ఎంఎస్ సుబ్బలక్ష్మి, రేఖ బయోపిక్స్‌లో నటించాలని.. మహా సముద్రంలో నా పాత్ర ఏమిటంటే.. అదితి రావు హైదరీ

సమ్మోహనం, వీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న అదితి రావు హైదరీ నటించిన తాజా చిత్రం మహా సముద్రం. ఈ సినిమాకు RX100 అందించిన అజయ్ భూపతి దర్శకుడు. ఎకే ఎంటర్‌మైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామబ్రహ్మం సుంకర. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్దార్థ్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా అదితి రావు హైదరీ మీడియాతో మాట్లాడుతూ..

వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌గా కథ

వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌గా కథ


మహ సముద్రం చిత్రంలో నా క్యారెక్టర్ పేరు మహా. చాలా కష్టపడి పనిచేసే యువతి పాత్ర. నేను చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పించే యువతి పాత్రలో నటిస్తున్నాను. పరిస్థితులు, సినిమా కథలో ట్విస్టుల ప్రకారం నా క్యారెక్టర్ పెరుగుదల అనూహ్యంగా ఉంటుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌గా కథ నడుస్తుంది. సింపుల్ ఫ్యామిలీతో లైఫ్ కొనసాగిస్తుంటుంది. చాలా ఓపెన్‌గా, హ్యాపీగా ఉంటూ మాట్లాడే స్వభావం ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది అని అదితి రావు హైదరీ అన్నారు.

అజయ్ భూపతి గురించి

అజయ్ భూపతి గురించి

మహా సముద్రం చిత్ర కథ చెప్పడానికి ముందే నేను అజయ్ భూపతి తీసిన RX100 మూవీ చూశాను. సినిమాపై ఉండే ఆయన కమాండ్, టెక్నిక్ చాలా గొప్పగా ఉంది. ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించే డైరెక్టర్‌. సినిమాపై ఉండే అవగాహన, ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి నా మది నుంచి తీసివేయలేకపోయాను. బలమైన కథలో క్యారెక్టర్లను ప్రేమిస్తూ తెర మీద కథ చెప్పే డైరెక్టర్. డైరెక్టర్, ఇద్దరు గొప్ప హీరోలు, మంచి నటీనటులు ఈ సినిమాను అంగీకరించడానికి కారణం అని అదితి రావు హైదరీ తెలిపారు.

మహా సముద్రం చిత్రంలో పాత్ర

మహా సముద్రం చిత్రంలో పాత్ర


ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో నా పాత్రలను డైరెక్టర్లు రూపొందించిన తీరుకు నేను ఫిదా అవుతుంటాను. మహా సముద్రం చిత్రంలో అలాంటి పాత్రనే అజయ్ భూపతి నాకోసం రాశాను. అజయ్ విజన్‌కు తగినట్టుగా నటించడానికి ప్రయత్నించాను. హీరోయిన్లను గొప్పగా ప్రోత్సహిస్తుంటాడు. నేను ఏ సీన్ చేసినా.. ఏంజెల్ అంటూ ప్రశంసలు గుప్పించాడు. హీరోలు ఎంత గొప్పగా నటించినా ఒకే అంటూ కట్ చెప్పేవాడు అని అదితి రావు హైదరీ పేర్కొన్నారు.

మణిరత్నం గురించి అదితి రావు

మణిరత్నం గురించి అదితి రావు

మహా సముద్రం చిత్రంలో ప్రేమానురాగాలు మంచి స్కోప్ ఉన్న చిత్రం. ఈ చిత్రంలో పాత్రల మధ్య మహా సముద్రమంత ప్రేమ ఉంటుంది. మహా క్యారెక్టర్‌ను అజయ్ భూపతి గొప్పగా ప్రేమించాడు. మహాను మదిలో నింపుకొని ఆమె ఇలా ఉంటుంది. ఇలా చేస్తుంది. అలా నవ్వుతుంది అని క్యారెక్టరైజేషన్ చేశాడు అని అదితిరావు చెప్పారు. నేను ఎప్పుడు దర్శకుల ముందు హీరోయిన్‌లా బిహేవ్ చేయను. ఓ స్టూడెంట్‌లో ప్రవర్తిస్తాను. ఈ విషయం నాకు గురువు, తండ్రి లాంటి మణిరత్నం నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను అని అదితి రావు హైదరీ అన్నారు.

నా పాత్ర చుట్టూ కథ తిరుగుతూ..

నా పాత్ర చుట్టూ కథ తిరుగుతూ..

మహా సముద్రంలో ప్రతీ క్యారెక్టర్‌ చుట్టూ తిరిగే చిత్ర కథ. అయితే నా పాత్రను బేస్ చేసుకొని సినిమా నడుస్తుంది. శర్వానంద్, సిద్దార్థ్ పాత్రల చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నా పాత్ర కాదు, హీరోలు కాదు.. ఈ సినిమాకు స్క్రిప్టు హీరో. ఏ హీరోతో కెమిస్ట్రీ బాగా పండిందనే విషయం నేను చెప్పడం సరికాదు. మీరు తెరపైన చూసి ఫీలై చెప్పాలి. ఇందులో సిద్దార్థ్, శరణ్య, నేను మణిరత్నం స్కూల్ నుంచి వచ్చాం. అజయ్ భూపతి ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చాం. కాబట్టి ఈ సినిమా ఎంత ఇంటెన్సివ్‌గా ఉంటుందో తెర మీద చూసి చెప్పాలి అని అదితి రావు హైదరీ అన్నారు.

Recommended Video

Hero Roshan Smart And Funny Answers | Pelli Sandadi
ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటించాలని..

ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటించాలని..


బయోపిక్‌లో నటించడం నాకు చాలా ఇష్టం. నాకు డ్యాన్స్, మ్యూజిక్ అంటే మరీ ఇష్టం. అలాంటి బ్యాక్ డ్రాప్‌తో ఉండే చిత్రాల్లో నటించాలని ఉంది. అవకాశం వస్తే.. ఎంఎస్ సుబ్బలక్ష్మి, రేఖ లాంటి ప్రముఖుల జీవిత కథల్లో నటించాలని ఉంది. రేఖ అంటే నాకు చాలా ఇష్టం. రేఖ పాత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోను అని అదితి రావు హైదరీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X