వరుణ్‌ తేజ్‌పై అదితి హాట్ కామెంట్.. కష్టాలు, ఇబ్బందులు.. కానీ వెనుకడగు వేయలేదు!

మణిరత్నం చెలియా సినిమాతో ఆకట్టుకొన్న అదితిరావు హైదరీ తాజాగా సమ్మోహనం సినిమాతో టాలీవుడ్‌లో సుస్థిర స్థానం సొంతం చేసుకొన్నది. ఈ హైదరాబాదీ అమ్మాయి.. ప్రస్తుతం అంతరిక్షం చిత్రంలో వరుణ్ తేజ్‌తో కలిసి స్పేస్ సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఘాజీ డైరెక్టర్ సంకల్స్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో అదితిరావు హైదరీ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి స్క్రిప్ట్ గురించి బేసిక్ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఆయన తీసిన ఘాజీ చూశాను. అది అద్భుతంగా ఉంది. పూర్తి స్క్రిప్టు చెప్పిన తర్వాత రియా పాత్రను వదులుకోవద్దని అనుకొన్నాను. ఇంకా అదితి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

 ట్రాయాంగిల్ లవ్ స్టోరి కాదు

ట్రాయాంగిల్ లవ్ స్టోరి కాదు

అంతరిక్షం సినిమా గురించి ఎక్కువగా చెప్పను. కానీ నేను స్పేస్ సెంటర్‌లో ఇంటెర్న్ (శిక్షణ పొందే) సైంటిస్టుగా నటించాను. శిక్షణ పొందిన తర్వాత స్పేస్ సైంటిస్ట్‌గా మారి కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగమవుతాను. ఇది ట్రాయంగిల్ లవ్ స్టోరి కాదు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఓ అతిథి పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపిస్తారు. అంతకంటే సినిమా గురించి ఏమీ చెప్పలేను.

చిన్న పాత్రలే అయితే తప్పేంటి

చిన్న పాత్రలే అయితే తప్పేంటి

బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించాను. నేనెప్పుడూ నా పాత్ర పెద్దదా? హీరోయినా? అనేది చూడలేదు. పరిణితి, ఆదిత్య లాంటి కూడా చిన్న పాత్రలు హీరో, హీరోయిన్లు అయ్యారు. నేను కూడా అలాంటి పద్ధతిని ఫాలో అయ్యాను. సినిమా విషయానికి వస్తే నీ పాత్ర 20 నిమిషాలు ఉంటుందా? రెండు గంటలు ఉంటుందా అనేది మ్యాటర్ కాదు. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్ అయిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. నేను ఎంపిక చేసుకొన్న పాత్రలు నాకు గర్వంగా అనిపిస్తాయి. నటన అనేది మాటల్లో చెప్పలేం. కెమెరా ముందు జరిగే ఓ మ్యాజిక్ మాత్రమే.

నేను ఐదేళ్ల అమ్మాయినే

నేను ఐదేళ్ల అమ్మాయినే

నటనపరంగా నేను ఐదేళ్ల అమ్మాయిని మాత్రమే. నటించడానికి నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. సమయం, ప్రయాణాలను పట్టించుకోను. ఆటలో మునిగిన చిన్న పిల్లలు ఇంటిని ఎలా పట్టించుకోరో ఓ సారి సినిమా ఒప్పుకొంటే నా పరిస్థితి కూడా అంతే. ఇటీవల ధనుష్ సినిమాలో నటించేటప్పుడు 12 రోజులు డబుల్ కాల్షీట్‌తో పనిచేశాను. నవాబ్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఎప్పుడూ టైమ్‌ను గానీ, అలసిపోయానని ఫీల్ కాలేదు. నిన్ను ఛాలెంజ్‌ చేసే మనుషులు, పాత్రలు ముందుకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. ఇంకా పని ఇవ్వండి అనే మూడ్‌లో ఉంటాను.

చాలా కష్టాలు అధిగమించాను

చాలా కష్టాలు అధిగమించాను

గత ఐదేళ్లలో నేను చాలా కష్టాలు అధిగమించాను. ఎన్నో ఇబ్బందులను చూశాను. కానీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. అయితే నేను ఏం సాధించానంటే కరెక్ట్‌గా చెప్పలేను. కానీ నటిగా నాకో సంతృప్తికరమైన జీవితం మిగిల్చింది. ప్రేక్షకుల నుంచి ప్రేమను పొందాను. అదే నాకు చాలనిపిస్తుంది. వీటి కంటే ఏది పొందినా గానీ మరోలా సంతృప్తిని ఇస్తుందో గానీ.. నటిగా పొందుతున్న ప్రేమనే ఎక్కువ అనిపిస్తుంది.

వరుణ్ తేజ్ గురించి అదితి

వరుణ్ తేజ్ గురించి అదితి

వరుణ్ తేజ్‌తో కలిసి పనిచేయడం అమేజింగ్. వరుణ్‌తోపాటు మరో ఇద్దరు నటులు ఉంటారు. మేమంత చక్కగా కలిసిపోయాం. అంతరిక్షంలోని సీన్లు చిత్రీకరించేటప్పుడు ఒకరికొకరం సూచనలు, సలహాలు తీసుకొనే వాళ్లం. వరుణ్‌తో కలిసి నటించే అవకాశం సరిగా దక్కలేదు. కానీ వరుణ్ మాత్రం మంచి సినిమాలు ఎంపిక చేసుకొంటాడని మాత్రం విన్నాను అని అదితి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X