చిరంజీవి, బాలకృష్ణతో ఆ కోరిక తీరలేదు.. మనసులో మాట చెప్పిన కుష్బూ

సీనియర్ నటి, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కుష్బూ నటించిన తాజా చిత్రం రామబాణం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. యువ హీరో గోపిచంద్, డింపుల్ హయతి, జగపతిబాబు నటించిన ఈ చిత్రానికి శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నారు. మే 5వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో కుష్భూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

ఫస్ట్ సినిమా ఆఫర్ గురించి: 40 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌ తర్వాత కూడా నేను నటిగా కొనసాగుతున్నానంటే.. నటన పట్ల నాకు ఉన్న అంకితభావం వల్లే. పనిని నేను దైవంగా భావిస్తాను. కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని అనుకొంటాను. కలియుగ పాండవులు రిలీజై 37 సంవత్సరాలు అయింది.

Actress Khushbu wants to romance Chiranjeevi, Balakrishna on silverscreen

నేను నటించిన హిందీ సినిమా చూసి రామానాయుడు, రాఘవేంద్రరావు నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సినిమా ఆఫర్ రావడం లక్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వస్తే ఇంత మంది జర్నలిస్టులు వచ్చారంటే నాకు గర్వంగా ఉంటుంది. టాలెంట్ అనేది సెకండరీ మాత్రమే అని కుష్బూ తెలిపారు.

మికీ జే మేయర్ గురించి: రామ బాణం సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తే.. మిక్కీ జే మేయర్ మంచి సంగీతాన్ని అందించారు. ఐఫోన్ పాట రిలీజ్ తర్వాత కొద్ది గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్ అయింది. ప్రేక్షకులకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అతడికి తెలుసు. ఈ సినిమాలో దేవాలయంలో పాట రికార్డింగ్ చేశారు. దాన్ని బట్టి తనకు మ్యూజిక్‌లో బ్యాలెన్స్ చేయడం తెలుసనే అభిప్రాయం కలుగుతుంది.

పీ వాసు స్థాయి దర్శకుడు శ్రీవాస్: దర్శకుడు శ్రీవాస్‌తో పనిచేసినప్పుడు ఫస్ట్ టైమ్ ఆయనతో కలిసి పనిచేస్తున్నాననే ఫీలింగ్ కలుగలేదు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తి అనిపించింది. నేను చాలా గొప్ప డైరెక్టర్లతో పనిచేశాను. ఆయన క్రియేటివిటి పేపర్‌పై ఉండదు. మొత్తం ఆయన మైండ్‌లోనే ఉంటుంది. చాలా ప్రతిభవంతుడు. పీ వాసు లాంటి డైరెక్టర్‌తో పనిచేసినట్టు శ్రీవాసుతో అనిపించింది. చాలా కంఫర్ట్‌గా అనిపించింది.

Actress Khushbu wants to romance Chiranjeevi, Balakrishna on silverscreen

చిరంజీవి, బాలకృష్ణతో..:
తెలుగు సినిమాల్లో నటించడానికి నేను రెడీ. కానీ సరైన రోల్స్, అవకాశాలు వస్తే నేను ఎప్పుడూ సిద్దమే. నేను చిరంజీవి సార్‌తో సినిమాల్లో నటించలేదు. ఆయనతో రొమాన్స్ చేయాలని ఉంది. అలాగే బాలకృష్ణతో కూడా నేను నటించలేదు. వారిద్దరితో కలిసి నటించాలని ఉంది. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు అందరి హీరోలతో దాదాపు నటించాను. కేవలం ఆ ముగ్గురితో నటించలేదు. అమితాబ్తో చైల్డ్ ఆర్టిస్టుగా మాత్రమే నటించాను అని కుష్బూ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X