స్వచ్ఛమైన ప్రేమ కథ అంటూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రీతూ వర్మ.. వరుడు కావలెను అంటూ
నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వరుడు కావలెను' సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో భూమి పాత్రలో నటించిన హీరోయిన్ రీతు వర్మ తన క్యారెక్టర్ గురించి సినిమా గురించి కొన్ని విశేషాలు మీడియాతో చెప్పుకుంది. ఆ విశేషాలు రీతు మాటల్లోనే...
పెళ్లి చూపులు లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. అలాంటి రోల్స్ కోసం ఎదురు చూశాను. కానీ స్క్రిప్ట్స్ కానీ రాలేదు. మధ్యలో తమిళంలో కొన్ని సినిమాలు చేశాను. కానీ వాటి రిలీజ్ ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్‌తో తెలుగులో ఓ సినిమా, తమిళం, తెలుగులో రూపొందే ఓ సినిమా చేస్తున్నా. అలాగే తమిళంలో మరో సినిమాతోపాటు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా. తెలుగులో ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు అని రీతూ వర్మ చెప్పారు.

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య గారు వరుడు కావలెను సినిమా కథ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు భూమి. ఆ క్యారెక్టర్ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది. హీరోయిన్లకు ఛాలెంజింగ్ రోల్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి క్యారెక్టర్‌తో నేను చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది. సినిమా చూశాక భూమి క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అని రీతూ వర్మ తెలిపారు.
వరుడు కావలెను సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లు చూసిన తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ కాదు. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. పాత్రల మధ్య భావోద్వేగాలు ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినేలా పాటలు ఉన్నాయి. శౌర్య పాత్ర చుట్టే సినిమా కథ తిరుగుతుంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల పొందే అనుభూతి ఈ సినిమా గురించి తెలియజేస్తుంది అని రీతూ వర్మ అన్నారు.
వరుడు కావలెను సినిమాలో భూమి పాత్రను అద్బుతంగా దర్శకులు లక్ష్మీ సౌజన్య తీర్చిదిద్దారు. మహిళా డైరెక్టర్ కాబట్టి రాశారని అనుకోను. పెళ్లి చూపులు సినిమాలో నా పాత్ర ఎంత బలంగా ఉంటుందో.. ఈ సినిమాలో భూమి పాత్ర అంతే బలంగా ఉంటుంది. ఓ యువతిగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ చెప్పారు అని రీతూ వర్మ చెప్పారు.
వరుడు కావలెను సినిమాలో నదియా విభిన్నమైన పాత్రను చేశారు. ఇప్పటివరకూ చేయని అద్బుతమైన పాత్రలో కనిపిస్తారు. ఆవిడతో నటించడం చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. సినిమాలో లవ్ స్టోరీ అందరికీ నచ్చేలా ఉంటుంది. రెగ్యులర్ గా అనిపించదు. ఓల్డ్ స్కూల్ రొమాన్స్ ఉంటుంది. ఇక నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు తప్ప ఆ విషయాన్ని నాకే వదిలేశారు అని రీతూ వర్మ చెప్పారు.


Click it and Unblock the Notifications











