‘ప్రభాస్‌తో డేటింగ్ చేయాలని ఉంది.. ఆ షూటింగ్‌లో నన్ను భరించలేక..’
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో ప్రభాస్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. యంగ్ రెబల్ స్టార్‌ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకొంటారు. అలాంటి డార్లింగ్ పర్సనాలిటీని ఏ అమ్మాయి అయినా వదిలిపెట్టకుంటా ఉంటారా? ఆయనపై మోజు పడకుండా ఉండని వారుంటారా? అయితే ఇప్పటికే పలువురు హీరోయిన్లు ప్రభాస్ అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలని ఉంది.. లేదా డేటింగ్ చేయాలని ఉందని బహిరంగంగానే చెప్పారు. అలాంటి జాబితాలో మరో యాక్టర్ కూడా చేరారు. ప్రభాస్ అంటే విపరీతమైన క్రష్ ఉన్న యాక్టర్ గురించిన వివరాల్లోకి వెళితే..
ఇంకా పెళ్లి కాని ప్రసాద్ జాబితాలో ఉన్న ప్రభాస్‌పై అనేక మంది హీరోయిన్లు మోజు పడుతున్నారనే విషయం మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో మీనాక్షి చౌదరీ తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒప్పుకొంటే పెళ్లి చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్.. యంగ్ హీరోయిన్ దివి వద్యా కూడా రెబల్ స్టార్‌పై ఉన్న ప్రేమను బహిరంగంగానే వ్యక్తీకరించడం తెలిసిందే.

ఇక ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తే.. ఆ మూవీలో నటించే హీరోయిన్‌తో అఫైర్ వార్తలు గుప్పుమంటాయి. ఆ మధ్య కృతిసనన్, అలాగే పూజా హెగ్డే, అంతకుముందు పలువురు హీరోయిన్లతో డేటింగ్ వ్యవహారాలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వార్తలన్నీ రూమర్లు, గాపిప్స్‌గానే మిగిలిపోయాయి. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి.
అయితే ఎంత మంది హీరోయిన్లతో అఫైర్ వార్తలు వచ్చినా.. అందులో అనుష్క శెట్టితో రిలేషన్‌షిప్ ప్రత్యేకమైనది. వారిద్దరి బంధం మానసికంగా ఎంత బలమైనదో అనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా మీడియాలో హెడ్‌లైన్స్‌ను ఆకర్షించాయి. అయితే ఆ వార్త ఇప్పటికీ ఏదో ఆసక్తిని అభిమానుల్లో రేపుతుంటుంది.

ఇదిలా ఉండగా, ప్రభాస్‌తో యోగి సినిమాలో పనిచేసిన ముమైత్ ఖాన్ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రెబల్ స్టార్ చాలా సిగ్గుపడుతుంటాడు. సెట్స్‌లో సైలెంట్‌గా ఉంటాడు. యోగి సినిమా షూటింగ్ సమయంలో ఆయనను విపరీతంగా ఆటపట్టించాను. నా టీజింగ్‌ను భరించలేక నాపై కొరియోగ్రాఫర్‌కు కంప్లైంట్ చేశాడు. అయినా నేను నా పద్దతి మార్చుకోకుండా ఆయనను అలానే టీజ్ చేశాను అని ఆమె చెప్పారు.
యోగి సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌తో ఫుల్లుగా ఫన్ క్రియేట్ చేశాం. నాకు మంచి స్నేహితుడిగా మారిపోయాడు. నిజంగా ప్రభాస్ డార్లింగ్ లాంటి వాడే. ఎవరైనా నన్ను.. ఎవరితో డేటింగ్‌కు వెళ్తావు అని అడిగితే.. నేను ఠక్కున ప్రభాస్‌తో డేటింగ్ చేస్తానని చెబుతాను అని ముమైత్ ఖాన్ తన మనసులోని మాటను చెప్పింది.


Click it and Unblock the Notifications











