Das Ka Dhamki 10 సార్లు రిజెక్ట్ చేశా.. విశ్వక్ సేన్ వెంటపడి ఒప్పించాడు.. నివేదా పేతురాజ్
యువ హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించి.. నిర్మాతగా నిర్మించిన తొలి పాన్ ఇండియా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌కు జంటగా నివేదా పేతురాజ్ నటించింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ట్రెండింగ్ అవుతున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మార్చి 22 తేదీన ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తే..
ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్‌ను ఎన్టీఆర్ డైరెక్ట్ చేయవద్దని చెప్పడం సరైనదే. నేను విశ్వక్ సేన్‌తో మాట్లాడుతూ.. నీవు డైరెక్ట్ చేస్తే.. నటించకు. నీవు పెద్ద హీరోను డైరెక్ట్ చేయమని చెప్పాను. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఆలోచించే విధంగా విశ్వక్ సేన్ ఆలోచిస్తాడు. అవకాశం ఉంటే బాలకృష్ణను డైరెక్ట్ చేయమని చెప్పాను. విశ్వక్ సేన్ టాలెంట్ మాటల్లో చెప్పలేను అని నివేదా పేతురాజ్ అన్నారు.

కథ నచ్చకపోతే.. ఏవో కారణాలు చెప్పి
నేను హీరో ఎవరు? పారితోషికం ఎంత? అనే విషయాలు పట్టించుకోను. నేను కథపైనే దృష్టిపెడుతాను. కథ నచ్చకపోతే నేను అసలే చేయను. ధమ్కీ సినిమా కథ విషయంలో నాకు క్లారిటీ లేకపోవడంతో నేను చేయనని చెప్పాను. కథ నచ్చకపోతే.. ఏవో కారణాలు చెప్పి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాను.
పాగల్ సినిమా కోసం నాతో పాత్ర చేయించాలని ఏడాదిన్నర వెయిట్ చేశాను. 10 సార్లు రిజెక్ట్ చేశాను. చివరకు చెన్నై వచ్చి కథ చెప్పడంతో సంతృప్తి చెందాను. దాంతో ఆ సినిమాను ఒప్పుకొన్నాను అని నివేదా పేతురాజ్ చెప్పారు.

విశ్వక్ సేన్ కెరీర్‌లో మైలురాయిగా
ధమ్మీ సినిమాను ఇంత వరకు చూడలేదు. చూసిన వాళ్లంతా బ్రహ్మండంగా ఉందని చెప్పారు. ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ సినిమాపై నాకు భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వక్ సేన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది.
ధమ్కీ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ధమ్కీ సినిమా తొలుత తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మూడు వారాల అనంతరం వివిధ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని నివేదా పేతురాజ్ అన్నారు.

దాస్ కా ధమ్కీ సినిమా గురించి
దాస్ కా ధమ్కీ సినిమాకు కథే బలం. రావు రమేష్ నటన, రోహిణి మేడమ్ ఫెర్ఫార్మెన్స్, పాటలు, సినిమాటోగ్రఫి బలమైన అంశాలు అని అన్నారు. హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. మరో సినిమా కూడా ఒప్పుకొన్నాను.

నిర్మాతగా మారే అవకాశాలు లేవు..
నేను నిర్మాతగా మారే అవకాశం లేదు. అయితే ఓ కథ నా వద్దకు వచ్చినప్పుడు.. 2, 3 కోట్లు అయితే నేను చేస్తానని చెప్పాను. కానీ వెంటనే మా అమ్మ.. జాతకం చూసి 20 నిమిషాల నోట్ పెట్టారు. సినిమాలు నిర్మించవద్దని బలంగా చెప్పారు. ప్రొడక్షన్ నేను చేయను గానీ.. భవిష్యత్‌లో నేను సినిమాను డైరెక్ట్ చేస్తాను.
నిర్మాతల కష్టాలు నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను. నేను జాతకాలు పెద్దగా పట్టించుకోను. కానీ నిర్మాత మారే విషయంలో మా అమ్మ చెప్పిన జాతకాన్ని నమ్ముతాను అని నివేదా పేతురాజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











