సైకాటిక్ విలన్‌గా చేస్తోన్న.. నన్ను ఇంతవరకు అలా ఎవరూ చూపించలేదు

భయపెట్టే పాత్రైనా, ప్రేమగా చూసుకునే బాబాయ్ పాత్రైనా ఎలాంటి క్యారెక్టర్ అయినా. తనదైన శైలిలో పండించే నటుడు ఆదిత్య మీనన్. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆదిత్య.. త్వరలో ఆర్‌డీఎక్స్ లవ్ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు వస్తున్నాడు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

'ఇలాంటి క్యారెక్టర్ కోసం నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఈ పాత్ర నా దగ్గరికి రావడానికి ముఖ్య కారణం సీ కల్యాణ్ గారే. మొదటగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కథ విన్నవెంటనే ఈ పాత్ర ఆదిత్య చేస్తే బాగుంటుందని చెప్పడం.. తరువాత డైరెక్టర్ భాను శంకర్ వచ్చి కథ చెప్పడం.. నచ్చడంతో నేను ఈ క్యారెక్టర్‌ను చేశాను. ఇదొక డిఫరెంట్ పాత్ర.. సైకోటిక్ విలన్‌గా చేస్తున్నాను.

 Adithya Menon Comments On RDX Love Movie

ఫస్ట్ డే షూటింగ్ రోజు వెళ్లాన.. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు ఫ్రేమ్స్ పెట్టారు.. ఇంతవరకు అలా నన్నెవరూ చూపించలేదు. చాలా బాగా చూపించారు. టీజర్ మీరు చూశారు.. మీకు నచ్చింది కదా.. సినిమా కూడా మీకు నచ్చుతుంది. ఇదొక ఫీమెట్ ఓరియెంటెడ్ కథ.. చాలా బాగా వచ్చింది.. చాలా రోజుల తరువాత ముమైత్ ఖాన్ కూడా రీఎంట్రీ ఇస్తోంది. ఆమెకు నాకు చాలా సీన్స్ ఉంటాయి. సినిమాను చూసి ఆదరించండ'ని అన్నారు.

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రేపు(అక్టోబర్ 11) విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఆర్‌డీఎక్స్ లవ్.. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X