అన్యాయంగా తొక్కేసారు... ప్రతీకారం తీర్చుకోవడం దారుణం: రాయ్ లక్ష్మీ
Recommended Video

తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గుర్తింపు ఉన్న హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరు. అన్ని భాషల్లో అద్భుతంగా రాణిస్తూ పరిశ్రమల్లోని ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. గ్లామర్ పాత్రలకు పెద్ద పీట వేసే రాయ్ లక్ష్మీ ప్రస్తుతం తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. ఆ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా రాయ్ లక్ష్మీ తెలుగు ఫిల్మీబీట్ ముచ్చటించింది. రాయ్ లక్ష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

మీ టూ ఉద్యమం పక్కదారి పట్టింది
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై గళం విప్పిన మీటూ ఉద్యమం పక్కదారి పట్టింది. దాని లక్ష్యం పూర్తి కాకుండా దారుణంగా తప్పుదోవపట్టించారు. మీటూ ఉద్యమం వల్ల సినీ పరిశ్రమలో చాలా మార్పులు వస్తాయని ఆశించారు. కానీ అలాంటివి జరుగకపోవడం చాలా దారుణం. దానిని అందరూ మరిచిపోయారు.

అమ్మాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది
తమకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన అమ్మాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. చాలా మంది అరాచకాలను బయటకు తెచ్చిన అమ్మాయిల్లో చాలా మంది నిజాయితీగా ఉన్నారు. మరికొంత మంది కక్ష సాధింపు చర్యగా మీటూను ఆయుధంగా చేసుకొన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం మీడియా ముందుకొచ్చి మీటూ కాంపెయిన్‌ను దుర్వినియోగం చేశారు.

మీ టూ ఉద్యమం విఫలమైంది
టాలెంట్‌ను, అన్యాయాన్ని గుర్తించడంలో మీటూ ఉద్యమం విఫలమైంది. ఓ దశలో ఏది కరెక్ట్? ఏది అబద్ధం అనే విషయాన్ని బేరీజు వేసుకోలేకపోవడం కష్టంగా మారింది. పబ్లిక్ కూడా ఏది నిజమో అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. వాస్తవాలను, అవాస్తవాలను మీడియా ప్రచారం చేయడంతో దానిలో పస తగ్గింది.

అందుకే సపోర్ట్ చేయలేదు..
మీ టూ ఉద్యమం అంటే కొంత మంది అరాచకాలను వెలుగులోకి తెచ్చి వారికి చేదు అనుభవాన్ని మిగల్చడం. కానీ అది నెరవేరలేదు. సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రాసెస్‌ను మార్చే దిశగా అడుగులు వేయలేకపోయింది. దాంతో మీ టూ క్యాంపెయిన్‌కు సపోర్ట్ చేయలేదు. కొందరు చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి. మరికొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయని నాకు తెలుసు.


Click it and Unblock the Notifications











