిన సినిమాల్లో నేను జగపతిబాబుతో రెండు బాలనటిగా చేశాను. అప్పుడు ఆయన ప్రొడక్షన్ చూస్తుండే వారు. అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను జగపతిబాబును చౌ మామ అని పిలుస్తాను అని కుష్బు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X