Kartikeya Gummakonda తో నటించడం గొప్ప అనుభూతి.. ఆయన ఎలాంటి వారంటే.. రాజా విక్రమార్క హీరోయిన్ తాన్యా రవిచంద్రన్

ప్రమఖ తమిళనటుడు రవిచంద్రన్ మనవరాలిగా తాన్యా రవిచంద్రన్ సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. తమిళంలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తూ అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా రాణిస్తూనే భారీ సినిమాలను అందిపుచ్చుకొంటున్నారు. ప్రస్తుతం కార్తీకేయ గుమ్మకొండతో కలిసి రాజా విక్రమార్క అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై 88 రామారెడ్డి, ఆదిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ సారిపల్లి. టీజర్లు, ట్రైలర్లతో మంచి క్రేజ్‌ను, బజ్‌ను సొంతం చేసుకొన్న రాజా విక్రమార్క నవంబర్ 12వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ..

ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలిగా

ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలిగా

నేను రవిచంద్రన్ మనవరాలిగా అందరికి తెలుసు. నేను హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తుండగా నాకు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో మూడు సినిమాలు పూర్తి చేశాను. అయితే చదువు పూర్తయిన తర్వాత సినిమాలు చేయమని నా తల్లిదండ్రులు చెప్పారు. దాంతో నేను మళ్లీ నా పీజీని ఫినిష్ చేసి మళ్లీ సినిమా ఆఫర్లను అంగీకరించాను.

అలాంటి సమయంలో దర్శకుడు శ్రీ సారిపల్లి హైదరాబాద్ నుంచి నాకు కాల్ చేసి రాజా విక్రమార్క సినిమా గురించి చెప్పారు. దాంతో నాకు కథ చెప్పమని అడిగితే.. చెనై వచ్చి కథ చెప్పారు. ఆయన చెప్పిన కథ, నా పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను అని తాన్యా రవిచంద్రన్ తెలిపారు.

క్లాసికల్ డ్యాన్సర్‌గా, హోంమంత్రి కూతురిగా

క్లాసికల్ డ్యాన్సర్‌గా, హోంమంత్రి కూతురిగా

రాజా విక్రమార్క సినిమాలో నా పాత్ర పేరు కాంతి. కథలో కీలకమైన పాత్ర. ఇందులో స్టూడెంట్‌గా, క్లాసికల్ డ్యాన్సర్‌గా నటించాను. హోం మంత్రి కూతురు పాత్రలో కనిపిస్తాను. చాలా సింపుల్‌గా ఉండే యువతి పాత్ర. నేను గత 15 ఏళ్లుగా డ్యాన్స్ నేర్చుకొంటున్నాను. డ్యాన్సర్‌గా నేను ఈ రోల్‌కు కనెక్ట్ అయ్యాను. సినిమాలో మొత్తంగా నా రోల్ ట్రావెల్ అవుతుంది. నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది అని తాన్యా చెప్పారు.

ప్రయోగాత్మక చిత్రాలకు సిద్ధం

ప్రయోగాత్మక చిత్రాలకు సిద్ధం

నటిగా నాకు పరిధి, పరిమితులు లేవు. నా కెరీర్‌ను విషయంలో ప్రయోగాలు చేయాలని అనుకొంటున్నాను. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాల్లో కూడా నటించాలని అనుకొంటున్నాను. కథ, పాత్ర నాకు నచ్చి.. నాకు సరిపోతాయనుకొంటే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాను. ఛాలెంజింగ్ పాత్రల్లో కనిపించాలని అనుకొంటున్నాను. నేను నటించే సినిమాల్లో కమర్షియల్‌గా ఉండే డ్యాన్సుల్లో కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఐటెమ్ నంబర్ సాంగ్స్‌లో నటించాను. అని తాన్యా అన్నారు.

కార్తీకేయ గుమ్మకొండతో నటించడం గురించి

కార్తీకేయ గుమ్మకొండతో నటించడం గురించి

కార్తీకేయ గుమ్మకొండతో నటించడం చాలా కంఫర్ట్‌గా అనిపించింది. చాలా మంచి వ్యక్తి. తన సహచర నటి ఇబ్బంది పడకుండా చక్కటి హాస్పిటాలిటీని ఇచ్చారు. సినిమా పరిశ్రమకు కొత్త అనే ఫీలింగ్ రాకుండా చేయడంలో తన వంతు సహకారం అందించారు. తెలుగు సినిమా సులభంగా ఫినిష్ చేయడంలో కొలీగ్‌గా ఆయన మంచి సపోర్ట్ ఇవ్వడమే కాదు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్‌తోపాటు రాజమండ్రిలో జరిగింది. సాయికుమార్‌తోపాటు యూనిట్ అంతా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు అని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు.

Recommended Video

O Madhu Movie Trailer Is Out
దర్శకుడు శ్రీ సారిపల్లి మూవీతో

దర్శకుడు శ్రీ సారిపల్లి మూవీతో

దర్శకుడు శ్రీ సారిపల్లితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా షూటింగ్‌కు రెండు రోజులు ముందు నేను హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలో నాకు తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన స్క్రిప్టును ఇచ్చారు. ప్రతీ సన్నివేశాన్ని ఆయన నాకు చక్కగా వివరించారు. దాంతో ఆ పాత్రలో ఉండే ఎమోషన్స్‌ను అర్థం చేసుకోనేందుకు అవకాశం దక్కింది.

దర్శకుడు నా పాత్రను మలిచిన తీరు నాకు సంతృప్తిని కలిగించింది. ఏదైతే నాకు కథ చెప్పారో.. దానిని పక్కాగా తెర మీద చూపించాడు. ఏ దశలోను కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. ఇంకా ఈ సినిమాను నేను చూడలేదు. తెర మీద, ప్రేక్షకుల మధ్య చూడాలని అనుకొంటున్నాను అని తాన్యా రవిచంద్రన్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X